పిక్‌టాక్ : వెల్‌కమ్ టు బ్రహ్మణి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు, మంత్రి నారా లోకేష్ భార్య, సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ కూతురుగా బ్రహ్మణి కావాల్సినంత గుర్తింపు ఉంది;
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోడలు, మంత్రి నారా లోకేష్ భార్య, సీనియర్ స్టార్ హీరో బాలకృష్ణ కూతురుగా బ్రహ్మణి కావాల్సినంత గుర్తింపు ఉంది. అయినా కూడా ఆమె తన ప్రత్యేకతను ఎప్పటికప్పుడు చూపిస్తూనే ఉంటుంది. వ్యాపారంలో ఎప్పుడూ తనకంటూ గుర్తింపు దక్కించుకోవడంతో పాటు, సోషల్ సర్వీస్‌లోనూ నారా బ్రహ్మణి మంచి పేరు దక్కించుకుంది. ముఖ్యంగా నారా బ్రాహ్మణి పేరు చెప్పగానే హెరిటేజ్ గుర్తుకు వస్తుంది. రాజకీయాలతో మామ, భర్త చాలా బిజీగా ఉన్నప్పటికీ అన్ని తానై వ్యాపారంను చేస్తుంది. వ్యాపారంను విజయవంతంగానూ ఆమె నడపడంలో సక్సెస్ అయింది అనడంలో సందేహం లేదు.
నారా బ్రహ్మణికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఇన్‌స్టాగ్రామ్, ఎక్స్‌లో లక్షల సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారు. ఈమెను కొందరు అభిమానిస్తే కొందరు విమర్శిస్తూ కామెంట్స్ చేస్తూ ఉంటారు, వాటన్నింటిని పట్టించుకోకుండా తన పని తాను చేసుకుంటూ వెళ్తుంది. వ్యాపారంలో తనకు పోటీ ఎవరు లేరు అనే విధంగా విజయపథంలో దూసుకు పోతుంది. సేవా కార్యక్రమాలు చేయడంతో పాటు, రాకజీయాల్లో తన అవసరం ఉన్నప్పుడు కచ్చితంగా ముందు ఉంటుంది అని చాలా సందర్భాల్లో నిరూపితం అయ్యింది. బ్రహ్మణి ఎన్నో సార్లు నారా లోకేష్ కి మద్దతుగా జనాల్లోకి వెళ్లడం మనం చూశాం. లోకేష్ రాజకీయ ఎదుగుదలలో బ్రహ్మణి పాత్ర కీలకం.
తాజాగా ఎక్స్ ద్వారా బ్రహ్మణి ఈ ఫోటోను షేర్ చేసింది. స్టార్‌బక్స్ లో కేక్ తీసుకుని, కాస్త చిల్ అవుతున్న ఫోటోలను షేర్ చేసింది. నా పని దినాలను చాలా స్పెషల్ చేయడంలో స్టార్ బక్స్ పాత్ర చాలా కీలకం అంటూ చెప్పుకొచ్చింది. స్టార్ బక్స్ సెలబ్రెటీలకు అడ్డాగా చెబుతూ ఉంటారు. అలాంటి స్టార్ బక్స్‌లోనే ఈమె ఇప్పుడు కనిపించింది. లోకేష్ భార్యగానే కాకుండా వ్యాపారవేత్తగా బ్రహ్మణికి ఉన్న గుర్తింపు, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా స్టార్ బక్స్ గురించి బ్రహ్మణి పోస్ట్ పెట్టడంతో ఒక్కసారిగా దాని గురించి జనాలు తెలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. స్టార్ బక్స్ కి ఆధరణ మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.
బ్రహ్మణి గురించి తండ్రి బాలకృష్ణ మాత్రమే కాకుండా మామగారు నారా చంద్రబాబు నాయుడు, భర్త నారా లోకేష్ సైతం ప్రముఖంగా మాట్లాడుకోవడం మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా తాము రాజకీయాల్లో బిజీగా ఉండటంతో వ్యాపారం విషయంలో అన్ని బ్రహ్మణి చూసుకుంటుందని, కుటుంబ వ్యవహారాలు సైతం తాను చూసుకోవడం చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. నారా లోకేష్ సైతం పలు ఇంటర్వ్యూల్లో వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడాల్సి వచ్చిన సమయంలో బ్రహ్మణి గురించి ప్రత్యేకంగా మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. ఆమె గొప్పతనం గురించి ప్రముఖంగా కామెంట్ చేయడం మనం చూడొచ్చు. చిన్న వయసులోనే ఎన్నో విజయాలను బ్రహ్మణి దక్కించుకున్నారు.