మల్లెపూల దెబ్బ.. ఏకంగా కేంద్రానికి లేఖ రాసిన నవ్య నాయర్!
నవ్య నాయర్.. మలయాళ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. తాజాగా మల్లెపూలను తన బ్యాగ్ లో తీసుకెళ్తూ మెల్బోర్న్ ఎయిర్పోర్టులో అధికారుల చేత ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.;
నవ్య నాయర్.. మలయాళ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. తాజాగా మల్లెపూలను తన బ్యాగ్ లో తీసుకెళ్తూ మెల్బోర్న్ ఎయిర్పోర్టులో అధికారుల చేత ఇబ్బందులు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా అత్యంత కఠినమైన బయో సెక్యూరిటీ చట్టాలు కలిగిన ఆస్ట్రేలియాలో.. ప్రయాణికులు పండ్లు, విత్తనాలు, పూలు పాల ఉత్పత్తులను తమతో తీసుకెళ్లడం నిషిద్ధం.. ఈ విషయం తెలియని నవ్య నాయర్ బ్యాగులో పూలు తీసుకెళ్లడంతో ఈమెకు రూ l.14 లక్షల జరిమానా విధించారు మెల్బోర్న్ ఎయిర్పోర్ట్ అధికారులు. ఈ అంశంపై తాజాగా ఆమె రియాక్ట్ అవుతూ.. ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖకు అలాగే ఆస్ట్రేలియా కస్టమ్స్ అధికారులకు ఆమె లేఖ రాశారు.
ఆస్ట్రేలియా కస్టమ్స్ అధికారులకు లేఖ రాస్తూ.. "జరిమానా విధించిన తర్వాత నేను ఆశ్చర్యానికి లోనయ్యాను. ఈ చట్టాల గురించి అందరూ తెలుసుకోవాలి. వాస్తవానికి ఆరోజు నా బ్యాగులో పువ్వులు నేను తీసుకు వెళ్ళనేలేదు. పువ్వులు నా జుట్టు మీద మాత్రమే ఉన్నాయి. అది అందరికీ కూడా బహిరంగంగానే కనిపిస్తుంది. వాటిని నేనేమీ దాచలేదు కదా.. కానీ నా బ్యాగ్ లో పువ్వులు ఉండడం వల్ల ఎయిర్పోర్ట్ లోనే స్నిఫర్ డాగ్స్ వాటిని పసిగట్టాయి. వాస్తవానికి నేను ఎయిర్పోర్ట్ కి రాకముందు నా బ్యాగ్ లో ఆ పువ్వులు పెట్టాను. కానీ వాటిని తర్వాత తలలో పెట్టుకున్నాను. ఇక బ్యాగ్ లో నుంచి తీయడం వల్ల.. బ్యాగ్ లో ఒకటి, రెండు పువ్వులు అలాగే ఉండిపోయాయి. వాటిని ఆ డాగ్స్ పసిగట్టాయి. దీంతో అధికారులు ఫైన్ వేస్తూ.. 28 రోజుల్లో ఫైన్ చెల్లించాలని కోరారు" అంటూ ఆమె కస్టమ్స్ అధికారులకు లేఖ రాశారు.
అనంతరం ఆస్ట్రేలియా వ్యవసాయ శాఖకు ఆమె మెయిల్ ద్వారా సంప్రదిస్తూ.. "అక్కడ జరిగిన విషయాన్ని నేను అధికారులతో చెప్పాను. జరిమానా మొత్తాన్ని మాఫీ చేయాలని కూడా కోరాను. కానీ వారు మాఫీ చేయకపోతే రూ.26,000 వసూలు చేస్తారని ఒక ఆర్టికల్ లో చదివాను. నిజానికి నాకు వారి నుంచి ఎటువంటి సమాధానం లభించలేదు. మానవతా కోణంలో వారు నిర్ణయం తీసుకుంటారని నేను ఆశిస్తున్నాను. ఒక దేశ చట్టాన్ని ఎవరైనా సరే పాటించాలి కదా.. ఒకవేళ తప్పని పరిస్థితుల్లో జరిమానా చెల్లించాల్సిందే అని కోరితే మాత్రం నేను వేరే మార్గం లేకుండా ఆ జరిమానా చెల్లిస్తాను" అంటూ ఆమె తెలిపింది? ప్రస్తుతం నవ్యా నాయర్ రాసిన ఈ లేఖలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
ఇకపోతే పువ్వుల నిషిద్ధంపై అక్కడి ప్రభుత్వాలు ఏం చెబుతున్నాయంటే.. బయో సెక్యూరిటీ నియమాల ప్రకారం.. పువ్వులతో సహా గింజలు, కాయగూరలు, మట్టి , జంతు సంబంధిత ఉత్పత్తులు, మొక్కలు, పాల ఉత్పత్తులు ఇలా కొన్నింటిని తీసుకువెళ్లకూడదు. వీటిని తీసుకెళ్తే శిక్షతోపాటు జరిమానా కూడా విధిస్తారు. నిజానికి ఇలా చేయడం వెనుక అసలు కారణం.. పదార్థాల వల్ల క్రిమి కీటకాలు తమ దేశంలోకి వ్యాప్తి చెందుతాయని, ఆపై అక్కడి పంటలకు నష్టం కలిగిస్తాయని, ప్రజల ప్రాణాలకు కూడా హాని కలిగిస్తాయని, అందుచేతనే ఇలాంటి కఠిన నియమాలను అమలు పరచామని స్పష్టం చేశారు. మొత్తానికైతే తెలియక తప్పు చేసి చిక్కుల్లో పడింది నవ్య నాయర్ అని చెప్పవచ్చు.