ఇంత కాన్ఫిడెన్స్ ఏంటి సామీ.. సెట్స్ కోసమే అంత బడ్జెటా?
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.;
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న మోస్ట్ క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ ది ప్యారడైజ్. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దసరా సినిమా ఆల్రెడీ మంచి హిట్ అవడంతో ది ప్యారడైజ్ పై అందరికీ భారీ అంచనాలున్నాయి. ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా దసరా సినిమాను మించేలా ప్యారడైజ్ ను ప్లాన్ చేస్తున్నాడు శ్రీకాంత్.
శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ప్యారడైజ్
ఆల్రెడీ నాని ముక్కు రింగు, పచ్చ బొట్టు, పొడవాటి జడలతో సరికొత్త లుక్ లో కనిపించగా, ప్యారడైజ్ నుంచి ఇప్పటికే వచ్చిన గ్లింప్స్ కు ఆడియన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కాగా ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతుండగా, తాజాగా మేకర్స్ ఈ సినిమా కోసం ఓ భారీ సెట్ ను వేయిస్తున్నట్టు తెలుస్తోంది.
రూ.7.5 కోట్లతో భారీ సెట్
హైదరాబాద్ లోని ఫేమస్ ఫలక్‌నుమా ప్యాలెస్ ను పోలి ఉండే ఓ ఇంటి సెట్ ను ది ప్యారడైజ్ కోసం వేస్తున్నారని, ఈ సెట్ ను నిర్మించడానికి మేకర్స్ సుమారు రూ.7.5 కోట్లను ఖర్చు చేస్తున్నారని, ఈ భారీ సెట్ ను హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసినట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ మూవీ కోసం హైదరాబాద్ శివార్లలో సుమారు 30 ఎకరాల్లో ఓ భారీ స్లమ్ ను సెట్ వేయగా ఇప్పుడు మరో భారీ సెట్ వేయడం విశేషం.
త్వరలోనే మరో గ్లింప్స్
చూస్తుంటే మేకర్స్ ది ప్యారడైజ్ సినిమాకు బడ్జెట్ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదని తెలుస్తోంది. ఆల్రెడీ ఓ భారీ బడ్జెట్ తో ఎంతో పెద్ద స్లమ్ సెట్ ను వేసిన మేకర్స్ ఇప్పుడు మరో భారీ సెట్ వేస్తున్నారంటే కంటెంట్ పై వారికున్న కాన్ఫిడెన్స్ కనిపిస్తుంది. ఇదిలా ఉంటే ఈ మూవీ గురించి మరో అప్డేట్ కూడా వినిపిస్తోంది. ది ప్యారడైజ్ నుంచి డిసెంబర్ చివర్లో లేదా జనవరి స్టార్టింగ్ లో మరో గ్లింప్స్ ను రిలీజ్ చేయాలని టీమ్ భావిస్తుందని తెలుస్తోంది. ఆల్రెడీ ప్యారడైజ్ నుంచి మొదట్లో ఓ గ్లింప్స్ రిలీజ్ చేసి దాంతో ఆడియన్స్ కు మ్యాడ్ లెవెల్ ఎక్స్‌పీరియెన్స్ ను ఇచ్చిన చిత్ర బృందం ఈసారి గ్లింప్స్ లో ఏం ప్లాన్ చేసిందో తెలుసుకోవాలని ఆడియన్స్ ఎంతో ఆతృతగా ఉన్నారు.
మోహన్ బాబు, సోనాలి కులకర్ణి, రాఘవ్ జుయల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు యంగ్ సెన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తుండగా, ఎస్ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ ఈ సినిమాను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. వచ్చే ఏడాది మార్చి 26న తెలుగు, హిందీ, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో రిలీజ్ కానున్న ఈ మూవీ ఓ వైపు షూటింగ్ చేసుకుంటూనే మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను కూడా జరుపుకుంటోంది.