అతనికి ఇంప్రెస్ అయిన నయన్..!
ఐతే అనిల్ వర్కింగ్ స్టైల్ కి నయనతార ఫిదా అయ్యిందని టాక్. ఎందుకంటే అసలేమాత్రం మిస్ యూజ్ లేకుండా స్టార్ డేట్స్ ని వాడుతున్నాడట అనిల్ రావిపూడి.;
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార ఆఫ్టర్ లాంగ్ టైం తెలుగులో మెగా మూవీకి సైన్ చేసింది. మెగాస్టార్ చిరంజీవి 157 సినిమాలో చిరంజీవి సరసన నటిస్తుంది నయనతార. ఆల్రెడీ ఈ ఇద్దరు సైరా నరసింహారెడ్డి సినిమాలో కలిసి జత కట్టారు. ఆ తర్వాత మళ్లీ అనిల్ రావిపూడి సినిమాకు పనిచేస్తున్నారు. ఐతే పెళ్లి తర్వాత నయనతార చాలా సెలెక్టెడ్ గా సినిమాలు చేస్తుంది. ఇతర భాషల సినిమాలైతే మాక్సిమం కాదనేస్తుంది.
కానీ చిరుతో సినిమా అది కూడా అనిల్ డైరెక్షన్ లో అనేసరికి ఆసక్తి చూపించింది. అనిల్ రావిపూడి సినిమా షూటింగ్ ఎంట్రీ తోనే నయనతార ఒక క్రేజీ వీడియోతో హాయ్ చెప్పింది. ఇక సినిమాలో ఆమె రోల్ కూడా క్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది. సినిమాలో చిరంజీవి పి.ఈ.టి మాస్టర్ గా కనిపిస్తాడట. నయన్ పాత్ర గురించి డీటైల్స్ బయటకు రాలేదు.
ఐతే అనిల్ వర్కింగ్ స్టైల్ కి నయనతార ఫిదా అయ్యిందని టాక్. ఎందుకంటే అసలేమాత్రం మిస్ యూజ్ లేకుండా స్టార్ డేట్స్ ని వాడుతున్నాడట అనిల్ రావిపూడి. అందుకే నయనతారకి కూడా అతను బాగా నచ్చేశాడట. అనిల్ రావిపూడితో పనిచేసిన ఎవరైనా ఈ మాటే చెబుతారు. నయనతార తెలుగు సినిమా చేయాలనుకోవడమే షాకింగ్ థింగ్ అయితే.. సినిమా అనుకున్న విధంగా చక చకా కానివ్వడం చూసి ఆమె సర్ ప్రైజ్ అవుతుందట.
స్టార్స్ ని డేట్స్ అడిగి.. దానికి ఒకటి రెండు రోజులు అదనంగా తీసుకునే డైరెక్టర్స్ ని చూశాం కానీ అనిల్ ఇచ్చిన స్టార్ డేట్స్ కి రెండు రోజుల ముందే షెడ్యూల్ పూర్తి చేస్తాడట. అందుకే అతని గురించి అందరు పాజిటివ్ గా చెప్పుకుంటున్నారు. నయనతార కూడా ఇంప్రెస్ అయ్యింది అంటే ఆమెను మళ్లీ మళ్లీ తన సినిమాల్లో తీసుకునే ఛాన్స్ ఉంటుంది.
ఇక మెగా మూవీ విషయానికి వస్తే 2026 సంక్రాంతికి రిలీజ్ అనుకున్న ఈ సినిమాను అనుకున్న దానికన్నా ముందే ఫస్ట్ కాపీ రెడీ చేసి పెట్టేసేలా అనిల్ దూకుడు ఉందట. సో అనిల్ డైరెక్షన్ లో చిరు, నయన్ ఆన్ స్క్రీన్ మ్యాజిక్ ఎలా ఉంటుందో తెలియాలంటే సినిమా వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. ఈ సినిమాకు భీమ్స్ మ్యూజిక్ అందిస్తుండగా సినిమాలో మెగాస్టార్ వింటేజ్ వైబ్స్ గుర్తు చేసేలా అనిల్ రావిపూడి టేకింగ్ ఉందని చెబుతున్నారు. అదే జరిగితే మాత్రం మెగా ఫ్యాన్స్ కి పండగ అన్నట్టే లెక్క.