నితిన్ కి అదృష్టంగా మారబోతున్న ఆ నిర్మాత..!

కెరీర్ లో సక్సెస్ లు కన్నా ఫ్లాపులే ఎక్కువగా ఉన్నా ఫలితాలతో సంబంధం లేకుండా తను సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు నితిన్. రీసెంట్ గా రాబిన్ హుడ్ తో వచ్చిన ఈ హీరో ఆడియన్స్ ని నిరాశపరిచాడు.;

Update: 2025-06-30 03:30 GMT

కెరీర్ లో సక్సెస్ లు కన్నా ఫ్లాపులే ఎక్కువగా ఉన్నా ఫలితాలతో సంబంధం లేకుండా తను సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు నితిన్. రీసెంట్ గా రాబిన్ హుడ్ తో వచ్చిన ఈ హీరో ఆడియన్స్ ని నిరాశపరిచాడు. ఆ సినిమా ఫ్లాప్ ఊహించని నితిన్ షాక్ తిన్నాడు. ఇక నెక్స్ట్ రాబోతున్న తమ్ముడుతో హిట్ కొట్టాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. వేణు శ్రీరాం డైరెక్షన్ లో తెరకెక్కిన తమ్ముడు సినిమాను దిల్ రాజు నిర్మించారు. ఈ సినిమా ట్రైలర్ ఆసక్తికరంగా ఉండగా ఆడియన్స్ లో బజ్ పెంచింది.

నితిన్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో తమ్ముడు నిర్మించారని తెలుస్తుంది. ఐతే తమ్ముడు తర్వాత నితిన్ చేస్తున్న సినిమా ఎల్లమ్మ. బలగం వేణు డైరెక్షన్ లో ఆ సినిమా వస్తుంది. తమ్ముడు, ఎల్లమ్మ రెండు సినిమాలను కూడా దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమ్ముడు ఒక మంచి కాన్సెప్ట్ తో కచ్చితంగా సక్సెస్ అయ్యే మూమెంట్ కనిపిస్తుంది. సినిమాలో లయ నితిన్ కి సిస్టర్ రోల్ లో నటిస్తుంది. సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకమని తెలుస్తుంది.

ఇక ఎల్లమ్మ విషయానికి వస్తే వేణు ఈసారి డివోషనల్ సబ్జెక్ట్ తో రాబోతున్నాడు. ఎల్లమ్మ సినిమాలో కీర్తి సురేష్ కథానాయికగా నటిస్తుంది. సినిమాలో చాలా సీన్స్ పూనకాలు తెప్పించేలా ఉంటాయని టాక్. సో ఎల్లమ్మ కూడా నితిన్ కి లక్కీ ప్రాజెక్ట్ అవబోతుంది. ఒకేసారి రెండు సూపర్ సినిమాలతో నితిన్ వస్తున్నాడు. ఈ రెండు సినిమాలు కూడా మొదట నానిని హీరోగా అనుకుని అతనికి డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో నితిన్ దగ్గరకు వచ్చాయి.

సో ఈ రెండు సినిమాలతో నితిన్ కు దిల్ రాజు లక్కీ అవ్వబోతున్నాడు. కెరీర్ లో ఫ్లాపులతో కాస్త వెనకపడ్డ నితిన్ కి ఈ రెండు సినిమాలు హిట్లు ఇచ్చి అతని స్టార్ డం ని పెంచాలనే ప్రయత్నంలో ఉన్నారు. జయం సినిమా నుంచి నితిన్ తన మార్క్ సినిమాలు చేస్తున్నా కూడా ఎందుకో ఇంకా వెనకపడ్డాడని చెప్పొచ్చు. అందుకే తమ్ముడు, ఎల్లమ్మ ఈ రెండిటితో తప్పకుండా నితిన్ బౌన్స్ బ్యాక్ అవుతాడని అంటున్నారు. మరి ఈ సినిమాల ఫలితాలు నితిన్ కెరీర్ కు ఏ విధంగా హెల్ప్ అవుతాయన్నది చూడాలి.

Tags:    

Similar News