డ్రాగన్: వేరే లెవ‌ల్ అంటూ స్కైలో లేపాడు

ఇలాంటి స‌మ‌యంలో ఎన్టీఆర్ `డ్రాగ‌న్` ఎలా ఉండ‌బోతోందో మైత్రి మూవీ మేక‌ర్స్ అధినేత ర‌విశంక‌ర్ ఇచ్చిన హింట్ తార‌క్ అభిమానుల్లో ఎగ్జ‌యిట్‌మెంట్‌ని అమాంతం పెంచింది.;

Update: 2025-09-29 04:21 GMT

కేజీఎఫ్, కేజీఎఫ్ 2, స‌లార్.. వ‌రుస‌గా పాన్ ఇండియా బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో సంచ‌ల‌నాలు సృష్టించాడు ప్ర‌శాంత్ నీల్. య‌ష్‌, ప్ర‌భాస్ లాంటి స్టార్ల‌కు మ‌రో లెవ‌ల్ సినిమాల‌ను అందించాడు. అందుకే ఇప్పుడు అత‌డు ఎన్టీఆర్‌తో డ్రాగ‌న్ సినిమాని రూపొందిస్తుంటే, అభిమానుల్లో ఎగ్జ‌యిట్‌మెంట్ అంత‌కంత‌కు పెరుగుతోంది. ఎన్టీఆర్‌ని నీల్ పెద్ద తెర‌పై ఎలా చూపించ‌బోతున్నారు? ఎంపిక చేసుకున్న టైటిల్ కి త‌గ్గ‌ట్టే తారక్ రోల్ ఎంత ప‌వ‌ర్ ఫుల్ గా ఉండ‌బోతోంది? అంటూ ఆరాలు తీస్తున్నారు. మ‌రోసారి ప్ర‌శాంత్ నీల్ నుంచి భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని అభిమానులు ఆశిస్తున్నారు.

ఇలాంటి స‌మ‌యంలో ఎన్టీఆర్ `డ్రాగ‌న్` ఎలా ఉండ‌బోతోందో మైత్రి మూవీ మేక‌ర్స్ అధినేత ర‌విశంక‌ర్ ఇచ్చిన హింట్ తార‌క్ అభిమానుల్లో ఎగ్జ‌యిట్‌మెంట్‌ని అమాంతం పెంచింది. కాంతార చాప్ట‌ర్ 1 ప్రీరిలీజ్ వేడుక‌లో ర‌విశంక‌ర్ మాట్లాడుతూ ''వ‌చ్చే నెల‌లో డ్రాగ‌న్ కొత్త‌ షెడ్యూల్ ప్రారంభ‌మ‌వుతుంది. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా శ‌ర‌వేగంగా చిత్రీక‌ర‌ణ‌ పూర్తి చేస్తున్నాం. సినిమా ఎలా ఉంటుందో చెప్పాలంటే, అది మీ ఊహ‌ల‌కే వ‌దిలేస్తున్నాం.. అది వేరే లెవ‌ల్ లో ఉంటుంది!'' అని అన్నారు.

కాంతార చాప్ట‌ర్ 1 చిత్రాన్ని నైజాంలో రిలీజ్ చేస్తున్నందున మైత్రి అధినేత‌ హోంబ‌లే కు ప్ర‌త్యేకించి ధ‌న్య‌వాదాలు తెలిపారు. హోంబ‌లే అధినేత విజ‌య్ కిరంగ‌దూర్ మంచి స్నేహితుడు. ఆయ‌న హోంబ‌లేను కేవ‌లం ఐదేళ్ల‌లోనే అసాధార‌ణ స్థాయికి చేర్చారు. కేజీఎఫ్, కేజీఎప్ 2, స‌లార్ 2, కాంతార చాప్ట‌ర్ 1, కాంత‌ర చాప్ట‌ర్ 2 .. ఇలా అద్భుత‌మైన సినిమాల లైన‌ప్ ఉంది. ప్ర‌శాంత్ నీల్ గారిని ఈ రోజు మిస్స‌యాం. ఆయ‌న వ్య‌క్తిగ‌త ప‌నిపై వేరొక చోట ఉన్నారు. ఎన్టీఆర్- రిష‌బ్ స్నేహాన్ని చూస్తే, వాళ్లిద్ద‌రూ సోద‌రుల్లా క్లోజ్ గా ఉంటారు. పెర్ఫామెన్సెస్ లోను ఇద్ద‌రూ పోటీప‌డుతారు. ఎన్టీఆర్ పెర్ఫామెన్స్ గురించి మీకు తెలుసు. రిష‌బ్ శెట్టి ప్ర‌ద‌ర్శ‌న కాంతార-1లో చూస్తారు.. అని ర‌విశంక‌ర్ అన్నారు.

కాంత‌ర ప్రీక్వెల్ కాంతార చాప్టర్ 1, అక్టోబర్ 2న దసరా సందర్భంగా విడుదలకు సిద్ధంగా ఉంది. రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రం పౌరాణిక జాన‌ప‌ద క‌థాంశంతో ర‌క్తి క‌ట్టించ‌నుంది. హైద‌రాబాద్ లో జ‌రిగిన ప్రీరిలీజ్ వేడుక‌లో జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రిషబ్ శెట్టి, హీరోయిన్ రుక్మిణి వసంత్ త‌దిత‌రులు అటెండ‌య్యారు.

Tags:    

Similar News