నాని టార్గెట్ మిస్ అవుతున్నట్టేగా?
ఎంత ప్లాన్ చేసుకున్నా ఏదైనా సరే జరిగే టైమ్ వచ్చినప్పుడే జరుగుతుంది. సినిమాలు, వాటి రిలీజ్‌లు కూడా అంతే.;
ఎంత ప్లాన్ చేసుకున్నా ఏదైనా సరే జరిగే టైమ్ వచ్చినప్పుడే జరుగుతుంది. సినిమాలు, వాటి రిలీజ్‌లు కూడా అంతే. అందుకే ముందు ఎన్ని అనుకున్నా సరే కొన్ని విషయాల వల్ల సినిమాల షూటింగులు లేటవుతూ ఉంటాయి. ఫలితంగా రిలీజ్ కూడా అనుకున్న టైమ్ కు అవదు. సినీ ఇండస్ట్రీలో అలా ఒక డేట్ అనుకుని, కుదరక మరో డేట్ కు వాయిదా పడ్డ సినిమాలెన్నో.
రిలీజ్ డేట్ విషయంలో ప్రీ ప్లాన్డ్ గా..
అయితే పరిస్థితులు ఎలా ఉన్నా నేచురల్ స్టార్ నాని మాత్రం తన సినిమా షూటింగ్, రిలీజ్ డేట్ విషయంలో మాత్రం చాలా ప్రీ ప్లాన్డ్ గా ఉంటారు. అందుకే ఆయన సినిమాలెప్పుడూ చెప్పిన డేట్ కే వస్తాయి. రీసెంట్ టైమ్స్ లో నాని హీరోగా వచ్చిన సినిమాలేవీ రిలీజ్ డేట్ టార్గెట్ ను మిస్ అయింది లేదు. రిలీజ్ డేట్ ను చాలా ముందుగానే అనౌన్స్ చేసే అలవాటున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు తన టార్గెట్ ను మిస్ అవుతున్నారు.
ఆలస్యమవుతున్న ది ప్యారడైజ్ షూటింగ్
ఆ సినిమా మరేదో కాదు. ది ప్యారడైజ్. దసరా ఫేమ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరగడం లేదని, అనుకున్న దాని కంటే షూటింగ్ లేటవుతుందని తెలుస్తోంది. అందుకే ది ప్యారడైజ్ ముందు చెప్పినట్టు నెక్ట్స్ ఇయర్ సమ్మర్ లో రిలీజ్ కావడం లేదని, సమ్మర్ తర్వాత మాత్రమే ది ప్యారడైజ్ రిలీజవుతుందని అంటున్నారు.
స్క్రిప్ట్ లేటవడం వల్లే..
హిట్3 సినిమా తర్వాత ది ప్యారడైజ్ షూటింగ్ మొదలుపెట్టడానికి నాని శ్రీకాంత్ ఓదెల కోసం వెయిట్ చేయాల్సి వచ్చింది. స్క్రిప్ట్ లేటవడం వల్ల షూటింగ్ కూడా ఆలస్యమవుతుందని, దాని వల్ల రీసెంట్ షెడ్యూల్స్ కూడా టైమ్ ప్రకారం పూర్తవలేదని తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ది ప్యారడైజ్ షూటింగ్ 2026 మార్చి లాస్ట్ వీక్ వరకు పొగిడించబడుతుందని అంటున్నారు. మార్చి ఆఖరి వారం వరకు షూటింగ్ అంటున్నారంటే కచ్ఛితంగా సినిమా చెప్పిన డేట్ కు రాదని కన్ఫర్మ్ అయిపోవచ్చు. ఎలాగూ రిలీజ్ డేట్ టార్గెట్ మిస్ అవుతుంది కదా అని శ్రీకాంత్ ఈ మూవీని మరింత పకడ్బందీగా ప్లాన్ చేసి, ఈ సినిమాతో దసరాను మించిన సక్సెస్ అందుకోవాలని భావిస్తున్నాడట. అయితే ఈసారి మాత్రం షూటింగ్ మొత్తం పూర్తయ్యాకే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేయాలనుకుంటున్నారట మేకర్స్. సుధాకర్ చెరుకూరి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.