కేన్స్ లో కాక‌పుట్టించిన చీరందం ఆమె సొంతం!

రెగ్యుల‌ర్ రెడ్ కార్పెట్ వాక్ ల‌కు ఇది భిన్నంగా క‌నిపించ‌డంతో సంథింగ్ స్పెష‌ల్ గా ఈవెంట్ లో హైలైట్ అయింది

Update: 2024-05-22 16:30 GMT

ప్రాన్స్ లో కేన్స్ ఉత్స‌వాలు అట్ట‌హాసంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే.భార‌తీయ న‌టీమ‌ణులంతా డిజైన‌ర్ దుస్తుల్లో కేన్స్ కే క‌ళ తెస్తున్నారు. బాలీవుడ్ భామ‌లంతా త‌మ‌దైన శైలిలో ఆక‌ట్టుకుంటున్నారు. డిజైన‌ర్ దుస్తుల్లో భామా మ‌ణులుంతా మిరుమిట్లు గొలుపుతున్నారు. అయితే ఇదే వేడుక‌లో వ్యాపార‌వేత్త‌, సామాజిక కార్య‌క‌ర్త నిద‌ర్శ‌నా గోవానీ గామిన్ మిగ్యుల‌ర్ సంప్ర‌దాయ చీర‌క‌ట్టులో కేన్స్ కొత్త క‌ళ తీసుకొచ్చారు. రెడ్ కార్పెట్ పై నిద‌ర్శ‌నా జ‌ర్జోజీ ఎంబ్రాయిడ‌రీ చీర‌తో త‌ళుక్కున మెరిసారు.

రెగ్యుల‌ర్ రెడ్ కార్పెట్ వాక్ ల‌కు ఇది భిన్నంగా క‌నిపించ‌డంతో సంథింగ్ స్పెష‌ల్ గా ఈవెంట్ లో హైలైట్ అయింది. క్రీమ్ క‌ల‌ర్ సారీపై మ‌ల్టీడిజైన్ ఎంతో ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. ఆమె అలంక‌ర‌ణ ప్ర‌తీది కొత్త ఫీల్ ని తీసుకొచ్చింది. అన్నింటిని మించి నిద‌ర్శ‌న మెడ‌లో ధ‌రించిన హారం మ‌రింత ప్ర‌త్యేకంగా ఫోక‌స్ అయింది. మల్టీక‌ల‌ర్ డిజైన్ తో కూడిన ఖ‌రీదైన హారం ఆమెని మ‌రింత ప్రత్యేకంగా హైలైట్ చేసింది. ఈ హారానికి ప్ర‌త్యేక‌మైన పేరు కూడా ఉంది.

Read more!

దీన్ని కృష్ణ గువా న‌వ‌ర‌త్న హారం అంటారు. దీనికి వందేళ్ల చ‌రిత్ర ఉంది. మీనా జుదౌ జ్యూలెరీ వ్యాపారీ ఘ‌నా సింఘు బిట్రూ దీన్ని రూపొందించారు. దీన్ని తయారు చేయ‌డానికి 200 మంది 1800 గంట‌ల పాటు శ్ర‌మించాల్సి వ‌చ్చిందిట‌. దీన్ని పూర్తిగా పురాత‌న ప‌ద్ద‌తిలో తాయ‌రు చేయ‌డానికి వాడిన ప‌రిక‌రాలు కూడా ఆనాటివిగానే చెబుతున్నారు. అటు చీర‌..ఇటు హారంతో నిద‌ర్శ‌న కేన్స్ కే కొత్త వ‌న్నె తీసుకొచ్చారు.

ఇంత‌వ‌ర‌కూ ఏ కేన్స్ వేడుక‌ల్లోనూ ఇలాంటి స‌న్నివేశం చోటు చేసుకోలేదు. అక్క‌డ చూప‌రుల్లోనూ..నిర్వాహకుల్లోనూ ఆమె ధ‌రించిన చీర‌...హారం గురించి చ‌ర్చించుకున్నారంటే? అతిశ‌యోక్తి కాదు. మొత్తానికి ఈ ఏడాది కేన్స్ క్రెడిట్ అంతా నిద‌ర్శ‌న సొంతం చేసుకున్న‌ట్లే క‌నిపిస్తుంది. అంత‌కు ముందు అస్సాం న‌టి కూడా భార‌తీయ సంప్ర‌దాయ చీరందంలో ఇదే వేడుక‌లో మెర‌వ‌డం విశేషం.

Tags:    

Similar News