లెనిన్ మండే టెస్ట్.. ఇది పరిస్థితి
సినిమా ఏదైనా సరే మొదటి వీకెండ్ ముగిసిన తర్వాత సోమవారం రోజు ఎలాంటి హోల్డ్ చూపిస్తుందనేదే అసలైన మ్యాటర్.
సినిమా ఏదైనా సరే మొదటి వీకెండ్ ముగిసిన తర్వాత సోమవారం రోజు ఎలాంటి హోల్డ్ చూపిస్తుందనేదే అసలైన మ్యాటర్. బాక్సాఫీస్ దగ్గర లాంగ్ రన్ ఉండాలా లేదా అనేది ఈ మండే టెస్ట్ మీదే ఆధారపడి ఉంటుంది. అక్కినేని అఖిల్ లేటెస్ట్ మూవీ లెనిన్ విషయంలో కూడా ఆడియన్స్ లో ఇదే ఆసక్తి కనిపించింది. ఈ క్రమంలోనే చిత్ర యూనిట్ సోషల్ మీడియాలో ఒక కొత్త పోస్టర్ వదిలి ఫుల్ బజ్ క్రియేట్ చేసే పనిలో పడింది.
విడుదలైనప్పటి నుండి డీసెంట్ టాక్ తో నడుస్తున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామా కాస్త క్రిటికల్ అయిన నాలుగో రోజు కూడా గట్టిగానే నిలబడినట్లు మేకర్స్ పోస్టర్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. కేవలం నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా 67.2 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు దాటినట్లు మేకర్స్ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు. వర్కింగ్ డే అయిన సోమవారం నాడు కూడా రెస్పాన్స్ బాగుండటంతో ఈ వీక్ మొత్తం సినిమా సేఫ్ జోన్ లో రన్ అయ్యే ఛాన్స్ ఉందని టీమ్ భావిస్తోంది.
వీకెండ్ తర్వాత కలెక్షన్స్ డ్రాప్ అవుతాయనే కామెంట్స్ కు ఈ పోస్టర్ తో ఒక రకంగా ఫుల్ స్టాప్ పెట్టినట్లు అయింది. సోషల్ మీడియాలో రకరకాల నంబర్స్ తిరుగుతున్న టైమ్ లో, మేకర్స్ స్వయంగా అఫీషియల్ ఫిగర్స్ తో ముందుకు రావడం సినిమాపై ఉన్న బజ్ ను మరింత పెంచింది. వసూళ్ల విషయంలో ట్రేడ్ లెక్కలు ఎలా ఉన్నా, నాలుగో రోజు కూడా ఈ రేంజ్ లో గ్రాస్ రావడం ఫ్యాన్స్ లో కొత్త జోష్ నింపింది. థియేటర్ల దగ్గర సినిమా వైబ్ ఇంకా తగ్గలేదని మేకర్స్ మరింత బజ్ పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
మొదటి మూడు రోజులు ఫ్యామిలీ ఆడియన్స్, మాస్ క్లాస్ అనే తేడా లేకుండా థియేటర్లకు రావడం సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. అయితే వీకెండ్ హడావుడి అయిపోయిన తర్వాత కూడా హోల్డ్ బాగుందని మేకర్స్ చెబుతున్నారు. టికెట్ బుకింగ్స్ లో పెద్దగా డ్రాప్స్ కనిపించకుండా సోమవారం నాడు కూడా రన్ కొనసాగడం బట్టి చూస్తే, పబ్లిక్ లో ఉన్న స్ట్రాంగ్ మౌత్ టాక్ సినిమాను గట్టిగానే డ్రైవ్ చేస్తోందని అర్థం చేసుకోవచ్చు.
మురళీ కిశోర్ అబ్బురు డైరెక్షన్ లో వచ్చిన ఈ పీరియాడిక్ రివెంజ్ డ్రామాలో అఖిల్ మేకోవర్ తో పాటు యాక్షన్ ఎపిసోడ్స్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యాయి. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే స్క్రీన్ ప్రెజెన్స్, తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు కావాల్సిన సపోర్ట్ అందించాయి. నాగార్జున, నాగవంశీ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా రిచ్ గా తెరకెక్కించారు.
ఈ నాలుగు రోజుల వసూళ్ల ట్రెండ్ చూస్తుంటే లెనిన్ రాబోయే రోజుల్లో మరిన్ని వసూళ్లు రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొదటి నాలుగు రోజుల్లోనే 67.2 కోట్లు దాటినట్లు మేకర్స్ చెప్తున్న నేపథ్యంలో, రాబోయే సెకండ్ వీకెండ్ నాటికి ఈ నెంబర్ ఎక్కడికి చేరుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. ఇక లాంగ్ రన్ లో ఈ పీరియాడిక్ డ్రామా బాక్సాఫీస్ దగ్గర ఇంకెన్ని కొత్త రికార్డులను సెట్ చేస్తుందో వేచి చూడాలి.