కన్ఫమ్.. ప్యారడైజ్ వాయిదా!
ఈ ఏడాది మార్చి చివరి వారానికి టాలీవుడ్ నుంచి రెండు క్రేజీ మూవీస్ బాక్సాఫీస్ పోరుకు సిద్ధమైన సంగతి తెలిసిందే.;
ఈ ఏడాది మార్చి చివరి వారానికి టాలీవుడ్ నుంచి రెండు క్రేజీ మూవీస్ బాక్సాఫీస్ పోరుకు సిద్ధమైన సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మూవీ పెద్దితో పాటు నేచురల్ స్టార్ నాని సినిమా ది ప్యారడైజ్ ఆ వీకెండ్‌ను రిలీజ్ కోసం ఎంచుకున్నాయి. వీటిలో ఏదో ఒకటి రేసు నుంచి తప్పుకుంటుందనే ప్రచారం సాగినా.. రెండు చిత్ర బృందాలూ ఆ డేట్‌కే కట్టుబడి ప్రోమోలు రిలీజ్ చేస్తూ వచ్చాయి. ఈ మధ్య కూడా పెద్ది, ది ప్యారడైజ్ టీమ్స్ కొత్త పోస్టర్లు రిలీజ్ చేసి వాటి మీద విడుదల తేదీలను ప్రకటించాయి.
కానీ ఇప్పుడు నాని మూవీ రేసు నుంచి తప్పుకోనున్నట్లు వెల్లడైంది. స్వయంగా నిర్మాత సుధాకర్ చెరుకూరి ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ది ప్యారడైజ్ మూవీకి సంబంధించి సగమే చిత్రీకరణ పూర్తయినట్లు ఆయన వెల్లడించారు. ఇప్పటిదాకా 60 రోజుల షూట్ జరిగినట్లు ఆయన వెల్లడించారు.
ఇంకా ది ప్యారడైజ్‌కు సంబంధించి 60 రోజుల చిత్రీకరణ మిగిలి ఉందని సుధాకర్ చెరుకూరి ఒక ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. ఆల్రెడీ జనవరిలో వారం రోజులు గడిచిపోయాయి. ఇక్కడి నుంచి 60 రోజుల చిత్రీకరణ అంటే.. మార్చి 26న సినిమాను రిలీజ్ చేయడం అసాధ్యమే. ఐతే ఆ డేట్ నుంచి వాయిదా పడడం పక్కా అయినప్పటికీ.. వేసవి సీజన్‌ను మాత్రం వదిలపెట్టబోమని సుధాకర్ సంకేతాలు ఇచ్చారు. సమ్మర్లోనే మంచి డేట్ చూసి ఈ సినిమాను రిలీజ్ చేస్తామన్నారు. మొత్తానికి చరణ్‌తో నాని బాక్సాఫీస్ పోరు ఉండదని తేలిపోయింది.
ఇక రామ్ చరణ్ సినిమా అయినా చెప్పిన డేట్‌కు వస్తుందా రాదా అన్నదే తేలాల్సి ఉంది. తాజాగా ఏఆర్ రెహమాన్ పుట్టిన రోజు సందర్భంగా విషెస్ చెబుతూ రిలీజ్ చేసిన పోస్టర్లో మార్చి 27నే పెద్ది వస్తుందని మేకర్స్ కన్ఫమ్ చేశారు. ఐతే పాన్ ఇండియా స్థాయిలో భారీగా రిలీజ్ చేయాల్సిన సినిమాకు ఈ నెలాఖరులోపు షూట్ పూర్తి చేస్తేనే ఆ డేట్‌ను అందుకోవడం సాధ్యమవుతుంది. లేదంటే పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్లు పూర్తి చేసి మార్చి నెలాఖర్లో రిలీజ్ చేయడం కష్టమవుతుంది.