• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య.. 'క్లైమాక్స్'కు...

బాలయ్య.. 'క్లైమాక్స్'కు వేళాయే!

| అందుకు బాలయ్య కూడా పవర్ ఫుల్ గా సిద్ధం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. నెవ్వర్ బిఫోర్ అనేలా క్లైమాక్స్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.

By - Tupaki Desk
Update: 2024-11-03 07:06 GMT

టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ.. ప్రస్తుతం NBK 109 మూవీతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రీసెంట్ గా అఖండ-2 పూజా కార్యక్రమాలు జరగ్గా.. ఇప్పుడు NBK 109 సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు బాలయ్య. పక్కా మాస్ ఎంటర్టైనర్ గా చిత్రాన్ని బాబీ తెరకెక్కిస్తున్నారు. ఇప్పటి వరకు ఎన్నడూ చూడని రీతిలో బాలయ్యను వైలెంట్ గా చూపిస్తానని బాబీ ఇప్పటికే పలుమార్లు తెలిపారు.

అయితే కొద్ది రోజుల క్రితం విడుదలైన గ్లింప్స్.. మంచి రెస్పాన్స్ అందుకుంది. అందులో బాలయ్యను ఓ రేంజ్ లో చూపించారు మేకర్స్. దీంతో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న NBK 109 మూవీకి డాకు మహారాజ్, వీర మాస్, సర్కార్ సీతారాంలో ఏదో ఒక టైటిల్ ఫిక్స్ చేశారని కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి. దీపావళికి అనౌన్స్మెంట్ వస్తుందని అంతా అనుకోగా.. రాలేదు.

దీపావళి పండగకు టైటిల్ ను విజువల్స్ తో సహా రూపొందించి అనౌన్స్ చేద్దామనుకున్నామని, సీజీ వర్క్ అవ్వలేకపోవడం వల్ల ఇవ్వలేకపోతున్నామని NBK 109 నిర్మాత నాగ వంశీ రీసెంట్ గా తెలిపారు. నవంబర్ రెండో వారంలో అప్డేట్ ఇస్తామని చెప్పారు. దీంతో అంతా అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్నారు. అదే సమయంలో ఇప్పుడు కొత్త అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. సినిమా క్లైమాక్స్ ను షూట్ చేయడానికి మేకర్స్ సిద్ధమవుతున్నారని టాక్ వినిపిస్తోంది.

ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్న మేకర్స్.. కొత్త షెడ్యూల్ లో క్లైమాక్స్ ను చిత్రీకరించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. అందుకు బాలయ్య కూడా పవర్ ఫుల్ గా సిద్ధం అవుతున్నారని వార్తలు వస్తున్నాయి. నెవ్వర్ బిఫోర్ అనేలా క్లైమాక్స్ ను మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ షూట్ అయ్యాక.. బాలయ్య తన డబ్బింగ్ పార్ట్ ను పూర్తి చేయనున్నట్లు టాక్.

ఇక సినిమా విషయానికొస్తే.. సితార ఎంటర్టైన్మెంట్స్‌, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై భారీ బడ్జెట్ తో నాగవంశీ, సాయి సౌజన్య గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. చాందినీ చౌదరి, ఊర్వశీ రౌతేలా ఫిమేల్ లీడ్ రోల్స్ లో నటిస్తున్నారు. బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరి పొంగల్ బరిలో దిగనున్న NBK 109 సినిమా ఎలాంటి హిట్ అవుతుందో వేచి చూడాలి.

Tags:    
  • Nandamuribalakrishna 
  • Nbk109 
  • Bobby 
  • Urvashirautela 
  • Nagavamsi 
  • Sitharaentertainments 
  • Climax 
  • Movieshooting 

Similar News

అన్ని పుకార్ల‌కు చెక్.. 'దాదా' ఫిక్స‌యితే ద‌బిడి దిబిడే!

2026-11-05 07:53 GMT

ఇదేమి కన్ఫ్యూజన్ నాని.. అది ఇది కాదు.. అదే ఇది..!

2026-11-05 07:53 GMT

'రామాయణం' మూవీ రివ్యూ

2026-11-05 07:40 GMT

బాకీలు ఎగ్గొట్టిన మ్యూజిక్ డైరెక్టర్.. దేవుడికి కంప్లైంట్!

2026-11-05 07:36 GMT

మళ్లీ వోగ్ కవర్‌పై కత్రినా.. ఫ్యాన్స్‌కు స్పెషల్ ట్రీట్!

2026-11-05 07:35 GMT

ఈ దీపావళికి పెద్దగా సౌండ్ చేయలేకపోయిన టాలీవుడ్!

2026-11-05 07:27 GMT

కీర్తి సురేష్.. మరోసారి లెక్క తప్పిందా..

2026-11-05 07:23 GMT

సంక్రాంతి బాక్సాఫీస్ రేసు - 1000 కోట్ల బిజినెస్ అంచనా!

2026-11-05 07:21 GMT

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

Copyright @2026

Powered by Blink CMS