నెట్ ఫ్లిక్స్ సూపర్ స్ట్రాటజీ.. వాళ్లతో టై అప్
అయితే ఈ విధానం కూడా మేనేజ్మెంట్ కు ఇప్పుడు వర్కౌట్ కావడం లేదేమో. అందుకే తమ స్ట్రాటజీ మార్చాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.;
ప్రస్తుతం ఉన్న ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో నెట్ ఫ్లిక్స్ ఒకటి. ఇప్పుడంటే తెలుగు సినిమాలకు నెట్ ఫ్లిక్స్ ఓపెన్ చేసి చూస్తేసున్నాం. కానీ ఒకప్పుడు అలా కాదు. నెట్ ఫ్లిక్స్ లో మొత్తం ఇంటర్నేషనల్, హాలీవుడ్ సినిమాలు సిరీస్ లకు కేరాఫ్ అడ్రస్ గా ఉండేది. అందుకే ఇండియా నుంచి యూజర్లు ఎక్కువగా ఉండేవారు కాదు.
అలాగైతే భారత్ లో తమ విస్తరణ, మార్కెట్ జరగదని భావించిన నెట్ ఫ్లిక్స్ తమ పంతా మార్చేసింది. పెట్టుకున్న పరిమితులు తుడిచేసి.. ఇండియాలో రీజినల్ సినిమాలను కొనడం ప్రారంభించింది. ఎలా కొన్నది అంటే.. తెలుగులో బడా సినిమా ఓటీటీ అంటే నెట్ ఫ్లిక్స్ లోకి వస్తుందిలే అనేంతలా కొనుగోలు చేసింది. వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి దేవర, పుష్ప, టిల్లు స్క్వేర్, గుంటూరు కారం, సలార్, వాల్తేర్ వీరయ్య లాంటి అనేక సూపర్ హిట్ సినిమాలను కొన్నది.
అయితే ఈ విధానం కూడా మేనేజ్మెంట్ కు ఇప్పుడు వర్కౌట్ కావడం లేదేమో. అందుకే తమ స్ట్రాటజీ మార్చాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అల్రెడీ థియేటర్లలో రిలీజైన సినిమాలకు వందల కోట్లు పెడ్డటం ఎందుకని భావించారో ఏమో.. ఇప్పుడు తామే సినిమాలు, సిరీస్ లు రూపొందించే ఆలోచనల ఉన్నారు. మంచి కాంబోలతో జతకట్టి అందులో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలోనే రిలీజ్ కు రెడీ అయిపోయిన సినిమాలను సొంతం చేసుకుంటుంది. ఇలా ఆరు తెలుగు, తమిళ సినిమాలు, వెబ్ సిరీస్ విడుదలలు ప్రకటన చేసింది. సందీప్ కిషన్ సూపర్ సుబ్బు అందులో మొదటిది. ఆ తర్వాత ఆనంద్ దేవరకొండ కొత్త చిత్రం తక్షకుడు సినిమాను నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేస్తున్నారు. ఇక ఓజీ సినిమా హీరోయిన్ ప్రియాంకా మోహన్ నటించిన మేడ్ ఇన్ కొరియా అన్ని భాషల్లో నెట్ ఫ్లిక్స్ లోకి రానుంది.
వీటితో పాటు మాధవన్ లెగసి, అర్జున్ దాస్ లవ్, గోమతి శంకర్ క్రైమ్ థ్రిల్లర్ స్టీఫెన్ సినిమాలు రెడీ అయిపోయాయి. ఈ సినిమాలను ఆయా నిర్మాణ సంస్థలు రూపొందించాయి. అయితే ఇవేవీ కూడా థియేటర్ లోకి రావడం లేదు. డైరెక్ట్ గా నెట్ ఫ్లిక్స్ తో అగ్రిమెంట్ చేసుకొని ఓటీటీలోకే వస్తున్నాయి. ఒక్కో సినిమా ఒక్కొ డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తుంది. దీంతో ప్రేక్షకులకు కావాల్సినంత వినోదం పంచేందుకు నెట్ ఫ్లిక్స్ ఇలా కొత్త స్ట్రాటజీ ఎంచుకుంది. సినిమాలను కొనే పెద్ద మొత్తంతో ఇలాంటి చిన్న చిత్రాలు, సిరీస్ లను నేరుగా టై అప్ అయ్యి వీలైనంత ఎక్కువ కంటెంట్ తమ సైట్ లో ఉంచడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఈ కొత్త స్ట్రాటజీ ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.