నటి మూడు పెళ్లిలకు, డబ్బుకు సంబంధం లేదట..!

నీలిమా అజీమ్ మాట్లాడుతూ... తన పెళ్లి విషయమై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూసి షాక్ అయ్యాను.;

Update: 2026-05-12 08:08 GMT

సోషల్‌ మీడియాలో నటీనటుల గురించి పుకార్లు, ఆరోపణలు, విమర్శలు అనేవి కామన్‌గా వినిపిస్తూ ఉంటాయి. ఈ మధ్య కాలంలో వాటి పరిధి హద్దులు దాటుతున్న విషయం మనం చూస్తూనే ఉన్నాం. నటీనటుల వ్యక్తిగత జీవితాలను ప్రభావితం చేసే విధంగా విమర్శలు చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. సెలబ్రిటీల జీవితాల గురించి కామెంట్‌ చేయడం ద్వారా పాపులారిటీ వస్తుందనే ఉద్దేశంతో చాలా మంది విమర్శలు చేస్తున్న విషయం ఈ మద్య కాలంలో చాలా కామన్‌ విషయం అయ్యింది. యంగ్‌ స్టార్స్‌ పై మాత్రమే కాకుండా సీనియర్స్ పైనా అసభ్యకర కామెంట్స్ చేస్తున్న వారు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు సోషల్‌ మీడియాలో బాలీవుడ్‌ సీనియర్ నటి నీలిమా అజీమ్‌ పై విషం కక్కుతూ ఉన్నారు. ఆమె మూడు పెళ్లిల విషయాన్ని చాలా మంది ట్రోల్‌ చేస్తూ దారుణమైన కామెంట్స్ చేస్తూ వస్తున్నారు.

షాహిద్‌ కపూర్‌ తల్లి నీలిమా అజీమ్‌...

బాలీవుడ్‌ స్టార్‌ నటుడు షాహిద్‌ కపూర్ తల్లి అయిన నీలిమా అజీమ్‌ మూడు పెళ్లిల గురించి సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం హద్దులు దాటింది. ఆమె కేవలం డబ్బు కోసం ముగ్గురిని వివాహం చేసుకుందని, ఆమె పెళ్లి చేసుకున్న ప్రతిసారి డబ్బు ప్రధానంగానే బంధం ఏర్పడిందనే విమర్శలు వస్తున్నాయి. బంధాలు బంధుత్వం కంటే కూడా డబ్బుకే ప్రాధాన్యత ఇవ్వడం వల్లే నీలిమా అజీమ్‌ మూడు సార్లు వివాహం చేసుకుందనే విమర్శలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆమె వ్యక్తిగత జీవితం గురించి సోషల్‌ మీడియాలో మరిన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తన గురించి చాలా కాలంగా వినిపిస్తున్న విమర్శలకు నీలిమా అజీమ్‌ స్పందించారు. ఇప్పటికే చాలా దారుణంగా తన గురించి ప్రచారం చేస్తున్నారు, ఇప్పటికి అయినా స్పందించాలని తాను అనుకుంటున్నట్లుగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో అసహనం వ్యక్తం చేసింది.

సోషల్‌ మీడియాలో పుకార్లు షికార్లు...

నీలిమా అజీమ్ మాట్లాడుతూ... తన పెళ్లి విషయమై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూసి షాక్ అయ్యాను. ఇప్పటి వరకు తాను పెళ్లి చేసుకున్న ముగ్గురు సైతం నిరాడంబరమైన జీవితాన్ని సాగించే వారు. వారి యొక్క గొప్పతనం చూసి పెళ్లి చేసుకున్నాను. వారి ఆస్తి గురించి తాను ఎప్పుడూ ఆలోచించలేదు. నేను బౌతిక సంపద గురించి ఎప్పుడూ చూడలేదు. నా జీవితం కోసం పెట్టుబడి పెట్టే వారి కోసం నేను చూడలేదు. నేను నటిగా బాగానే సంపాదించాను. ఒకరి సంపాదనపై జీవితాన్ని సాగించాల్సిన అవసరం నాకు లేదు. నా జీవితం, నా సినీ జీవితం తెలిసిన వారు ఏ ఒక్కరూ డబ్బు కోసం నేను పెళ్లిలు చేసుకోను అనుకోరు. కానీ మీడియాలో కొందరు పూర్తిగా నా గురించి తెలియక పోవడం వల్ల ఇలాంటి పుకార్లు పుట్టిస్తున్నారు. నా కెరీర్‌ లో సాధించిన విజయాలను గురించి కాకుండా నా వ్యక్తిగత విషయాల గురించి కొందరు ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇషాన్ ఖట్టర్ తల్లి...

నీలిమా అజీమ్‌ మొదట పంకజ్ కపూర్‌ను వివాహం చేసుకుంది. వీరిద్దరికీ షాహిద్‌ కపూర్‌ జన్మించారు. వ్యక్తిగత కారణాల వల్ల నీలిమా, పంకజ్ విడాకులు తీసుకున్నారు. పంకజ్‌ కపూర్‌తో విడిపోయిన తర్వాత కొన్నాళ్ల వరకు నీలిమా సింగిల్‌గానే జీవితాన్ని సాగించింది. కొన్నాళ్ల తర్వాత రాజేష్‌ ఖట్టర్‌తో ప్రేమలో పడింది. అతడిని వివాహం చేసుకుంది. నీలిమా, రాజేష్ ఖట్టర్‌ తనయుడు ఇషాన్ ఖట్టర్‌. ఇతడు బాలీవుడ్‌ హీరో అనే విషయం తెల్సిందే. రాజేష్ ఖట్టర్‌తోనూ కొన్ని విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. ఆ తర్వాత నీలిమా చివరకు ఉస్తాద్‌ రజా అలీ ఖాన్‌ ను వివాహం చేసుకుంది. 2004లో రజా అలీని వివాహం చేసుకున్న నీలిమా అతడి నుంచి 2009లో విడి పోయింది. ప్రస్తుతం ఆమె సింగిల్‌గానే ఉంటున్నారు. 67 ఏళ్ల నీలిమా మళ్లీ పెళ్లి చేసుకుంటారు అనే టాక్‌ ఉంది. ఆ వార్తలపై మాత్రం తాజా ఇంటర్వ్యూలో స్పందించలేదు.

Tags:    

Similar News