రాజాసాబ్ లో వాళ్లిద్దరే మెయిన్!
డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెకెక్కిన `ది రాజాసాబ్` రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది.;
డార్లింగ్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో తెరకెకెక్కిన 'ది రాజాసాబ్' రిలీజ్ కౌంట్ డౌన్ మొదలైంది. మరో నాలుగు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. చేతిలో ఉన్న ఈ కొద్ది సమయాన్ని టీమ్ ఏ మాత్రం మిస్ చేయడం లేదు. వీలైనంత సినిమాని జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. పాన్ ఇండి యాలో సినిమాలో భారీ ఎత్తున రిలీజ్ అవ్వడంతో? అందుకు తగ్గ పబ్లిసిటీ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు. హారర్ థ్రిల్లర్ లో డార్లింగ్ ఎలా అలరిస్తాడు? ఎంతగా నవ్విస్తాడు మెప్పిస్తాడు? కవ్విస్తాడు? అంటూ ఒకటే క్యూరియాసిటీ నెలకొంది.
అలాగే సినిమాలో ముగ్గురు హీరోయిన్లు నటించడం అంతే ఆసక్తికరం. ముగ్గురు హీరోయిన్లతో ప్రభాస్ నటించడం అన్నది ఇదే తొలిసారి. గతంలో ఇద్దరు భామల ముద్దుల ప్రియుడిగా చాలా సినిమాలు చేసాడు. కానీ ముగ్గురు భామల మధ్యలో నలిగిపోయే క్యారెక్టర్ పోషించడం ఇదే తొలిసారి. నిధి అగర్వాల్..మాళవిక మోహనన్, రిధ్ది కుమార్ లు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వాస్తవానికి ఇందులో ఇద్దరు హీరోయిన్లు కావాలని డార్లింగ్ మారుతిని రిక్వెస్ట్ చేయగా, ఇద్దరు కాదు..ముగ్గురును పెడదాం అంటూ రిద్ది కుమార్ ని కూడా తీసుకొచ్చాడు.
మరి కథలో ప్రధానంగా హైలైట్ అయ్యే హీరోయిన్లు ఎవరు? అంటే నిధి అగర్వాల్, మాళవికలుగా మారుతి కన్పమ్ చేసాడు. నిన్నమొన్నటి వరకూ హీరోయిన్ల ముగ్గురు పాత్రలు సమానంగా ఉంటాయని చర్చ జరిగింది. కానీ మారుతి క్లారిటీతో? ఇద్దరి భామలకే ఆ ఛాన్స్ అని తేలిపోయింది. మరి రిద్దీ కుమార్ సంగతేంటి? అంటే ఆమెను కొన్ని సన్నివేశాలకే పరిమితం చేసినట్లు మారుతి మాటల్లో స్పష్టమవుతుంది. సినిమాలో తనది ఓ కీలక పాత్ర మాత్ర మేనన్నాడు. మరి ప్రత్యేకంగా ఆమెను ఎంపిక చేసుకోవడానికి గల కారణాలు ఏంటి? అంటే? రిద్దీ కుమార్ లో ప్యూచర్ స్టార్ ని చూసి మారుతి ఎంపిక చేసినట్లు తెలిపాడు.
వాస్తవానికి రిద్దీ కుమార్ తెలుగులో నటించింది రెండు సినిమాల్లోనే. `లవర్` ,` అనగనగా ఓ ప్రేమ కథ`లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత 'రాధేశ్యామ్' లో కీలక పాత్రలో కనిపించింది. అటుపై మళ్లీ తెలుగులో అవకాశాలు రాలేదు. మళ్లీ ఇంత కాలానికి రాజాసాబ్ లో మారుతి అవకాశం ఇచ్చాడు. నటిగా కంబ్యాక్ అవ్వడానికి మంచి ఛాన్స్ ఇది. సినిమా హిట్ అయితే రిద్దీకి మారుతి లైఫ్ ఇచ్చినట్లే అవుతుంది. ఇవి గాక రిద్దీ కుమార్ మలయాళం, హిందీలో కూడా కొన్ని సినిమాలు చేసింది. కానీ అక్కడా సక్సెస్ పుల్ కెరీర్ ని కొనసాగించడంలో విఫలమైంది.