అంబానీల పెళ్లి త‌ర్వాత మ‌రో కాస్ట్‌లీ పెళ్లి

2024లో మ‌ల్టీబిలియ‌నీర్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మ‌ర్చంట్‌ల పెళ్లి కోసం వంద‌ల మిలియ‌న్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేసిన సంగ‌తి తెలిసిందే.;

Update: 2025-11-22 05:50 GMT

2024లో మ‌ల్టీబిలియ‌నీర్ ముఖేష్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మ‌ర్చంట్‌ల పెళ్లి కోసం వంద‌ల మిలియ‌న్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేసిన సంగ‌తి తెలిసిందే. భార‌త‌దేశంలో ఇప్ప‌టివ‌ర‌కూ అత్యంత ఖ‌రీదైన పెళ్లిళ్ల‌లో ఇది ఒక‌టి. ఇప్పుడు అనంత్ అంబానీ పెళ్లి త‌ర్వాత మ‌ళ్లీ మ‌రో కాస్ట్ లీ పెళ్లి గురించి ప్ర‌పంచ‌వ్యాప్తంగా చర్చ సాగుతోంది. ఇది అమెరికాకు చెందిన బిలియనీర్ రామరాజు మంతెన కుమార్తె నేత్రా మంతెన, టెక్ సహ వ్యవస్థాపకుడు వంశీ గాదిరాజు జంట పెళ్లి. ఈ జోడీ ఉదయపూర్‌లో అంగరంగ వైభవంగా వివాహం చేసుకోనుంది. ఈ హై ప్రొఫైల్ వివాహానికి అంత‌ర్జాతీయ పాప్ స్టార్ జెన్నిఫర్ లోపెజ్, డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్, పాప్ దిగ్గ‌జం జస్టిన్ బీబర్ హాజరయ్యారు. ఈ పెళ్లి కోసం దాదాపు 40 దేశాల నుంచి టాప్ బిగ్ షాట్స్ హాజ‌ర‌వుతుండ‌గా మూడు రోజుల వెడ్డింగ్ కోసం వంద‌ల కోట్లు ఖ‌ర్చు చేస్తున్నార‌ని స‌మాచారం. ఇప్ప‌టికే ట్రంప్ కొడుకు జూనియ‌ర్ ట్రంప్ అంబానీల వంటారా ఫామ్ హౌస్ ని విజిట్ చేసిన ఫోటోలు వీడియోలు వైర‌ల్ అయిన సంగ‌తి తెలిసిందే. అత‌డు బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ లోను క‌నిపించాడు.

ఈ పెళ్లి నేప‌థ్యంలో నేత్ర మంతెన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ గురించి ప్ర‌జ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. ఆమె తండ్రి రామరాజు మంతెన ఇంజెనస్ ఫార్మాస్యూటికల్స్ ఛైర్మన్ కం సీఈవో. నిన్న‌టి (నవంబర్ 21) నుంచి నేత్ర‌-వంశీ జంట పెళ్లి వేడుక‌లు రాజ‌స్థాన్ లోని కోట‌లో వైభ‌వంగా మొద‌ల‌య్యాయి. ఈనెల 24 వరకు అంగ‌రంగ వైభ‌వంగా జరగనున్నాయి. జస్టిన్ బీబర్, డోనాల్డ్ ట్రంప్ జూనియర్, జెన్నిఫర్ లోపెజ్ స‌హా చాలామంది అంతర్జాతీయ ప్రముఖులు ఈ పెళ్లి వేడుకలకు హాజర‌వ్వ‌డం కొస‌మెరుపు. బాలీవుడ్ నుండి దిగ్గ‌జ హీరోలు హృతిక్ రోషన్, రణవీర్ సింగ్ ఈ పెళ్లి వేడుక‌ల్లో డ్యాన్సులు చేసిన వీడియోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి. ఈ పెళ్లి కోసం జెన్నిఫ‌ర్ లోపేజ్ భార‌త‌దేశంలో అడుగుపెట్టిన‌ప్ప‌టి ఫోటోలు, వీడియోలు కూడా వైర‌ల్ అవుతున్నాయి.

నేత్ర మంతెన‌- వంశీ గాదిరాజు నేప‌థ్యం:

నేత్రా మంతెన పద్మజ మంతెన‌- రామ రాజు మంతెన దంప‌తుల‌ కుమార్తె. రామ‌రాజు ఓర్లాండోకు చెందిన బిలియనీర్, ఇంజెనస్ ఫార్మాస్యూటికల్స్ సీఈవో. రామ రాజు మంతెన ఫార్మా పరిశ్రమ దిగ్గ‌జంగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఫేమ‌స్. ఆయన అమెరికా, స్విట్జర్లాండ్, భారతదేశంలో ఆర్ అండ్ డి కంపెనీల‌ను నిర్వ‌హిస్తున్నారు.

వ‌రుడు వంశీ గాదిరాజు ఎవ‌రు? అంటే.. మల్టీ-లొకేషన్ రెస్టారెంట్లు, వాటి డెలివరీ - టేక్‌అవే కార్యకలాపాలను క్ర‌మ‌బ‌ద్ధంగా నిర్వ‌హించే న్యూయార్క్‌కు చెందిన టెక్ ప్లాట్‌ఫామ్ `సూపర్‌ఆర్డర్‌`కు ఆయన సహ వ్యవస్థాపకుడు మరియు చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్. రెస్టారెంట్ల కోసం ఆటోమేటెడ్ వెబ్‌సైట్ ల‌ నిర్మాణం స‌హా కంపెనీకి చెందిన ఏఐ కార్య‌క‌లాపాల‌ ఆవిష్కరణలకు లీడ‌ర్ షిప్ వహించిన ఘనత గాదిరాజుకు ఉంది. వంశీ కొలంబియా విశ్వవిద్యాలయ గ్రాడ్యుయేట్.. 2024లో ఫుడ్ అండ్ డ్రింక్ విభాగంలో ఫోర్బ్స్ 30 అండర్ 30 జాబితాలో చోటు దక్కించుకున్నారు. రెస్టారెంట్-టెక్ రంగంలో సాంకేతిక గురూగా పేరు తెచ్చుకున్నాడు.

ఈ వివాహ వేడుకలు ఉదయపూర్‌లోని లీలా ప్యాలెస్, జెనానా మహల్, లేక్ పిచోలాలోని ఐలాండ్ ప్యాలెస్‌ సహా ప‌లు విలాసవంతమైన వేదికలలో జరగ‌నున్నాయి. ఈ మూడు రోజుల‌ పెళ్లిలో బాలీవుడ్ స్టార్లు స‌హా రాజ‌కీయ రంగ ప్ర‌ముఖులు, ఇండ‌స్ట్రియ‌లిస్టులు, బిజినెస్ మ్యాగ్నెట్స్ పాల్గొంటున్నారు.

Tags:    

Similar News