చెన్నై లవ్ స్టోరీ లో అదే హైలైట్?.. రిలీజ్‌కు ముందే మణిశర్మ మ్యాజిక్‌పై చర్చ
ఇటీవల ప్రేక్షకుల అభిరుచిలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. కేవలం స్టార్ క్యాస్ట్ లేదా భారీ బడ్జెట్ మాత్రమే కాదు, మంచి మ్యూజిక్ ఉన్న సినిమాలపై కూడా ఆడియన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
ఇటీవల ప్రేక్షకుల అభిరుచిలో ఒక ఆసక్తికరమైన మార్పు కనిపిస్తోంది. కేవలం స్టార్ క్యాస్ట్ లేదా భారీ బడ్జెట్ మాత్రమే కాదు, మంచి మ్యూజిక్ ఉన్న సినిమాలపై కూడా ఆడియన్స్ స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ముఖ్యంగా ప్రేమకథా చిత్రాల్లో సాంగ్స్ హిట్ అయితే, సినిమా రిలీజ్‌కు ముందే వాటికి ప్రత్యేక గుర్తింపు వస్తోంది. ఇప్పుడు అలాంటి డిస్కషనే చెన్నై లవ్ స్టోరీ చుట్టూ కూడా సాగుతోంది.
ఈ సినిమాకు మ్యూజిక్ అందించిన మణిశర్మ మరోసారి తన మెలోడీలతో ఆకట్టుకున్నారని మ్యూజిక్ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లలో మంచి రెస్పాన్స్ తెచ్చుకోవడంతో, సినిమా కథ కంటే ముందే దాని ఆల్బమ్ ఆడియన్స్ దృష్టిని ఆకర్షిస్తోంది. ఒకప్పుడు లవ్ స్టోరీలకు మ్యూజికే ప్రాణంగా నిలిచిన రోజులను గుర్తు చేస్తూ, ఈ ఆల్బమ్ కూడా అదే తరహా ఫీలింగ్ ఇస్తోందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో మూవీ టీమ్ మణిశర్మ బర్త్ డే సెలబ్రేషన్ ను స్పెషల్ గా సెలబ్రేట్ చేయడం కూడా ఆడియన్స్ లో చర్చనీయాంశమైంది. హీరో కిరణ్ అబ్బవరం, హీరోయిన్ శ్రీ గౌరి ప్రియ, నిర్మాతలు ఎస్‌కేఎన్, సాయి రాజేశ్, డైరెక్టర్ రవి నంబూరి కలిసి మణిశర్మ పుట్టినరోజు వేడుకల్ని మరింత ప్రత్యేకంగా మార్చారు. కలర్ ఫొటో, బేబి వంటి సక్సెస్‌ల తర్వాత ఎస్‌కేఎన్- సాయి రాజేష్ కాంబినేషన్ నుంచి వస్తున్న ఈ సినిమాకు కథను సాయి రాజేష్ అందించగా, రవి నంబూరి దర్శకత్వం వహించారు.
ప్రేమకథా నేపథ్యంలో రూపొందిన చెన్నై లవ్ స్టోరీ ఈ నెల 24న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చూస్తుంటే, చెన్నై లవ్ స్టోరీ గురించి జరుగుతున్న డిస్కషన్స్ లో కథ, ట్రైలర్‌తో పాటు మణిశర్మ మ్యూజిక్ కూడా మెయిన్ ఎట్రాక్షన్ గా మారింది. రిలీజ్ తర్వాత ఈ మ్యూజికల్ బజ్ బాక్సాఫీస్ సక్సెస్ గా మారుతుందా లేదా అన్నది ఆసక్తిగా మారింది.