మత్తుకళ్ళతో మాయ చేస్తున్న బాహుబలి బ్యూటీ..
తాజాగా తన అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలను షేర్ చేసిన నోరా ఫతేహి మరోసారి తన అందంతో ఆకట్టుకుంది అని చెప్పవచ్చు.;
దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్, రానా కాంబినేషన్లో వచ్చిన తొలి పాన్ ఇండియా చిత్రం 'బాహుబలి' . ఈ సినిమా ఇండియన్ సినీ రికార్డ్ లను తిరగరాసింది. ఈ సినిమాకి కొనసాగింపుగా 'బాహుబలి 2' సినిమా వచ్చి మరో రికార్డును సొంతం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్ వసూలు చేసిన ఇండియన్ చిత్రాలలో ఒకటిగా స్థానం సంపాదించుకుంది. ఈ సినిమాలతో దర్శకుడు సంచలనం సృష్టించడమే కాదు ఇందులో నటించిన ప్రతి చిన్న జూనియర్ ఆర్టిస్ట్ కి కూడా మంచి గుర్తింపు అందించారు.
ఇదిలా ఉండగా బాహుబలి సినిమాలో "మనోహరీ" అంటూ సాగే స్పెషల్ సాంగ్ కి ఏ రేంజ్ లో గుర్తింపు లభించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇందులో ముగ్గురు భామలు తమ అద్భుతమైన డాన్స్ పెర్ఫార్మన్స్ తో అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. స్కార్లెట్ మెల్లిష్ విల్సన్,మధు స్నేహ ఉపాధ్యాయ, నోరా ఫతేహి ముగ్గురు కూడా ఎవరికివారు తమ అద్భుతమైన పర్ఫామెన్స్ తో అందరి దృష్టిని ఆకర్షించారు. ఈ పాట తరువాత ప్రముఖ హీరోయిన్ నోరా ఫతేహి పేరు బాగా మారుమ్రోగింది అని చెప్పవచ్చు.
ఈ సినిమా తర్వాత స్పెషల్ సాంగ్ లకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచిన నోరా ఫతేహి తన అందంతో ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటోంది. అందులో భాగంగానే తాజాగా సోషల్ మీడియా ద్వారా కొన్ని ఫోటోలు షేర్ చేసిన ఈమె.. ఇందులో అద్దాలు పొదిగిన డ్రెస్ లో చాలా అందంగా కనిపిస్తోంది. తాజాగా తన అందాలను హైలెట్ చేస్తూ ఫోటోలను షేర్ చేసిన నోరా ఫతేహి మరోసారి తన అందంతో ఆకట్టుకుంది అని చెప్పవచ్చు. అంతేకాదు ఈమె ఫోటోలకు ఫోజులు ఇచ్చిన తీరు చూసి మత్తు కళ్ళతో మాయ చేస్తోంది అంటూ కామెంట్లు చేస్తున్నారు..
ఇండియన్ సినీ నటిగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. డాన్సర్, మోడల్, సింగర్, రియాలిటీ షో జడ్జిగా కూడా పేరు దక్కించుకుంది. 2014లో హిందీ సినిమా రోర్ :టైగర్స్ ఆఫ్ ది సుందర్భన్స్ అనే సినిమా ద్వారా నటిగా ఇండస్ట్రీ రంగ ప్రవేశం చేసింది. తెలుగులో టెంపర్, కిక్ 2, లోఫర్, ఊపిరి వంటి చిత్రాలలో ఆడి పాడిన ఈమె.. బాహుబలి సినిమాలో మనోహరి పాటతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది.
1992 ఫిబ్రవరి 6న కెనడా, క్యూబెక్ లో జన్మించిన ఈమె ఈ మధ్య నిర్మాతగా కూడా అవతరించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళ్ , హిందీ భాషల్లో నటిస్తూ భారీ పాపులర్ అందుకున్న ఈమె ఇప్పుడు స్పెషల్ సాంగ్లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.
ఉఫ్ఫ్ యే సియాపా అనే చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సెప్టెంబర్ 5 2025న ఈ సినిమా విడుదల కానుంది అని ప్రకటించారు.కానీ ఆ తర్వాత పోస్ట్ పోన్ చేశారు. ఇక కే డి: ది డెవిల్, బీ హ్యాపీ చిత్రాలలో నటిస్తోంది.