వీడియో: నివేద గగుర్పొడిచే సాహసాలు?
తమిళ మీడియా కథనాల ప్రకారం.. సినిమాలతో పాటు కార్ రేసింగ్ లోను నివేదా పేథురాజ్ ప్రావీణ్యం ఇప్పటికే చర్చకు వచ్చింది.;
బన్ని 'అల వైకుంఠపురములో' చిత్రంలో తనదైన అందం ఆకర్షణ, నట ప్రతిభతో మనసులు గెలుచుకుంది నివేదా పెథురాజ్. తెలుగు, తమిళ చిత్రసీమల్లో పాపులర్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలుగుతున్న ఈ బ్యూటీ సాయిధరమ్ తేజ్ తో 'చిత్రలహరి',.. శ్రీవిష్ణు నటించిన 'బ్రోచేవారెవరురా' చిత్రాలలో నటించింది. నివేద అందచందాలు, నటనకు అభిమానులు ఫిదా అయిపోతారు. టాలీవుడ్ లో రెడ్, పాగల్, విరాట పర్వం చిత్రాల్లోనూ నటించింది. చందూ మొండేటి తెరకెక్కించిన ఓటీటీ చిత్రం `బ్లడీ మేరీ`లోనూ నటించింది.
తమిళ మీడియా కథనాల ప్రకారం.. సినిమాలతో పాటు కార్ రేసింగ్ లోను నివేదా పేథురాజ్ ప్రావీణ్యం ఇప్పటికే చర్చకు వచ్చింది. నివేద కార్ రేసింగ్ అంటే పడి చస్తుంది. తనలోని స్పోర్ట్స్ ఉమెన్ ని సంతృప్తి పరిచే ప్రయత్నాలు చాలా కాలం క్రితమే ప్రారంభించిన ఈ మధురై భామ మొమెంటం స్కూల్ ఆఫ్ అడ్వాన్స్ రేసింగ్ శిక్షకుల సమక్షంలో ఫార్ములా రేస్ శిక్షణలో మొదటి స్థాయిని పూర్తి చేసింది. ఫార్ములా రేసింగ్ ని నివేద సీరియస్ గానే తీస్కుందని గతంలో కథనాలు వెలువడ్డాయి. రేసింగ్ ప్రాక్టీస్ కి సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా రివీల్ అయ్యాయి.
తాజాగా మరోసారి నివేద కార్ రేసింగ్ ప్రాక్టీస్ కి సంబంధించిన కొత్త విజువల్స్ అంతర్జాలంలోకి వచ్చాయి. నివేద స్వయంగా రేస్ కార్ డ్రైవింగ్ ని ప్రాక్టీస్ చేస్తున్న వీడియోని తన ఇన్ స్టాలో పోస్ట్ చేయగా అది క్షణాల్లో వైరల్ గా మారింది. రేసింగ్ అంటేనే గగుర్పాటుకు గురి చేసే సాహసాలు. సాహసాలకు తాను సిద్ధమని నివేద ప్రాక్టికల్ గా చూపిస్తోంది.
రేసింగ్ లో ఎంతో కీలకమైనది మలుపుల్ని సవ్యంగా దాటుకుని ముందుకు సాగడం.. తేడాలొస్తే గాల్లో పల్టీలు కొట్టాల్సిందే. ఇప్పటికే తళా అజిత్ లాంటి స్టార్ రేసర్ ఈ దుస్సాహసంలో చాలా సార్లు ప్రాణాల మీదికి తెచ్చుకున్నాడు. అతడు ఫార్ములా వన్ రేసింగ్ లో పలుమార్లు భారీ యాక్సిడెంట్లకు గురైన సంగతి తెలిసిందే. అదృష్టవశాత్తూ తళాకి ఏమీ కాలేదు. అతడు తన తెగువ, కష్టంతో విజేతగాను ఆవిర్భవించాడు. ఇప్పుడు నివేద కూడా అదే బాటలో కార్ రేసింగ్ కి ప్రయత్నిస్తోంది.
తాజాగా షేర్ చేసిన వీడియోకు నివేద థామస్ ఇచ్చిన క్యాప్షన్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. ``మీరు పక్కకు తప్పుకుంటే, దారిలో ఉన్నట్లే`` అని క్యాప్షన్ ని ఇచ్చింది. కార్ ని డ్రైవ్ చేసేప్పుడు ఎంతో బ్యాలెన్స్ డ్ గా మలుపుల్ని దాటించడం ఎలానో ప్రాక్టీస్ చేస్తోంది. హోలి ఎఫ్.కె నాయిర్ బాల్, పివోవి డ్రైవ్, ఇన్ సేన్ కంట్రోల్, జీరో టు సైడ్ వేస్, స్పీడ్ వైబ్స్ అంటూ హ్యాష్ ట్యాగుల్ని జోడించింది. ప్రస్తుతం ఈ స్పెషల్ వీడియో ఇంటర్నెట్ లో హృదయాలను గెలుచుకుంటోంది. నివేద గగుర్పొడిచే సాహసాలకు సిద్ధమవుతుంటే, యూత్ టెన్షన్ పడుతోంది.