ఎన్టీఆర్ సినిమాలోనా.. అంత సీన్ ఉందా?
ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌పై ప్రస్తుతం ఇండస్ట్రీలో సాలీడ్ క్రేజ్ క్రియేట్ చేసుకుంటోంది.;
ప్రశాంత్ నీల్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న మాస్ యాక్షన్ ఎంటర్టైనర్‌పై ప్రస్తుతం ఇండస్ట్రీలో సాలీడ్ క్రేజ్ క్రియేట్ చేసుకుంటోంది. 'కేజీఎఫ్', 'సలార్' వంటి హిట్ ఫిలింస్ తర్వాత ప్రశాంత్ నీల్ తీస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక ఎన్టీఆర్ 'దేవర' తర్వాత చేస్తున్న పాన్ ఇండియా ప్రాజెక్ట్ ఇది కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి ఎక్కువైంది.
మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాను 2026లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభమై ఎన్టీఆర్ పాల్గొన్నట్లు అధికారికంగా సమాచారం వచ్చింది. అయితే ఈ ప్రాజెక్ట్ విషయంలో అనేక రకాల వదంతులు గుప్పుమంటున్నాయి. ఎన్టీఆర్ కెరీర్‌లోనే మోస్ట్ ఇంటెన్స్ రోల్ లో కనిపించబోతున్నాడని, ప్రశాంత్ నీల్ స్టైల్ మాస్ యాక్షన్ సీన్‌లు ఈ సినిమాకు హైలైట్‌గా నిలవనున్నాయని వార్తలు వస్తున్నాయి.
మరీ ముఖ్యంగా మ్యూజిక్ డైరెక్టర్‌గా రవి బస్రూర్‌తో కలసి విజువల్ ట్రీట్ అందించేందుకు టీమ్ రెడీ అవుతోంది. భారీ పోర్ట్ సెట్‌లు, నయా బ్యాక్‌డ్రాప్ తో సినిమా ఉంటుందని టాక్. ఇక లేటెస్ట్ హాట్ టాపిక్ ఏంటంటే.. మలయాళీ ముద్దుగుమ్మ మమిత బైజు ఈ సినిమాలో ఛాన్స్ కొట్టేసిందట. 'ప్రేమలు' సినిమాతో యూత్ హార్ట్‌లను దోచుకున్న మమిత ఇప్పుడు ఎన్టీఆర్ సినిమా వరకు వచ్చేసిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
సినిమాలో ఓ కీలక పాత్ర కోసం మమితను తీసుకున్నారని టాక్. అయితే ఇది లీడ్ రోల్‌నా? లేక సపోర్టింగ్ రోలా? అన్న విషయం ఇంకా క్లారిటీ లేదు. అయినా ప్రశాంత్ నీల్ సినిమా అంటే చిన్న పాత్రైనా కూడా గొప్ప గోల్డెన్ ఛాన్స్ అనే చెప్పాలి. మమిత కెరీర్‌కు ఇది రికార్డ్ గా మారే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రస్తుతం మమిత దళపతి విజయ్ నటిస్తున్న 'జన నాయగన్' సినిమాలో నటిస్తోంది. మలయాళం, తమిళం భాషల్లో అవకాశాలతో బిజీగా మారింది. తెలుగులో 'ప్రేమలు' హిట్ తర్వాత మమిత పాపులారిటీ అమాంతం పెరిగిపోయింది. ఇక ఇప్పుడు ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమా గురించి వస్తున్న గాసిప్‌లు నిజమైతే.. ఆమె తెలుగు ప్రేక్షకుల్లో ఇంకాస్త బలమైన ఇమేజ్ సంపాదించుకుంటుందని ట్రేడ్ అనలిస్టులు అభిప్రాయపడుతున్నారు.
ఇక ఎన్టీఆర్ తన పాత్ర కోసం గట్టిగానే ట్రాన్స్‌ఫర్మేషన్ చేశారట. 18 కేజీల బరువు తగ్గి స్లిమ్ లుక్ లో కనిపించేందుకు రోజుకు మూడు గంటలు వర్కౌట్ చేశారని తెలుస్తోంది. అలాగే ప్రత్యేక డైట్ ఫాలో అవుతూ, ఫ్యాట్ ఎంకరేజ్ చేయకుండా హై ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటూ రూపం మార్చుకున్నారని చెబుతున్నారు. ఈసారి తారక్ నుంచి ఫిజికల్ ట్రాన్స్‌ఫర్మేషన్ పరంగా కూడా అదిరిపోయే సర్ప్రైజ్ రావొచ్చని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మాస్ మూవీ.. ఎన్టీఆర్ కెరీర్‌లోనే మరో బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలవాలని అభిమానులు ఆశిస్తున్నారు. మరి మమిత నిజంగా ఈ సినిమాలో భాగమవుతుందా అన్నది త్వరలోనే క్లారిటీ రానుంది.