రంగు లేదు.. నటుడిలా లేవు అన్నారు: నవాజుద్దీన్
నువ్వు నటుడిలా కనిపించడం లేదు.. నల్లగా ఉన్నావని కామెంట్ చేసారని నవాజుద్దీన్ సిద్ధిఖి తన ఆరంభ రోజుల్ని గుర్తు చేసుకున్నారు.;
నువ్వు నటుడిలా కనిపించడం లేదు.. నల్లగా ఉన్నావని కామెంట్ చేసారని నవాజుద్దీన్ సిద్ధిఖి తన ఆరంభ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. తనతో పాటు ఓంపురి, ఇర్ఫాన్ ఖాన్, నసీరుద్దీన్ షా, మనోజ్ భాజ్ పాయ్ లాంటి నటులపై పెద్ద బడ్జెట్లను పెట్టుబడిగా పెట్టేందుకు నిర్మాతలు సిద్ధంగా లేరని నవాజుద్దీన్ అన్నారు. 25 కోట్ల బడ్జెట్ మించరని, కానీ తమను ఏ స్థాయిలో ప్రజలు చూడాలనుకుంటున్నారో మేకర్స్ గమనించాలని కూడా సూచించారు.
తన సినిమా బావున్నా కానీ, థియేటర్లను ఇవ్వలేదని, ప్రజలు తనను తెరపై చూడాలనుకున్నా కానీ వారు పెద్ద బడ్జెట్లతో సినిమా తీయరు! అని అన్నారు. నవాజుద్దీన్ సిద్ధిఖీ తనతో సహా పరిశ్రమలోని ఒక నిర్దిష్ట వర్గం బంధుప్రీతి, పక్షపాతం ప్రదర్శిస్తుందని అన్నారు. తన లుక్స్, రంగు గురించి జనం తీర్పులు ఇచ్చారని, తనతో పెద్ద బడ్జెట్ పెట్టేందుకు నిర్మాతలు ఎవరూ ముందుకు రాలేదని నవాజుద్దీన్ అన్నారు. తమ సినిమాలను 250 పైగా థియేటర్లలో విడుదల చేయాలని కూడా అన్నారు.
2016లో వచ్చిన తన చిత్రం `రామన్ రాఘవ్ 2.0`కి తగినన్ని థియేటర్లు లభించకపోవడంపైనా నవాజుద్దీన్ ఆవేదన చెందాడు. అలాగే పరిశ్రమలో కొందరు నటులు వారి బ్యాక్ గ్రౌండ్ కారణంగా ఇంకా నిలబడుతున్నారు. వారికి నటనతో పని లేదని కూడా నవాజుద్దీన్ అన్నారు. తన సినిమాలు వాణిజ్య పరంగా ఆడవు అనే భయం తనకు లేదని కూడా అన్నారు.