యష్ కి తోడుగా గన్ పట్టిన లేడీ సూపర్ స్టార్
లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.;
'కేజీఎఫ్ 2' తర్వాత రాకింగ్ స్టార్ యష్ నుంచి వస్తున్న సినిమా కోసం ఫ్యాన్స్ ఏ స్థాయిలో ఎదురుచూస్తున్నారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 'టాక్సిక్' అనౌన్స్ మెంట్ తోనే అంచనాలు పెంచేసిన యష్, ఇప్పుడు క్యాస్టింగ్ విషయంలో ఒక్కొక్క అస్త్రాన్ని బయటకు తీస్తూ హీట్ పెంచుతున్నాడు. లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి వచ్చిన ఒక క్రేజీ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఒక కీలక పాత్రలో నటిస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఆమె పాత్ర పేరు 'గంగ' అని రివీల్ చేస్తూ, ఒక పవర్ ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను వదిలారు. ఫస్ట్ లుక్ లోనే నయనతార విశ్వరూపం కనిపిస్తోంది. ఆమె లుక్ చూస్తుంటే సినిమాలో ఇది ఒక మామూలు పాత్ర కాదని స్పష్టంగా అర్థమవుతోంది.
పోస్టర్ లో నయన్ గెటప్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది. బ్లాక్ కలర్ మోడ్రన్ డ్రెస్, చేతిలో ఒక పెద్ద గన్ పట్టుకుని ఆమె నడిచి వస్తున్న తీరు హై లెవెల్ లో ఉంది. చుట్టూ సూట్లు వేసుకున్న గార్డ్స్, ఒక రాయల్ ప్యాలెస్ లాంటి బ్యాక్ డ్రాప్ చూస్తుంటే.. ఆమె ఇందులో ఒక లేడీ డాన్ లాగానో లేదా ఒక పవర్ ఫుల్ లీడర్ లాగానో కనిపించబోతోందని ఊహించవచ్చు. ఆమె పాత్రలో నెగటివ్ షేడ్స్ కూడా ఉండొచ్చని అనిపిస్తోంది.
రాకింగ్ స్టార్ యష్, లేడీ సూపర్ స్టార్ నయనతార.. ఈ ఇద్దరూ ఒకే ఫ్రేమ్ లో ఉంటే స్క్రీన్ బ్లాస్ట్ అవ్వడం ఖాయం. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను "పెద్దల కోసం ఒక అద్భుత కథ" అనే ట్యాగ్ లైన్ తో ప్రమోట్ చేస్తున్నారు. అంటే ఇది రెగ్యులర్ మాస్ మసాలా సినిమా కాదని, కంటెంట్ చాలా వైల్డ్ గా, కొత్తగా ఉండబోతోందని అర్థమవుతోంది.
కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. నయనతార ఎంట్రీతో సినిమా స్పాన్ పాన్ ఇండియా లెవెల్ లో మరింత పెరిగింది. యష్ కి ధీటుగా నిలబడే క్యారెక్టర్ కాబట్టే నయన్ ఒప్పుకుని ఉంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఈ పోస్టర్ తో సినిమా విజువల్స్, కాస్ట్యూమ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో ఒక శాంపిల్ చూపించేశారు. మొత్తానికి 'గంగ' రాకతో 'టాక్సిక్' మీద అంచనాలు డబుల్ అయ్యాయి. ఈ సినిమాను 2026 మార్చి 19న గ్రాండ్ గా థియేటర్లలోకి తీసుకురాబోతున్నారు. విడుదల తేదీకి ఇంకా టైమ్ ఉన్నప్పటికీ, ఇలాంటి సాలిడ్ అప్డేట్స్ ఇస్తూ ఇప్పుడే బాక్సాఫీస్ వార్ కి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నారు. ఇక యష్, నయన్ కాంబో బిగ్ స్క్రీన్ మీద ఎలాంటి మ్యాజిక్ చేస్తుందో చూడాలి.