బిగ్ డీల్ : నెట్‌ఫ్లిక్స్ ఇష్టారాజ్యానికి అలా చెక్
అయితే నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ పేరుతో ప్రజల నుంచి భారీ మొత్తాలను వసూలు చేసేందుకు ఇలా కంపెనీలను కొనుగోలు చేస్తోంది.;
ప్రపంచవ్యాప్తంగా ఇటీవలి కాలంలో ఎక్కువగా గూగుల్‌లో సెర్చ్ చేసిన ఆసక్తికర అంశం వార్నర్ బ్రదర్స్- నెట్ ఫ్లిక్స్ డీల్. దశాబ్ధాల సుదీర్ఘ చరిత్ర ఉన్న ఒక గొప్ప కంపెనీని తన హస్తాగతం చేసుకునేందుకు నెట్ ఫ్లిక్స్ భారీ ప్రణాళికతో ముందుకు వచ్చింది. వార్నర్ బ్రదర్స్ ని కేబుల్ నెట్ వర్క్స్ మినహా ఇతర ఆస్తులన్నిటినీ కొనుగోలు చేయాలని నెట్ ఫ్లిక్స్ గట్టి ప్లాన్ ని వేసింది. దీనికోసం బిడ్డింగ్ కి వెళ్లిన నెట్ ఫ్లిక్స్ 72 బిలియన్ డాలర్ల వరకూ పోటీకి వెళ్లింది. వార్నర్ బ్రదర్స్ ఒకవేళ నెట్ ఫ్లిక్స్ సొంతమైతే ఈ బ్యానర్ సినిమాలు చూడాలంటే నెట్ ఫ్లిక్స్ కి స్ట్రీమింగ్ కి వినియోగదారులు (ప్రజలు) భారీగా డబ్బు చెల్లించాల్సి ఉంటుందని , ఇకపై వార్నర్ బ్రదర్స్ సినిమాలు, శాటిలైట్ టీవీ వ్యవస్థలన్నిటినీ తన నియంత్రణలోకి తెచ్చుకుంటుందని కథనాలొచ్చాయి.
అయితే ఇంతలోనే దిగ్గజ పారమౌంట్ సంస్థ నెట్ ఫ్లిక్స్ కి పెద్ద ఝలక్ ఇవ్వడం చర్చగా మారింది. పారామౌంట్ స్టూడియోస్ అనూహ్యంగా తెరపైకి వచ్చి, నెట్‌ఫ్లిక్స్‌ను మించిని బిడ్ ని ఆఫర్ చేసింది. దాదాపు 77.9 బిలియన్ డాలర్ల ఈక్విటీ ఆఫర్‌తో బిడ్డింగ్ చేయడం షాకిచ్చింది. అత్యంత కీలకమైన టీవీ కేబుల్ నెట్‌వర్క్ సహా వార్నర్ బ్రదర్స్ కి చెందిన అన్ని వ్యాపారాలను కొనుగోలు చేసేందుకు ఇంత పెద్ద మొత్తాన్ని ఆఫర్ చేసింది పారామౌంట్.
పారామౌంట్ తన ఒప్పంద విలువను దాదాపు 108 బిలియన్ డాలర్లుగా అంచనా వేస్తోంది. అయితే పారామౌంట్ ఏక మొత్తంగా వార్నర్ బ్రదర్స్ అన్ని ఆస్తులను హస్తగతం చేసుకోవడం ద్వారా ప్రొడక్టివిటీని పెంచాలనుకుంటే, నెట్ ఫ్లిక్స్ కేబుల్ నెట్ వర్క్ ని టచ్ చేయకుండా, ఇతర విభాగాలను తన సొంతం చేసుకునేందుకు బిడ్ వేసింది.
అయితే నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగ్ పేరుతో ప్రజల నుంచి భారీ మొత్తాలను వసూలు చేసేందుకు ఇలా కంపెనీలను కొనుగోలు చేస్తోంది. ఇది నిర్భంధంతో కూడుకున్న వ్యవహారంగా భావిస్తున్నారు. పైగా కేబుల్ ప్రాపర్టీలను ఇది కొనుగోలు చేయదు. కానీ పారామౌంట్ అలా కాదు.. నెట్ ఫ్లిక్స్ కి చెందిన అన్ని ఆస్తులను కొనుగోలు చేస్తుంది.
అయితే పారామౌంట్ నెట్ ఫ్లిక్స్ కంటే భిన్నమైన దారిని ఎంచుకుంది. ఇటీవల దీర్ఘకాలిక స్థిరత్వం అజెండాను చూడాలని కోరుతూ, దాని బిడ్‌ను పరిశీలించాలని వార్నర్ బ్రదర్స్ వాటాదారులను కోరుతోంది. అలాగే పారామౌంట్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా తమకు ఉన్న పంపిణీ వ్యవస్థను, స్థిరమైన వ్యాపార బంధాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ వార్నర్ బ్రదర్స్ బృందాలను ఆకర్షిస్తోంది.
నిజానికి పారామౌంట్ టేకోవర్ తో చాలా ప్రయోజనాలు దాగి ఉన్నాయి. థియేట్రికల్ రిలీజ్ సహా కేబుల్ వ్యవస్థ ద్వారా ప్రసారం, స్ట్రీమింగ్ వ్యవహారాలు మరింత బలోపేతం అవుతాయి. అలా కాకుండా నెట్ ఫ్లిక్స్ కి వార్నర్ బ్రదర్స్ ని దఖలు పరిస్తే, దానివల్ల సదరు సంస్థపై నెట్ ఫ్లిక్స్ గుత్తాధిపత్యం చెలాయిస్తుంది. వార్నర్ బ్రదర్స్ వరల్డ్ వైడ్ యాక్టివిటీస్ ని నియంత్రించే ప్రయత్నం చేస్తుంది. అంతేకాదు... వార్నర్ బ్రదర్శ్ వీక్షణకు మెంబర్ షిప్ ధరలను చుక్కల్లోకి తీసుకెళుతుందని కూడా ఆందోళన ఉంది. ఒకవేళ ఈ డీల్ జరగాలంటే కొన్ని రాజకీయ సవాళ్లను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది. నెట్ ఫ్లిక్స్ తో వ్యవహారం గందరగోళంతో కూడుకున్నదని కూడా కొన్ని విశ్లేషణలు వెలువడుతున్నాయి. నెట్ ఫ్లిక్స్ తో పోలిస్తే, పారామౌంట్ స్పష్ఠమైన ఎజెండాతో కార్పొరెట్ డీల్ కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తోందని నిపుణులు విశ్లేషిస్తున్నారు.