రాజా సాబ్ కి కలిసొచ్చే నిధి క్రేజ్..!
ప్రస్తుతం వెండితెర మీద సందడి చేస్తున్న హరి హర వీరమల్లు సినిమాతో నిధి మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది.;
ప్రస్తుతం వెండితెర మీద సందడి చేస్తున్న హరి హర వీరమల్లు సినిమాతో నిధి మళ్లీ టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది. నాలుగేళ్ల క్రితం చేసిన సినిమా ఎప్పుడో తన పోర్షన్ పూర్తైనా కూడా రిలీజ్ టైం లో నిధి ఆ సినిమాకు అందించిన కోపరేషన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే వీరమల్లు రిలీజ్ ఈవెంట్ లో పవన్ కళ్యాణ్ కూడా నిధి గురించి చాలా బాగా మాట్లాడారు. ఆమె సింగిల్ హ్యాండ్ గా ప్రమోట్ చేసింది ఆమెను చూసి నేను కూడా ప్రమోషన్స్ లోకి దిగా అన్నారు.
సినిమా పట్ల నిధికి ఉన్న కమిట్మెంట్ చూసి అందరు సూపర్ అనేస్తున్నారు. ఐతే వీరమల్లు సినిమాతో నిధి మంచి పాపులారిటీ సంపాధించింది. ఇది రాబోతున్న ప్రభాస్ రాజా సాబ్ కి కచ్చితంగా కలిసి వచ్చే అంశమే. ప్రభాస్ రాజా సాబ్ లో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్ ఇద్దరు హీరోయిన్స్ గా నటిస్తున్నారు. నిధి అగర్వాల్ వీరమల్లు తో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాధించింది.
అమ్మడి కెరీర్ లోకి ఒకసారి తొంగి చూస్తే మిస్టర్ మజ్ఞు, సవ్యసాచి సినిమాలు చేసినా క్రేజ్ రాలేదు. ఆ సినిమాల ఫలితాలు నిరాశపరిచాయి. ఐతే పూరీ జగన్నాథ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ తో కమర్షియల్ సక్సెస్ అందుకుంది నిధి అగర్వాల్. ఆ సినిమా ఇచ్చిన బూస్టింగ్ తో వరుస సినిమాలు చేస్తుంది అనుకుంటే గల్లా అశోక్ తో హీరో సినిమా చేసి ఆ తర్వాత కోలీవుడ్ షిఫ్ట్ అయ్యింది.
అక్కడ మంచి పాపులారిటీ తెచ్చుకున్నా ఎందుకో మళ్లీ అమ్మడికి ఛాన్సులు రాలేదు. ఐతే వీరమల్లు సినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్న నిధి కరెక్ట్ టైం లో మంచి ప్రమోషన్ సపోర్ట్ చేసింది. పవర్ స్టార్ ఫ్యాన్స్ అయితే నిధి అగర్వాల్ ని బాగా ఎంకరేజ్ చేస్తున్నారు. ఐతే వీరమల్లుకి చేసినట్టుగానే నిధి అగర్వాల్ రాజా సాబ్ కి డ్యూటీ చేస్తే మాత్రం తప్పకుండా అమ్మడికి మరింత క్రేజ్ వస్తుంది.
ప్రభాస్ రాజా సాబ్ సినిమాను మారుతి డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఈ ఇయర్ డిసెంబర్ లో రిలీజ్ లాక్ చేశారు. థమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా టీజర్ తోనే సంథింగ్ స్పెషల్ అనిపించారు. మరి రాజా సాబ్ నిధి క్రేజ్ కొనసాగించేలా చేస్తుందా లేదా అన్నది చూడాలి.
వీరమల్లు క్రేజ్ తోనే నిధికి ఒకటి రెండు ఆఫర్లు వచ్చే ఊపు కనబడుతుంది. ఇక రాజా సాబ్ కూడా వస్తే కచ్చితంగా టాలీవుడ్ లో మళ్లీ నిధి హవా మొదలయ్యే ఛాన్స్ ఉంది.