ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అఫీషియల్ క్లారిటీ.. వాళ్ళతో సంబంధం లేదట
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత సినీ ప్రముఖుల పేరుతో ఎన్నో రకాల సంస్థలు, అకౌంట్లు పుట్టుకొస్తున్నాయి.
సోషల్ మీడియా వాడకం పెరిగిన తర్వాత సినీ ప్రముఖుల పేరుతో ఎన్నో రకాల సంస్థలు, అకౌంట్లు పుట్టుకొస్తున్నాయి. ఇందులో కొన్ని అధికారికంగా ఉంటే ఇంకొన్ని ఎలాంటి పర్మిషన్ లేకుండా నడుస్తుంటాయి. ఇటీవల టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ పేరుతో కూడా ఒక సంస్థ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు ఆయన బృందం గుర్తించింది. RAW NTR అనే పేరుతో నడుస్తున్న ఈ సంస్థ డైరెక్ట్ గా ఎన్టీఆర్ కు సంబంధించినది అనే భావన కలిగించేలా వ్యవహరిస్తున్నట్లు వాళ్ళ దృష్టికి వచ్చింది. దీనిపై ఫ్యాన్స్ లో ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండకూడదనే ఉద్దేశంతో ఆయన టీమ్ ఒక ప్రెస్ నోట్ ద్వారా పూర్తి వివరాలు వెల్లడించింది.
ఈ వ్యవహారంపై వస్తున్న వార్తలకు చెక్ పెడుతూ ఎన్టీఆర్ కార్యాలయం నుంచి ఒక అధికారిక ప్రకటన విడుదలైంది. అందులో చాలా క్లియర్ గా ఆ సంస్థతో తమకు ఉన్న ఈక్వేషన్ ఏంటో చెప్పారు. రా ఎన్టీఆర్ అనే సంస్థతో కానీ వాళ్లు చేసే కార్యక్రమాలతో కానీ ఎన్టీఆర్ కు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. ఎవరైనా ఆ పేరు చూసి మోసపోకూడదనే ఉద్దేశంతో ఆయన ఆఫీస్ కు కూడా ఈ సంస్థతో ఎలాంటి అనుబంధం, అనుమతి లేదా ప్రమేయం లేదని ఆ లెటర్ లో క్లియర్ గా మెన్షన్ చేశారు.
ఒక హీరో ఇమేజ్ ను ఉపయోగించుకుని కార్యక్రమాలు చేసేటప్పుడు కచ్చితంగా లీగల్ గా కొన్ని రూల్స్ ఉంటాయి. వాటిని ఉల్లంఘిస్తూ పని చేస్తున్న ఆ సంస్థకు ఎన్టీఆర్ తరఫున ప్రాతినిధ్యం వహించే హక్కు ఏమాత్రం లేదని ఆఫీస్ బృందం వెల్లడించింది. ఆయన పేరు మీద ఎలాంటి ప్రకటనలు చేయడానికి కానీ, ఈవెంట్స్ నిర్వహించడానికి కానీ వాళ్లకు ఎలాంటి అధికారం లేదని తమ స్టేట్మెంట్ లో స్ట్రాంగ్ గా పేర్కొన్నారు.
ఇకపై ఎన్టీఆర్ కు సంబంధించిన ఏదైనా సమాచారం బయటకు రావాలంటే అది కేవలం అఫిషియల్ గా వస్తుందని టీమ్ ఒక క్లారిటీ ఇచ్చింది. ఏదైనా సేవా కార్యక్రమం, ఏదైనా ఈవెంట్స్ గురించి చెప్పాలన్నా ఆయన అధికారిక బృందం ద్వారా మాత్రమే క్లారిటీ వస్తుందని వివరణ ఇచ్చారు. అలా కాకుండా అనధికారిక వ్యక్తులు, సంస్థల ద్వారా వచ్చే సమాచారాన్ని గానీ ప్రకటనలను గానీ అఫిషియల్ గా తీసుకోవద్దని అభిమానులకు ఒక సూచన చేశారు.
ఈ రా ఎన్టీఆర్ ఇష్యూ మీద భవిష్యత్తులో మళ్లీ ఎలాంటి చర్చ రాకుండా ఉండేలా ఇదే తమ ఫైనల్ స్టేట్మెంట్ అని ఎన్టీఆర్ ఆఫీస్ ప్రకటించింది. ఈ ఒక్క వివరణతో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో జరుగుతున్న ఊహాగానాలు, వదంతులకు పూర్తిగా ఎండ్ కార్డ్ పడుతుందని తాము ఆశిస్తున్నట్లు వారు తెలిపారు. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ తో పాటు మీడియా వేదికలు కూడా అఫీషియల్ సోర్సెస్ ద్వారా వచ్చే న్యూస్ మాత్రమే నమ్మాలని, ఫేక్ సమాచారాన్ని ప్రచారం చేయొద్దని విజ్ఞప్తి చేశారు.
చివరగా అభిమానులు చూపిస్తున్న నిరంతర ప్రేమకు, ఇస్తున్న మద్దతుకు కృతజ్ఞతలు అని వివరణ ఇచ్చారు. హీరోల పేరు మీద ఇలాంటివి జరిగినప్పుడు సంబంధిత వ్యక్తులు సైలెంట్ గా ఉంటే అది రాబోయే రోజుల్లో పెద్ద ఇష్యూ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ఎన్టీఆర్ టీమ్ వెంటనే అలర్ట్ అయి ప్రజల్లోకి తప్పుడు సమాచారం వెళ్లకుండా సరైన సమయంలో కల్పించుకుని ఒక ప్రెస్ నోట్ ద్వారా క్లారిటీ ఇచ్చింది.