నారా రోహిత్ సుందరకాండ ట్రైలర్.. నవ్వులే నవ్వులు
నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా సుందరకాండ. ఈ సినిమాను వెంకటేశ్ నిమ్మలపూడి తెరకెక్కించారు.;
నారా రోహిత్ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ సినిమా సుందరకాండ. ఈ సినిమాను వెంకటేశ్ నిమ్మలపూడి తెరకెక్కించారు. కామెడీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్ జానర్ లో రూపొందిన ఈ సినిమా వినాయక చవితి పండగ సందర్భంగా ఆగస్టు 27న రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ సోమవారం ట్రైలర్ రిలీజ్ చేశారు.
పెళ్లి కోసం కష్టాలు పడుతున్న ఓ యువకుడి పాత్రలో రోహిత్ అలరించనున్నారు. ఆయన పెళ్లి చేసుకునే అమ్మాయికి ఓ ఐదు క్వాలిటీస్ ఉండాలని రోహిత్ కండిషన్ పెట్టుకుంటారు. అయితే ఏ ట్రైలరైనా డైలాగులు, భారీ షాట్స్ తో ఉంటే.. సుందరకాండ కాస్త ఢిపరెంట్ గా వచ్చింది. ఇందులోనే ఓ ర్యాప్ సాంగ్ తో హీరో పరిస్థితిని గురించి వివరించే ప్రయత్నం చేశారు.
ఓవైపు వయసు పెరిగిపోతుంది. ఈ క్రమంలో పెళ్లికి తనకు కావాల్సిన క్వాలిటీస్ ఉన్న అమ్మాయిని వెతికే ప్రాసెస్ లో జరిగే సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. కాస్ట్, రిలీజియన్ అనే ఫీలింగ్స్ లేవుగా అంటే.. అసలు అమ్మాయి అయితే చాలు అనే ఫీలింగ్ లో ఉన్నాడు. అంటూ డైలాగ్స్ ఫన్నీగా ఉన్నాయి. ఇలా సినిమా ఆధ్యంతం ఇలాగే ఉండనుందని ట్రైలర్ తో హింట్ ఇచ్చారు. ఓవరాల్ గా పెళ్లి అనే కాన్సెప్ట్ తో సినిమాను కామెడీ జానర్ లో తెరకెక్కించారని అర్థమవుతోంది.
ఇక ట్రైలర్ లో నారా రోహిత్ లుక్స్ కూల్ గా ఉన్నాయి. ఆయన డైలాగ్ డెలివరీ, టైమ్ సెన్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈ సినిమాకు రోహిత్ చాలా కాలం నుంచి కష్టపడుతున్నారు. ఎలాగైనా ఈ సారి హిట్ కొట్టాలని ఆయన ఈ ప్రాజెక్ట్ ను సీరియస్ గా తీసుకున్నట్లు తెలుస్తోంది. అలాగే విజులల్స్ కూడా గ్రాండ్ గా అనిపిస్తుంది. మరి రోహిత్ కు తనకు కావాల్సిన అమ్మాయి దొరికిందా.. ఆయనకు పెళ్లి చేయాలన్న తన తండ్రి కోరిక తీరిందా అనేది వెండితెరపై చూడాల్సిందే.
ఇందులో రోహిత్ సరసన శ్రీదేవీ, వ్రితి వాఘని హీరోయిన్లుగా నటిస్తున్నారు. సీనియర్ నటులు నరేశ్, కమెడీయన్ సత్య, అభినవ్ గొమఠం లాంటి స్టార్ కాస్ట్ ఉంది. సందీప్ పిక్చర్స్ బ్యానర్ పై గౌతమ్ రెడ్డి, రాకేశ్, సంతోశ్ సినిమాను నిర్మించారు.