నవాజుద్దీన్ వారసురాలు మరో రాధిక ఆప్టే!
బాబు మోషాయ్ నవాజుద్దీన్ సిద్ధిఖీలోని విలక్షణ నటనకు భారీ ఫాలోవర్స్ ఉన్నారు. అతడి నడక నడత హావభావాల ప్రతిదీ సన్నివేశంలో అద్భుతంగా పండుతాయి.;
బాబు మోషాయ్ నవాజుద్దీన్ సిద్ధిఖీలోని విలక్షణ నటనకు భారీ ఫాలోవర్స్ ఉన్నారు. అతడి నడక నడత హావభావాల ప్రతిదీ సన్నివేశంలో అద్భుతంగా పండుతాయి. అతడు స్టేజీ ఆర్టిస్టు. పెద్ద తెరను ఏలిన నటుడు. అందుకే ఇప్పుడు అతడి నటవారసురాలు షోరా సిద్ధిఖి సినీరంగంలో అడుగుపెట్టబోతోంది అనగానే ఒకటే ఉత్కంఠ నెలకొంది.
షోరా నట శిక్షణ తీసుకుంటోందని ఇంతకుముందే నవాజుద్దీన్ వెల్లడించాడు. తన కుమార్తె నేరుగా వెళ్లి పెర్ఫామింగ్ ఆర్ట్స్ ఫ్యాకల్టీలోనే చేరిపోయింది! అంటూ సరదాగా జోక్ చేసాడు. అయితే షోరా నటనను ఎంతగా అభిమానిస్తుందో, ఎంతగా ఆరాధిస్తుందో తాజాగా నవాజుద్దీన్ షేర్ చేసిన వీడియో రివీల్ చేస్తోంది. ఈ చిన్న వీడియోలో షోరా నటన, భావ వ్యక్తీకరణ ప్రతిదీ ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా డైలాగ్‌కి తగ్గట్టే ఫేషియల్ ఎక్స్ ప్రెషన్స్ తో 15 ఏళ్ల షోరా హృదయాలను గెలుచుకుంది. సన్నివేశంలో ఆంగ్లం మాట్లాడుతూ కనిపించింది ఈ చిన్నారి. ప్రస్తుతం ఈ క్లిప్ ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతోంది.
ఇన్‌స్టాలో షేర్ చేస్తూ ``నేను లోపలికి రావచ్చా.... సీన్ వన్`` అనే క్యాప్షన్ తో నవాజుద్దీన్ షేర్ చేసారు. ఈ సన్నివేశం షోరా భావవ్యక్తీకరణలు, నట ప్రదర్శనను ఆవిష్కరించింది. ``నేను ఆమెలో నెక్ట్స్ రాధిక ఆప్టేను చూడగలను`` అని ఒక నెటిజన్ రాసారు. మరొకరు `ఆమె బాలీవుడ్ లో ఆధిపత్యం చెలాయిస్తుంది`` అని రాసాడు. తండ్రికి తగ్గ వారసురాలు అంటూ కొందరు ప్రశంసించారు. ఇటీవలి వర్క్‌షాప్‌లో షోరాకు శిక్షణ ఇచ్చిన దర్శకుడు రాన్ కహ్లాన్ కూడా ప్రశంసలు కురిపించాడు. దేవుడు ఆమెను నవాజ్ ని ఆశీర్వదిస్తాడు. ఆమెతో పనిచేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంతటి ప్రతిభను ఎప్పుడూ చూడలేదు!!.. అని ఒకరు ప్రశంసించారు.
నవాజుద్దీన్ చివరిసారిగా `కోస్టావో`లో కనిపించాడు. జీ సినిమాస్ లో ఇది స్ట్రీమ్ అవుతోంది. సెక్షన్ 108, నూరానీ చెహ్రా, సంగీన్, రాత్ అకేలి హై 2 సహా పలు చిత్రాల్లో అతడు నటిస్తున్నాడు.