సెలబ్రిటీల పెళ్లిళ్లు అంతా ఫేక్..
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు చేసుకునే పెళ్లిలంతా ఫేక్ అంటూ ఒక బాలీవుడ్ బ్యూటీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.;
సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలు చేసుకునే పెళ్లిలంతా ఫేక్ అంటూ ఒక బాలీవుడ్ బ్యూటీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఆమె ఎవరో కాదు నోరా ఫతేహి. తాజాగా ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న జంటగా ఆదిత్య సర్పోత్దార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం థామా. మ్యాడ్ డాక్ ఫిలిమ్స్ బ్యానర్ పై దీపావళి సందర్భంగా అక్టోబర్ 21న విడుదలైన ఈ సినిమాలో రష్మిక మందన్న తో కలసి దిల్‌బర్ కీ ఆంఖోం కా స్పెషల్ సాంగ్ లో నడిపించి సోషల్ మీడియాను షేర్ చేసింది. ముఖ్యంగా ఈ పాట ఇంటర్నెట్లో ఏ రేంజ్ లో డిమాండ్ తెచ్చుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అలా స్పెషల్ సాంగ్ లతో ప్రేక్షకులను అలరిస్తూ ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. తాజాగా బాలీవుడ్ సెలబ్రిటీల పెళ్లిళ్లపై చేసిన కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. విషయంలోకి వెళ్తే.. తాజాగా బీర్ బైసెప్స్ పాడ్ కాస్ట్ లో పాల్గొన్న ఈమె.. ఊహించని కామెంట్లు చేసింది. ఆమె మాట్లాడుతూ.." సినీ పరిశ్రమలో ఎంతోమంది వ్యక్తులు తమతో సంబంధం కలిగి ఉండటానికి నకిలీ సంబంధాలను ఏర్పరచుకుంటున్నారో చెప్పడం నాకు ఇష్టం లేదు .ముఖ్యంగా బాలీవుడ్ లో సెలబ్రిటీల వివాహాలు నిజమైనవి కావు. ఇమేజ్ ప్రభావం కోసం మాత్రమే పెళ్లిళ్లు జరుగుతాయి..
ఇలాంటి ప్రవర్తన అనైతికమైనది.. చివరికి నిజంగా ప్రేమించిన వారు మోసపోతున్నారు. కొంతమంది నటులు వృత్తిపరమైన ప్రయోజనాలు పొందడానికి మాత్రమే ప్రేమలో ఉన్నట్లు నటిస్తారు. మరి కొంతమంది బహిరంగంగా వివాహాలు చేస్తుంటారు. కానీ ఈ బహిరంగ వివాహాల వెనుక వివాహేతర సంబంధాలను దాచిపెడుతున్నారు.. అందుకే ఇక్కడ సెలబ్రిటీల పెళ్లిలన్నీ ఫేక్" అంటూ సంచలన కామెంట్లు చేశారు నోరా ఫతేహి. ప్రస్తుతం ఈ పాడ్ కాస్ట్ క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. కొంతమంది నోరా ఫతేహికి మద్దతుగా నిలుస్తున్నారు. ఆమె చెప్పింది నిజమే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏది ఏమైనా సెలబ్రిటీల పెళ్లిళ్ల వెనుక ఉన్న అసలు కారణం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. మరి దీనిపై బాలీవుడ్ సినీ పరిశ్రమ రియాక్షన్ ఏవిధంగా ఉంటుందో చూడాలి అంటూ నెటిజన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు.
నోరా ఫతేహి కెరియర్ విషయానికి వస్తే.. భారతదేశానికి చెందిన నటిగా.. డాన్సర్ గా..మోడల్.. సింగర్.. రియాలిటీ షో జడ్జిగా ఇలా విభిన్నమైన బాధ్యతలు చేపట్టి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకుంది. 2014లో వచ్చిన హిందీ చిత్రం రోర్: టైగర్స్ ఆఫ్ ది సుందర్బన్స్ అనే సినిమా ద్వారా సినీ రంగంలోకి అడుగు పెట్టిన ఈమె తెలుగులో టెంపర్, కిక్ 2, లోఫర్, ఊపిరి వంటి చిత్రాలలో ఆడి పాడింది. ముఖ్యంగా బాహుబలి సినిమాలో మనోహరీ పాటలో తన అద్భుతమైన నటనతో అందరిని మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం నోరా ఫతేహి చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.