నాట్స్ వేదికపై 'ఎన్‌బీకే 111' గురించి..!

అమెరికాలో జరుగుతున్న నాట్స్‌ వేడుకల్లో బాలకృష్ణతో కలిసి పాల్గొన్న గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ ఎన్‌బీకే 111 సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.;

Update: 2025-07-07 09:29 GMT
నాట్స్ వేదికపై ఎన్‌బీకే 111 గురించి..!

అమెరికాలో జరుగుతున్న నాట్స్ వేడుకల్లో పాల్గొనేందుకు గాను బాలకృష్ణ అమెరికా వెళ్లారు. బాలకృష్ణతో పాటు దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఉన్నారు. బాలకృష్ణకు 'వీర సింహారెడ్డి' తో గోపీచంద్ మలినేని వంద కోట్ల వసూళ్లను అందించిన విషయం తెల్సిందే. ఆ సమయంలోనే మరోసారి బాలకృష్ణతో మరో సినిమాను చేస్తానంటూ గోపీచంద్‌ మలినేని ప్రకటించారు. వీర సింహారెడ్డి తర్వాత బాలీవుడ్‌లో సన్నీ డియోల్‌తో జాట్‌ సినిమాను రూపొందించిన విషయం తెల్సిందే. ఆ సినిమాతో బాలీవుడ్‌లో దర్శకుడిగా గోపీచంద్‌ మలినేని మంచి మార్కులు దక్కించుకున్నాడు. బాలీవుడ్‌ నిర్మాణ సంస్థలు, హీరోలు గోపీచంద్‌ మలినేనితో కలిసి వర్క్‌ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారు.

ఇలాంటి సమయంలో గోపీచంద్‌ మలినేని తదుపరి సినిమాను బాలకృష్ణతో చేసేందుకు సిద్ధం అయ్యాడు. బాలకృష్ణ 111 సినిమాకు గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే ఈ విషయం గురించి చర్చలు పూర్తి అయ్యాయి. ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న అఖండ 2 సినిమాను చేస్తున్నాడు. బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న 'అఖండ 2' సినిమా తర్వాత బాలకృష్ణ చేయబోతున్న సినిమాకు గోపీచంద్‌ మలినేని దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ జరుగుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా దర్శకుడు గోపీచంద్‌ మలినేని తన తదుపరి సినిమా గురించి అధికారికంగా ప్రకటన చేశాడు.

అమెరికాలో జరుగుతున్న నాట్స్‌ వేడుకల్లో బాలకృష్ణతో కలిసి పాల్గొన్న గోపీచంద్‌ మలినేని మాట్లాడుతూ ఎన్‌బీకే 111 సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇప్పటి వరకు బాలకృష్ణను చూడని విధంగా చూపించబోతున్నట్లు పేర్కొన్నారు. తప్పకుండా బాలకృష్ణ ఫ్యాన్స్‌తో పాటు, ప్రతి ఒక్కరినీ మెప్పించే విధంగా ఈ సినిమా ఉంటుందని అభిమానులకు గోపీచంద్‌ మలినేని హామీ ఇచ్చాడు. బాలకృష్ణ 111 సినిమాను ఇదే ఏడాదిలో పట్టాలెక్కించబోతున్నట్లు ప్రకటించారు. గోపీచంద్‌ ఫిల్మ్‌ మేకింగ్‌ చాలా స్పీడ్‌గా ఉంటుంది. కనుక ఆయన ఎన్బీకే 111 సినిమాను వచ్చే ఏడాది సమ్మర్‌ వరకు పూర్తి చేసి విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.

వరుస విజయాలతో దూకుడు మీదున్న బాలకృష్ణ అఖండ 2 సినిమాతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంటే ఖచ్చితంగా గోపీచంద్‌ మలినేని సినిమాకు మరింత బజ్‌ క్రియేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఈ మధ్య కాలంలో బాలకృష్ణ తన పారితోషికం ను దాదాపుగా 50 శాతం పెంచారని సమాచారం. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో చేయబోతున్న సినిమాకు గాను బాలకృష్ణ అత్యధిక పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తోంది. వృద్ది సినిమాస్‌ బ్యానర్‌ పై వెంకట సతీష్ కిలారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామిగా ఉండటంతో పాటు, భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News