విజయాల వేటలో అలుపెరగని యోధుడు!
గడిచిన కొన్నేళ్లుగా ఎదురేలేని స్టార్ గా హవా సాగిస్తున్నారు ఈ సీనియర్ హీరో. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో 60 ప్లస్ ఏజ్ లోను ఆయన హవా చూస్తుంటే, ఔరా! అని ముక్కున వేలేసుకోని వాళ్లే లేరు.;
గడిచిన కొన్నేళ్లుగా ఎదురేలేని స్టార్ గా హవా సాగిస్తున్నారు ఈ సీనియర్ హీరో. బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ లతో 60 ప్లస్ ఏజ్ లోను ఆయన హవా చూస్తుంటే, ఔరా! అని ముక్కున వేలేసుకోని వాళ్లే లేరు. ఓవైపు బాలీవుడ్ లో ఖాన్ లతో పాటు ఇటు సౌత్ లోను సహచర స్టార్లు ఫ్లాపులతో నీరసపడుతుంటే, ఈ టాలీవుడ్ సీనియర్ హీరో బాక్సాఫీస్ జోష్ చూసిన వారికి నిజంగా ఆశ్చర్యం కలిగింది. తన తండ్రి, లెజెండరీ నటుడిపై బయోపిక్ సినిమాలు తీసి, బాక్సాఫీస్ నష్టాలతో తీవ్రంగా దెబ్బ తిన్న తర్వాత ఇక అయిపోయాడు! అంటూ ప్రచారం సాగింది.
కానీ ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే రాబట్టుకోవాలి! అనే పంతంతో ఈ స్టార్ హీరో రైజ్ అయిన తీరు నిజంగా అందరికీ స్ఫూర్తి. అటు పెద్ద తెరపై రాణిస్తూనే, ఇటు ఓటీటీ తెరపై రియాలిటీ హోస్ట్ గాను సత్తా చాటి కెరీర్ బెస్ట్ ఫేజ్ కి చేరుకున్న ఈ స్టార్ హీరో ఎవరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతడు టాలీవుడ్ మూల స్థంబాల్లో ఒకరైన ది గ్రేట్ -NBK. నటసింహా నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఇటీవలి ఉత్థానపతనాల గురించి చర్చిస్తే..
ఎన్టీఆర్- కథానాయకుడు, ఎన్టీఆర్ - మహానాయుడు లాంటి బయోపిక్ లతో తీవ్రంగా దెబ్బ తిన్న నందమూరి బాలకృష్ణ ఆ తర్వాత రూలర్ తో మరో ఫ్లాప్ ని ఎదుర్కొన్నారు. ఆ సమయంలో ట్రేడ్ లో సన్నివేశం ఏమంత బాలేదు. కానీ అనూహ్యంగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో `అఖండ` చిత్రంతో తానేంటో చూపించారు. గ్రేట్ కంబ్యాక్ అంటే ఏమిటో బాలయ్య నిరూపించారు. ఈ చిత్రంలో ద్విపాత్రాభినయంతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత గోపిచంద్ మలినేని తో వీర సింహారెడ్డి, అనీల్ రావిపూడితో భగవంత్ కేసరి, బాబి తో డాకు మహారాజ్ చిత్రాలతో వరుసగా బ్లాక్ బస్టర్లు అందుకున్నారు. మరోవైపు ఆహా తెలుగు ఓటీటీలో అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే వరుస సీజన్లు గ్రాండ్ సక్సెసవ్వడంతో పెద్ద తెర, చిన్న తెర రెండు చోట్లా బాలయ్య హవాకు ఎదురే లేకుండా పోయింది.
ప్రస్తుతం బోయపాటితో `అఖండ 2` కోసం ఎన్బీకే తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ఏడాదిలోనే సినిమా విడుదల కానుంది. బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీలో రెండో భాగంగా వస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. దానికి తగ్గట్టే ట్రేడ్ లోను భారీ డిమాండ్ నెలకొందని సమాచారం. ప్రస్తుతం ఓ రెండు దిగ్గజ ఓటీటీలు అఖండ 2 స్ట్రీమింగ్ హక్కులను దక్కించుకునేందుకు పోటీపడుతున్నాయని, థియేట్రికల్ బిజినెస్ లోను భారీ హైప్ నెలకొందని ఫిలింనగర్ వర్గాల ద్వారా తెలుస్తోంది. నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ ఈ రెండిటిలో ఏ ఓటీటీకి అఖండ 2 రైట్స్ దక్కుతాయోననే ఆసక్తి ఇండస్ట్రీ వర్గాల్లో నెలకొంది. విడుదలకు ముందే డిమాండ్, హైప్ చూశాక అఖండ 2 బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించబోతోందో ముందే అంచనా వేస్తున్నారు