ఒసామా బిన్ లాడెన్‌పై గ్రిప్పింగ్ డాక్యు సిరీస్!
ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలనే దురంహకారంతో చెలరేగిపోయే అగ్రరాజ్యం అమెరికాకు ముకుతాడు వేసిన మొట్టమొదటి మొనగాడు ఎవరు? ఈ ప్రశ్నకు ఏకైక సమాధానం- ఒసామా బిన్ లాడెన్.;
ప్రపంచంపై ఆధిపత్యం చెలాయించాలనే దురంహకారంతో చెలరేగిపోయే అగ్రరాజ్యం అమెరికాకు ముకుతాడు వేసిన మొట్టమొదటి మొనగాడు ఎవరు? ఈ ప్రశ్నకు ఏకైక సమాధానం- ఒసామా బిన్ లాడెన్. అతడు కరుడుగట్టిన తీవ్రవాది అయినా ప్రపంచవ్యాప్తంగా వీరాభిమానులున్నారు. ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధానాలు పరిశీలించాక మరోసారి ప్రపంచవ్యాప్తంగా ప్రజలు లాడెన్ తిరిగి రావాలని కోరుకునే పరిస్థితి దాపురించింది. భారత్ పై ఉగ్రదాడికి స్పందించని ట్రంప్ పాకిస్తాన్ పై ఆపరేషన్ సిందూర్ ఎటాక్స్ ని అర్థాంతరంగా ఆపివేసి ముష్కరులకు సహకరించాడు. ఒంటెద్దు పోకడలతో ప్రపంచ దేశాల్ని కెలుకుతూ, గేలి చేస్తూ నాటకాలాడుతున్న ట్రంప్ ని అతడి టవర్స్ ని కుప్పకూల్చే మొనగాడు కావాలని ప్రజలు కోరుకుంటున్నారు.
ఇలాంటి తరుణంలో ఇప్పుడు `ఒసామా బిన్ లాడెన్` గురించి ఒక డాక్యు సిరీస్ చర్చగా మారింది. అమెరికన్ మ్యాన్ హంట్ : ఒసామా బిన్ లాడెన్ పేరుతో నెట్ ఫ్లిక్స్ స్ట్రీమింగుకి తెచ్చిన వెబ్ సిరీస్ ఆరంభం నుంచి కథ ముగిసే వరకూ కుర్చీ అంచుపై జారి వీక్షించేంతగా థ్రిల్స్ తో రక్తి కట్టిస్తోంది. ఈ సిరీస్ లో అమెరికన్ మిలటరీ లాడెన్ ని వెతుకుతూ ఎలాంటి తిప్పలు పడింది? సుదీర్ఘ కాలం సిఐఏ వేటలో అలసిపోయి చివరికి చిక్కినట్టే చిక్కి తృటిలో తప్పించుకుని పారిపోయిన లాడెన్ విషయంలో నిరాశపడిన అమెరికన్ల వ్యవహారం సహా చాలా అంశాలను తెరపై అందంగా చూపించారు.
లాడెన్ ఆఫ్ఘనిస్తాన్ లో తల దాచుకున్నాడు. అక్కడి నుంచి పాకిస్తాన్ కి పారిపోయాడు. అక్కడ కూడా ప్రభుత్వానికి అందనంత దూరంగా అడవుల్లో తలదాచుకున్నాడు. అక్కడ కుటుంబంతో స్థిరపడ్డాడు. శత్రు దుర్భేధ్యమైన కోటను కట్టుకున్నాడు. ప్రహారీ నిర్మించుకున్నాడు. కానీ అలాంటి చోటికి అమెరికన్ సైన్యం వెళ్లింది. అతడిపై దాడి చేసి హతమార్చింది. ఈ మొత్తం ఉదంతాన్ని తెరపై డాక్యు సిరీస్ రూపంలో చూపించారు. చాలా ఫోటోలు, వీడియోలు, సిఐఏ ఏజెంట్లు, మిలటరీ ఆఫీసర్ల ఇంటర్వ్యూలతో డాక్యు సిరీస్ ఆద్యంతం ఎంతో రక్తి కట్టించింది. అమెరికా ట్రేడ్ సెంటర్ పై 9/11 వైమానిక దాడుల తర్వాత పరిణామాలు పర్యవసానాలు వగైరా వగైరా ఎంతో అద్భుతంగా తెరపై చూపించారు. 2001లో టోరా బోరా మిషన్ వైఫల్యంలో అమెరికన్ ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్స్ ని కూడా అంగీకరించడం ఈ సిరీస్ లో ప్రత్యేకత. పాక్ లో ఆపరేషన్ నెప్ట్యూన్ స్పియర్ తో లాడెన్ కథ ఎండ్ అవుతుంది. ఇంకా సిరీస్ ఆద్యంతం రక్తి కట్టించే ఎన్నో విషయాలు ఉన్నాయి. డానియల్ శివన్- మార్ లౌసీ ఈ సిరీస్ కి దర్శకత్వం వహించారు. లాడెన్ పై ఇంతకుముందు `జీరో డార్క్ థర్టీ` అనే సినిమా కూడా వచ్చింది. కానీ అది ఫిక్షన్ జోడించినది. కానీ ఉన్నది ఉన్నట్టుగా డాక్యు సిరీస్ లో మాత్రమే చూపించారు.