కిక్కిచ్చేలా.. డ్రాగన్ లీక్స్!
పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ‘డ్రాగన్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే.;
పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ కాంబో మూవీ ‘డ్రాగన్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న విషయం తెలిసిందే. 'కేజీఎఫ్', 'సలార్' వంటి విజయాల తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ నటిస్తున్న ఈ చిత్రం, అభిమానుల కోసం విజువల్ ఫెస్టివల్‌గా రూపొందుతోంది.
మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మాస్, మిస్టిక్, ఎమోషన్ మిక్స్ ఉన్న కథే ప్రధాన ఆకర్షణగా నిలవనుందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే జరిగిన రషెస్ స్క్రీనింగ్ గురించి ఇప్పుడు టాక్ వైరల్ అవుతోంది. టెక్నికల్ ఎలిమెంట్స్ లేని రఫ్ కట్‌ను చూసిన రిలయబుల్ సొర్సెస్ ప్రకారం… సినిమాలో డీఐ, విజువల్ ఎఫెక్ట్స్, రీ రికార్డింగ్ లేకపోయినా పూనకాలు వచ్చే విధంగా ఔట్‌పుట్ ఉందట.
అంటే.. సినిమాకు ఇంకా తుది మెరుగులు కూడా పడకముందే అందరికీ గూస్ బంప్స్ వచ్చేలా ఉందంటే, పూర్తయిన తర్వాత ఏ రేంజ్‌లో ఉంటుందో ఊహించడమే కష్టం. పైగా ఇందులోని పాత్రలు, ట్రీట్మెంట్, కథనశైలి ప్రేక్షకులను పూర్తిగా కట్టిపడేస్తాయని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమా టైటిల్ విషయంలో కూడా సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది.
'డ్రాగన్' అనే పేరు తప్ప మరొకటి ఈ సినిమాకు సరిపోదని ఫీల్ అవుతున్నారు ఫ్యాన్స్. ఇది కేవలం సినిమా కాదు, రికార్డుల మీద రైడ్ చేసే ఓ మాస్ బ్లాక్ బస్టర్ అవుతుందనే నమ్మకం ఏర్పడుతోంది. ప్రత్యేకంగా ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్‌తో పాటు ప్రశాంత్ నీల్ యాక్షన్ బ్లాక్స్ అన్ని కలిస్తే ఈ సినిమా పదేళ్ల పాటు పాన్ ఇండియా స్థాయిలో చర్చకు వస్తుందని ఫ్యాన్స్ అంటున్నారు.
ఇంతవరకూ విడుదలైన కొన్ని లుక్ ఫోటోలు, సెట్స్ లో వెలువడుతున్న అప్‌డేట్స్ ద్వారా సినిమాపై భారీ క్రేజ్ ఏర్పడింది. రష్మిక మందన్నా స్పెషల్ సాంగ్ చేయబోతున్నారనే టాక్‌తో మరింత హైప్ పెరిగింది. ప్రస్తుతం యాక్షన్ బ్లాక్స్ షూటింగ్ జోరుగా సాగుతుండగా, రవి బస్రూర్ కంపోజ్ చేస్తున్న మ్యూజిక్ కూడా స్పెషల్ హైలైట్ కానుందట. రుక్మిణి వసంత హీరోయిన్‌గా నటిస్తుండగా, ఈ కాంబినేషన్ కూడా కొత్త ఫీల్‌ను అందించనుందని భావిస్తున్నారు.