గ్లామర్‌తో గిల్లికజ్జాలు: ఫ్యాషన్ సెన్స్‌తో ఊపేస్తున్న శర్మ సిస్టర్స్!
నేహా శర్మ, ఐషా శర్మ.. ఈ పేర్లు వింటేనే సోషల్ మీడియాలో హీట్ అమాంతం పెరిగిపోతుంది.;
నేహా శర్మ, ఐషా శర్మ.. ఈ పేర్లు వింటేనే సోషల్ మీడియాలో హీట్ అమాంతం పెరిగిపోతుంది. తాజాగా గ్రాజియా ఫ్యాషన్ అవార్డ్స్ వేడుకలో శర్మా సిస్టర్స్ సందడి అంతా ఇంతా కాదు. రెడ్ కార్పెట్‌పై అక్కా చెల్లెళ్లు అడుగుపెట్టగానే కెమెరా కళ్లు అన్నీ అటువైపే.. ఫ్యాషన్ విషయంలో ఎప్పుడూ ప్రయోగాలు చేసే ఈ సోదరీమణులు గ్రాజియా అవార్డ్స్2026 వేడుకలో తమ స్టైలిష్ అప్పియరెన్స్‌తో కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టించారు. కేవలం దుస్తులే కాదు.. వీళ్లు క్యారీ చేసిన ఆటిట్యూడ్ కూడా ఈవెంట్‌కే హైలైట్‌గా నిలిచింది.
ముఖ్యంగా ఈ వేడుకకు సంబంధించిన వీడియోలు చూస్తుంటే.. శర్మ సిస్టర్స్‌కు మొహమాటం అనేదే లేని కొంటె కోనంగులు అని అర్థమవుతోంది. కెమెరా ముందు ఫోజులివ్వడంలో ఈ భామలు ప్రదర్శించిన ఆత్మవిశ్వాసం అద్భుతం. ఒకరితో ఒకరు పోటీ పడుతూ.. పర్ఫెక్ట్ ఫ్యాషన్ సెన్స్‌తో హొయలు పోతూ వేదికపై ప్రధాన ఆకర్షణగా నిలిచారు. శర్మా సిస్టర్స్ సోషల్ మీడియాల్లోను నిరంతర ఫోటోషూట్లను షేర్ చేస్తూ.. ఫ్యాన్ బేస్‌ను మరింత పెంచుకున్నారు. ఫ్యాషన్ ప్రపంచంలో తమదైన ముద్ర వేయడానికి ఎలాంటి సందేహాలు లేకుండా బో**ల్డ్ అండ్ బ్యూటిఫుల్ లుక్స్‌తో చేస్తున్న హంగామా ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారుతోంది.
నేహా శర్మ తన క్లాసిక్ అందంతో అలరిస్తుంటే.. ఐషా శర్మ తన ఫిట్‌నెస్, మోడ్రన్ స్టైల్‌తో మెరిసిపోయింది. ఈ జోడీ కాంబినేషన్ ఒక పర్ఫెక్ట్ ఫ్యాషన్ ప్యాకేజీలా అనిపిస్తుంది. నేహా ధరించిన అవుట్‌ఫిట్ తనలోని రాజసాన్ని ఉట్టిపడేలా చేయగా.. ఐషా తన డ్రెస్సింగ్‌తో ట్రెండీ వైబ్స్‌ను క్రియేట్ చేస్తోంది. సిస్టర్స్ మధ్య ఉన్న కెమిస్ట్రీ ఒకరికొకరు స్టైల్ పరంగా కాంప్లిమెంట్ ఇచ్చుకునే విధానం ఫ్యాషన్ ప్రియులను విశేషంగా ఆకట్టుకుంటోంది.
కెరీర్ మ్యాటర్ కి వస్తే.. 2026 సంవత్సరం నేహా శర్మకు చాలా కీలకం కానుంది. ఆమె ప్రస్తుతం `జోగిరా సారా రా రా 2` వంటి క్రేజీ ప్రాజెక్టులతో పాటు, ఒక భారీ బడ్జెట్ ఓటీటీ క్రైమ్ థ్రిల్లర్‌లో కూడా నటిస్తోంది. సౌత్ సినిమాలపై కూడా దృష్టి పెడుతూ.. తన సెకండ్ ఇన్నింగ్స్‌ను పటిష్టం చేసుకోవాలని కలలు కంటోంది. నటిగా తన పరిధిని విస్తరించుకుంటూనే.. ఫ్యాషన్ ఐకాన్‌గా తన ఇమేజ్‌ను మరింత బిల్డ్ చేసుకుంటోంది నేహా.
మరోవైపు ఐషా శర్మ కూడా ఈ ఏడాది వరుస ఒప్పందాలతో దూసుకుపోతోంది. కేవలం వెండితెరకే పరిమితం కాకుండా.. ఒక గ్లోబల్ లైఫ్ స్టైల్ షోకు హోస్ట్‌గా వ్యవహరించేందుకు సిద్ధమైంది. అలాగే ఒక ప్రముఖ నిర్మాణ సంస్థ తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో పవర్‌ఫుల్ పాత్రకు సంతకం చేసిందని సమాచారం. మ్యూజిక్ వీడియోలు.. బ్రాండ్ ఎండార్స్‌మెంట్లతో ఐషా 2026లో ఫుల్ బిజీగా గడపనుంది. మొత్తంమీద శర్మ సిస్టర్స్ ఇటు కెరీర్ పరంగా.. అటు ఫ్యాషన్ పరంగా తమ జోరును కొనసాగిస్తున్నారు.