దేవర-2.. ఇదే నిజమైతే ఫ్యాన్స్ హ్యాపీ?

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే.;

Update: 2025-08-15 07:34 GMT

టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా వార్-2 మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. బీ టౌన్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన మూవీలో యాక్ట్ చేశారు. బాలీవుడ్ డెబ్యూతో ఇప్పుడు థియేటర్స్ లో సందడి చేస్తున్నారు.

ప్రస్తుతం కన్నడ ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కూడా వర్క్ చేస్తున్నారు. ఆ సినిమా షూటింగ్ ఇప్పుడు శరవేగంగా జరుగుతుండగా.. వచ్చే ఏడాది థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అదే సమయంలో తారక్ లైనప్ లో బోలెడు చిత్రాలు ఉన్నాయి. దీంతో మరి కొన్నాళ్లపాటు జూనియర్ ఎన్టీఆర్ కు అసలు ఖాళీ ఉండదని చెప్పాలి.

ఎన్టీఆర్ లైనప్ లో ఉన్న చిత్రాల్లో దేవర-2 ఒకటన్న విషయం తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వంలో తారక్ నటించిన దేవర సినిమా ఇప్పటికే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ మూవీకి సీక్వెల్ ఉంటుందని అప్పుడే మేకర్స్ అనౌన్స్ చేశారు. కొరటాల శివ కూడా స్క్రిప్ట్ వర్క్ ను ఇప్పటికే కంప్లీట్ చేశారని కూడా తెలుస్తోంది.

దీంతో త్వరలోనే మూవీ సెట్స్ పైకి వెళ్లనుందని ఈ మధ్య వార్తలు వచ్చాయి. కానీ ఇప్పుడు దేవర-2ను తారక్ పక్కన పెట్టారని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. నీల్ మూవీ తర్వాత త్రివిక్రమ్, నెల్సన్ తో వర్క్ చేయాలని యోచిస్తున్నారని ఇప్పుడు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది.

అయితే ఆ విషయంలో వైరల్ గా మారగా, నెటిజన్లు స్పందిస్తున్నారు. అదే నిజమైతే.. పూర్తిగా ప్రాజెక్ట్ ను పక్కన పెట్టినా కొందరు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ అని అంటున్నారు. నిజానికి దేవర మూవీ రిలీజ్ అయ్యాక సీక్వెల్ ఇక వద్దని అనేక మంది అభిమానులు అభిప్రాయపడ్డారు. రెండో భాగం అవసరం లేదని పలువురు కామెంట్లు పెట్టారు.

ఆ తర్వాత సినిమా రద్దు అయిందని వార్తలు వచ్చాయి. అదే సమయంలో తారక్ మాత్రం దేవర-2 ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. కొన్ని నెలల క్రితం మ్యాడ్ స్క్వేర్ ఈవెంట్ కు వచ్చి కూడా అదే విషయాన్ని చెప్పారు. దీంతో సినిమా ఉంటుందని అంతా ఓ నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు హోల్డ్ లో పెట్టారని టాక్ వినిపిస్తుండగా.. హ్యాపీగా ఫీల్ అవుతున్నారేమో. మరి చివరికి ఏం జరుగుతుందో వేచి చూడాలి.

Tags:    

Similar News