నవంబర్ నెలలో రీ రిలీజ్ కి సిద్ధమవుతున్న చిత్రాలివే!
ఇకపోతే ఇప్పటివరకు అధికారికంగా మూడు చిత్రాలు ప్రకటించగా.. ఏ చిత్రం ఎప్పుడు రీ రిలీజ్ కాబోతోంది అనే విషయం ఒకసారి చూద్దాం.;
సినీ సెలబ్రిటీలకు సంబంధించి ఏదైనా స్పెషల్ సందర్భం ఉంది అంటే కచ్చితంగా ఆయా హీరోలు, దర్శకులకు సంబంధించిన చిత్రాలు రీ రిలీజ్ అవుతూ.. అభిమానులకు మంచి వినోదాన్ని పంచుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ నవంబర్ నెలలో ఏకంగా మూడు చిత్రాలు రీ రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండడం గమనార్హం. ఇకపోతే ఇప్పటివరకు అధికారికంగా మూడు చిత్రాలు ప్రకటించగా.. ఏ చిత్రం ఎప్పుడు రీ రిలీజ్ కాబోతోంది అనే విషయం ఒకసారి చూద్దాం.
కమలహాసన్ - విక్రమ్ :
2022లో విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ విక్రమ్. రీ ఎంట్రీలో కమలహాసన్ కెరీర్ కు గట్టి కం బ్యాక్ ఇచ్చిన చిత్రం అని చెప్పవచ్చు. ఫుల్ రన్ ముగిసే సరికి ప్రపంచవ్యాప్తంగా 430 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి రికార్డు సృష్టించింది . ఒక తమిళంలోనే 182 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి ఆ సమయంలో అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన చిత్రంగా రికార్డు సృష్టించింది. నవంబర్ 7వ తేదీన కమల్ హాసన్ పుట్టినరోజు కావడంతో.. ఈ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. హైదరాబాదులోని సంధ్య 35 ఎంఎం, విమల్ 70mm థియేటర్ లతోపాటు విజయవాడలో అలంకార్, వైజాగ్లో సంఘం థియేటర్లలో స్పెషల్ స్క్రీనింగ్ చేయనున్నారు.
నాగార్జున - శివ :
నాగార్జున, రామ్ గోపాల్ వర్మ కలసి తెరకెక్కించిన పాత్ బ్రేకింగ్ మూవీ శివ. ఇద్దరి కెరియర్ లో మైల్ స్టోన్ గా నిలిచిన చిత్రం ఇది. అలాంటి ఈ చిత్రాన్ని ఇప్పుడు 4k క్వాలిటీ లో హై ఎండ్ టెక్నాలజీని వాడి కొత్త హంగులు దిద్ది డాల్బీ అట్మాస్ సౌండ్ తో రీ రిలీజ్ చేయనున్నారు. దీనికోసం ఒక ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసి రాంగోపాల్ వర్మ, నాగార్జున ఇద్దరూ హాజరు కానున్నారు. అలాగే బిగ్ బాస్ షోలో కూడా ఈ సినిమాను ప్రమోట్ చేయబోతున్నారు. అమలా కూడా ఇక్కడ కనిపించబోతున్నట్లు సమాచారం. 1990లో విడుదలయి మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఇప్పుడు నవంబర్ 14వ తేదీన రీ రిలీజ్ కాబోతోంది.
కార్తీ - ఆవారా :
ప్రముఖ కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ హీరోగా, మిల్కీ బ్యూటీ తమన్న హీరోయిన్గా వచ్చిన చిత్రం ఆవారా. ఎన్ లింగుస్వామి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ మ్యూజికల్ లవ్ స్టోరీ 2010లో వచ్చి మ్యూజికల్ గా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇటు పాటలతో యువతను విపరీతంగా కట్టిపడేసింది. ఈ సాంగ్స్ ఇప్పటికీ కూడా అక్కడక్కడ వినిపిస్తూనే ఉంటాయి. అలాంటి ఈ చిత్రం ఇప్పుడు మరొకసారి ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. నవంబర్ 22వ తేదీన 4k వెర్షన్ లో ఈ సినిమాను రీ రిలీజ్ చేయనున్నారు. మరి ఈ సినిమా ఇప్పటి జనరేషన్ యువతను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.