సోషల్ మీడియాలో నయా ట్రెండ్.. హీరోల బనానా పోస్టర్లు ఫుల్ వైరల్
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నానో బనానా , నానో బనానా ట్రెండ్ నడుస్తోంది.;
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా నానో బనానా , నానో బనానా ట్రెండ్ నడుస్తోంది. ఒక వ్యక్తికి ఫుల్ సంబంధించిన ఫొటోను కంప్యూటర్ డెస్క్ టాప్ పై మూడు విధాలుగా చూపించే త్రీ డీ బొమ్మే ఈ నానో బనానా. ఇందులో బ్యాక్ సైడ్, మిడిల్ అండ్ లెఫ్ట్ సైడ్ ఇలా మూడు బొమ్మలు ఒకే ఫొటోనూ ఒరిజినల్ ఫొటోలాగా చేస్తుంది.
ఇది పూర్తిగా ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) జనరేటెడ్ విధానం. మనుషుల ఫొటోలను ఏఐతో 3D బొమ్మలుగా డిజైన్ చేస్తుంది. సోషల్ మీడియా యూజర్లంతా ఇప్పుడు ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఈ క్రమంలోనే సినీ తారలు, సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల నుండి ఇన్ఫ్లుయెన్సర్లు అందరి ఫొటోలను ఈ ట్రెండ్ లో భాగం చేస్తున్నారు. ఇలా డిజైన్ చేసిన ఫొటోలను ఎక్స్ (గతంలో ట్విట్టర్), ఫేస్ బుక్ , ఇన్ట్రాగ్రామ్ లలో పోస్ట్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ప్రభాస్ రాజాసాబ్, పవన్ కల్యాణ్ ఓజీ సినిమా, జూనియర్ ఎన్టీఆర్ డ్యాన్స్ స్టెప్పులు, రామ్ చరణ్ పెద్ది, అల్లు అర్జున్ ఇలా టాలీవుడ్ బడా స్టార్లందరి తమతమ సినిమాలకు సంబంధించి ఫొటోలతో బనానా ట్రేండ్ క్రియేట్ చేస్తున్నారు. ఫ్యాన్స్ ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ హైలైట్ చేస్తున్నారు. ఇవి తెగ వైరల్ అవుతూ.. ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
అయితే ఈ నానో బనానా ట్రెండ్ గూగుల్ ఇటీవల ఈ AI సాధనాన్ని ప్రారంభించింది. దీనిని అధికారికంగా జెమినాఐ (Gemini) 2.5 ఫ్లాష్ ఇమేజ్ అని పిలుస్తారు. ఇది యూజర్ల ఫొటోను రియాలిస్టిక్ యాక్షన్ ఫిగర్ లాంటి డిజైన్‌గా మార్చడానికి అనుమతిస్తుంది. దీంతో ఈ ఫొటోలు స్టోర్ లో చూసే బొమ్మల లాగా కనిపిస్తాయి.
కాగా, జెమిని యాప్ , Google AI ద్వారా ఈ టూల్ ఆగస్టు 26 2025న విడుదలైంది. ఇది నెటిజన్లందరూ ఫ్రీగానే యూజ్ చేయవచ్చు. ఎలాంటి ప్రీమియం అక్కర్లేదు. ఇటీవల ఫేమస్ గిబ్లి ట్రెండ్ లాగానే, ఇప్పుడు నానో బనానా ఇమేజ్ లు కూడా నెటిజన్ల దృష్టిని త్వరగా ఆకర్షించాయి. ఎందుకంటే అవి ప్రొఫెషనల్ గా, ఫన్నీగా కనిపిస్తున్నాయి. ఎవరైనా తమ ఇమేజ్ ను, సెలబ్రిటీని లేదా కల్పిత పాత్రను క్రియేట్ చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరికీ క్రియేటివిటీని చూపించేందుకు ఈ ట్రెండ్ అవకాశాన్ని ఇస్తుంది.