నాని టైర్-2 హీరోనా? అంతకుమించా?

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఇప్పుడు ఓ రేంజ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఆయన.. ఇప్పుడు మరిన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు.;

Update: 2025-08-05 23:30 GMT

టాలీవుడ్ నేచురల్ స్టార్ నాని ఇప్పుడు ఓ రేంజ్ లో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. వరుస హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్న ఆయన.. ఇప్పుడు మరిన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు. క్రేజీ ప్రాజెక్టులు తన లైనప్ లో చేర్చుకుంటున్నారు. రీసెంట్ గా హిట్-3తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్న నాని.. అంతకుముందు హ్యాట్రిక్ సాధించారు.

దసరా మూవీతో మంచి హిట్ సొంతం చేసుకున్న నేచురల్ స్టార్.. ఆ తర్వాత హాయ్ నాన్న మూవీతో మెప్పించారు. మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. అనంతరం సరిపోదా శనివారంతో ఇంకో హిట్ ను సాధించారు. ఇప్పుడు హిట్-3తో వరుసగా నాలుగో విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు ప్యారడైజ్ మూవీలో నటిస్తూ బిజీగా ఉన్నారు.

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. నాని కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతోంది. వచ్చే ఏడాది మార్చి 26న రిలీజ్ కానున్న ఆ మూవీపై ఇప్పటికే ఆడియన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి. రీసెంట్ గా లీక్ అయిన నాని లుక్.. వాటిని మరింత పెంచింది. హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందనుంది.

ఆ సినిమాతో కూడా హిట్ అందుకుంటారని అంతా అప్పుడే ఫిక్స్ అయిపోయారు. అదే సమయంలో టాలీవుడ్ టైర్-2 హీరోల్లో నాని ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకున్నారు. అనేక విషయాల్లో నాని టాప్ లో ఉన్నారు. కొంతకాలంగా ఆయన నటిస్తున్న సినిమాలు అన్ని.. స్ట్రాంగ్ ఓపెనింగ్స్ సాధిస్తున్నాయి. బలమైన బాక్సాఫీస్ పుల్ ను చూపిస్తున్నాయి.

ఓవర్సీస్ లో కూడా మిలియన్ డాలర్ మార్క్ క్రాస్ చేస్తున్నాయి. అక్కడ కూడా నానికి మంచి ఫ్యాన్ బేస్ ఉంది. దీంతో ఆయన నటించిన సినిమాలు ఫారిన్ లో కూడా సాలిడ్ కలెక్షన్స్ సాధిస్తున్నాయి. ముఖ్యంగా నేచురల్ స్టార్ సినిమాలు మినిమమ్ గ్యారంటీ అంతా ఫిక్స్ అయ్యేలా క్రేజ్ సంపాదించుకున్నారు. వర్త్ బుల్ మూవీస్ అనేలా స్టాంప్ వేసుకున్నారు.

అదంతా ఆయన స్క్రిప్ట్ సెలక్షన్ వల్లే అని చెప్పాలి. ఎందుకంటే ప్రేక్షకులు భావోద్వేగపరంగా కనెక్ట్ అయ్యే కథలు మాత్రమే నాని ఎంచుకుంటున్నారు. అటు కమర్షియల్ గా.. ఇటు కంటెంట్ బేస్డ్ గా సమతుల్యం చేసుకుంటున్నారు. ముఖ్యంగా యాక్టింగ్ తో మెప్పిస్తున్నారు. ఓవరాల్ గా టైర్-2లో ఎవరూ చేరుకోలేని స్టేజ్ కు చేరుకున్నారని అంతా అంటున్నారు.

అదే సమయంలో టైర్-2 కాదు.. నాని టైర్ -1 హీరో అనే చెప్పాలి. సెకెండ్ టైర్ నుంచి ఎప్పుడో ఫస్ట్ టైర్ కు వెళ్లిపోయారు. వరుస హిట్స్ తో తన రేంజ్ ను పెంచుకున్నారు. అందుకే ఇప్పుడు ఆయన టైర్-2 హీరో కాదు.. అంతకుమించే. అయితే నానికి మాత్రం టైర్-2, టైర్-1 వంటి పదాలు అస్సలు నచ్చవన్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News