నాని 'ది ప్యారడైజ్' మరో 'కేజీఎఫ్' అవుతుందా?
రియలిస్టిక్ అప్రోచ్‌తో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.50 కోట్లకుపైనే వసూళ్లని రాబట్టింది.;
నేచురల్ స్టార్ నాని హీరోగా వరుస సినిమాలతో బిజీగా ఉంటూనే మరో పక్క నిర్మాతగా కూడా విభిన్నమైన సినిమాలు చేస్తూ విజయాల్ని, ప్రశంసలు సొంతం చేసుకుంటున్నారు. నాని నిర్మించిన లేటెస్ట్ మూవీ `కోర్ట్`. ట్రూ ఈవెంట్స్ స్ఫూర్తితో రూపొందిన ఈ సినిమా ఇటీవలే విడుదలై ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలతో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని రాబడుతూ ట్రేడ్ వర్గాలని విస్మయపరుస్తోంది.
రియలిస్టిక్ అప్రోచ్‌తో రూపొందిన ఈ సినిమా ఇప్పటి వరకు రూ.50 కోట్లకుపైనే వసూళ్లని రాబట్టింది. మరిన్ని రోజుల్లో ఈ ఫిగర్ మరింతగా మారే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇదిలా ఉంటే హీరో నాని ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్నారు. ఒకటి శైలేష్ కొలను డైరెక్ట్ చేస్తున్న `హిట్ 3`. నాని రూత్లెస్ పోలీస్‌గా నటి్తున్న ఈ మూవీని మే 1న భారీ స్థాయిలో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయబోతున్నారు.
దీని తరువాత `దసరా` ఫేమ్ శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్‌లో నాని మరో సారి `ది ప్యారడైజ్` మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్‌ని ప్రారంభించబోతున్నారు. రీసెంట్‌గా విడుదల చేసిన ఈ మూవీ గ్లింప్స్ సినిమాపై అంచనాల్ని పెంచేసింది. విభిన్నమైన గెటప్‌లో రెండు జెడలతో నాని డిఫరెంట్ లుక్‌లో కనిపించిన గ్లింప్స్, అందులోని డైలాగ్‌లు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
ఈ నేపథ్యంలో ఈ మూవీకి సంబంధించిన ఆసక్తికరమైన అప్ డేట్ ఒకటి ప్రస్తుతం ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. `ది ప్యారడైజ్` కోసం నాని, శ్రీకాంత్ ఓదెల రాకింగ్ స్టార్ యష్ `కేజీఆఫ్` ఫార్ములాను ఫాలో అవుతున్నారట. మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో అమ్మకు ఇచ్చిన మాట కోసం రాఖీ భారీ సామ్రాజ్యాన్ని సృష్టించడం, భారత ప్రధానికే సవాల్ విసరడం తెలిసిందే. నాని `ది ప్యారడైజ్` కూడా ఇదే ఫార్ములా కథతో మదర్ సెంటిమెంట్‌తో రూపొందుతోందనే వార్తలు వినిపిస్తున్నాయి.
తల్లికిచ్చిన మాట కోసం నాయకుడిగా ఎదిగి తన వర్గానికి అండగా నిలచే ఓ యువకుడి కథగా దీన్ని తెరపైకి తీసుకురాబోతున్నారు.1960 వ దశకం నేపథ్యంలో ప్రాస్టిట్యూషన్‌పై సాగే కథ ఇదని. ఓ బ్రోతల్ కొడుకు ఆ వర్గానికి అండగా నిలబడి ఏం చేశాడన్నదే ఈ మూవీ ప్రధాన కథగా తెలుస్తోంది. 60వ దశకంలో సికింద్రాబాద్ ఏరియాలో ఓ రెడ్ లైట్ ఏరియా ఉండేది అదే ప్యారడైజ్. దీనిపై తెలంగాణకు చెందిన ఓ రచయిత ఓ బుక్‌ని రాశారు. అదే బుక్ ఆధారంగా `ది ప్యారడైజ్`ని తెరపైకి తీసుకొస్తున్నట్టుగా తెలుస్తోంది.