చక్కని చుక్క నడుము మడతలో దాగిన రహస్యం
నేహా శెట్టి పరిచయం అవసరం లేదు. టిల్లు గాని గాళ్ ఫ్రెండ్ కి బోలెడంత ఫాలోయింగ్ ఉంది. తన దగ్గర ఎరక్కపోయి ఇరుక్కుపోతే ఎట్టుంటదో ప్రాక్టికల్ గానే చూపించింది ఈ బ్యూటీ.;
నేహా శెట్టి పరిచయం అవసరం లేదు. టిల్లు గాని గాళ్ ఫ్రెండ్ కి బోలెడంత ఫాలోయింగ్ ఉంది. తన దగ్గర ఎరక్కపోయి ఇరుక్కుపోతే ఎట్టుంటదో ప్రాక్టికల్ గానే చూపించింది ఈ బ్యూటీ. డీజే టిల్లు బ్లాక్ బస్టర్ విజయం సాధించడంలో నేహా శెట్టి పనితనాన్ని తక్కువ చేయలేం. టిల్లుతో పోటీపడి మరీ నటించింది ఈ కన్నడ బ్యూటీ. నటించిన తొలి సినిమా `రొమాంటిక్`(ఆకాష్ పూరి హీరో)లోను ఎంతో అందంగా కనిపించిన నేహా `గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి`లో అద్భుత నటనతో ఆకట్టుకుంది. ఈ భామ క్యూట్ లుక్స్, మతి చెడే బోల్డ్ ఫ్యాషన్ షూట్ లకు ప్రత్యేకించి ఫాలోయింగ్ ఉంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన డూడ్ బ్లాక్ బస్టర్ విజయం అందుకోగా, ఇందులో నేహాశెట్టి కామియో అప్పియరెన్సుకు మంచి మార్కులే పడ్డాయి.
తాజాగా టిల్లు గాని బ్యూటీ ఆరెంజ్ కలర్ పరికిణీలో మతులు చెడగొడుతోంది. ఇదిగో ఇలా స్పెషల్ వెదర్ లో అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ లో నేహా ఇచ్చిన ఫోజులు కుర్రకారు హృదయాలలో గిలిగింతలు పెడుతున్నాయి. ఒక ఫోజ్ లో నేహా తన వీపందాన్ని నడుము మడతలను ప్రదర్శిస్తోంది. ఫోటోషూట్ లో ఇది వెరీ స్పెషల్.. అందుకే ఈ ఫోటోగ్రాఫ్ అంతర్జాలంలో సునామీ స్పీడ్ తో వైరల్ అయిపోతోంది. శెట్టి నడుము మడతల సొగసును యూత్ తెగ వర్ణించడంలో బిజీ అయిపోతోంది.
నేహా శెట్టి టోన్డ్ ఫిజిక్ ని హైలైట్ చేసే డిజైనర్ లుక్ ఇది. ఆరెంజ్ పరికిణీకి గోల్డ్ కలర్ బార్డర్ మరింత అందాన్ని పెంచింది. మేకప్ లెస్ లుక్ లో శెట్టి ఎంతో బ్యూటిఫుల్ గా కనిపిస్తోంది. ఎంపిక చేసుకున్న దుస్తులకు తగ్గట్టే ఆభరణాలను కూడా ధరించింది. ఈ ఆకర్షణీయమైన ఫోటోషూట్ సోషల్ మీడియాల్లో వైరల్‌గా మారుతోంది. యువనటి స్పీడ్ కి తగ్గట్టుగా ఈ ఫోటోషూట్ అద్భుతంగా కుదిరింది. టిల్లు గాని గాళ్ హీటెక్కిస్తోంది! అంటూ అభిమానులు దీనిపై వ్యాఖ్యానిస్తున్నారు.
నేహా శెట్టి తెలుగులో నటిస్తూనే కన్నడ పరిశ్రమలోను అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. పలు కన్నడ చిత్రాల్లోను ఈ బ్యూటీ నటించినా అక్కడ బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తోంది. ఇలాంటి సమయంలో కాంతార ఫేం రిషబ్ శెట్టి నేహాకు మంచి అవకాశం కల్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి.