17 ఏళ్లుగా నాని భ‌ద్రంగా దాచుకున్న జ్ఞాప‌కం

కొన్ని కొన్ని విష‌యాల‌ను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేము. ఎన్నేళ్లు అయినా స‌రే ఆ జ్ఞాప‌కాలు, దానికి సంబంధించిన మెమొరీస్ అలానే గుర్తిండిపోతాయి.;

Update: 2025-09-01 19:30 GMT

కొన్ని కొన్ని విష‌యాల‌ను ఎప్ప‌టికీ మ‌ర్చిపోలేము. ఎన్నేళ్లు అయినా స‌రే ఆ జ్ఞాప‌కాలు, దానికి సంబంధించిన మెమొరీస్ అలానే గుర్తిండిపోతాయి. ఆ జ్ఞాప‌కాల‌ను అలానే జీవితాంతం గుర్తు చేసుకుంటూ ఉండ‌టానికి దాని తాలూకా వ‌స్తువుల‌ను దాచుకుంటూ ఉండ‌టానికి ప్ర‌య‌త్నిస్తుంటాం. కేవ‌లం సాధార‌ణ ప్ర‌జ‌లే కాదు, సెల‌బ్రిటీలు కూడా అలాంటివి చేస్తుంటారన‌డానికి నేచుర‌ల్ స్టార్ నానినే బెస్ట్ ఎగ్జాంపుల్.

హీరోగానే కాకుండా నిర్మాత‌గా కూడా!

ఆర్జే గా కెరీర్ ను స్టార్ట్ చేసిన నాని, ఆ త‌ర్వాత ఇండ‌స్ట్రీలోకి అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా వ‌చ్చి మెల్లిగా హీరోగా మారారు. ప్ర‌స్తుతం హీరోగా సినిమాలు చేస్తూనే మ‌రోవైపు వాల్‌పోస్ట‌ర్ సినిమాస్ అనే బ్యాన‌ర్ ను పెట్టి అందులో కొత్త టాలెంట్ ను ఎంక‌రేజ్ చేస్తూ సినిమాలు నిర్మిస్తున్నారు నాని. ఈ ఏడాది హిట్3 సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన నాని ప్ర‌స్తుతం ది ప్యార‌డైజ్ సినిమాతో బిజీగా ఉన్నారు.

ది ప్యార‌డైజ్ షూటింగ్ తో బిజీ

ద‌స‌రా సినిమా త‌ర్వాత శ్రీకాంత్ ఓదెల‌తో నాని చేస్తున్న రెండో సినిమా కావ‌డంతో ది ప్యార‌డైజ్ పై అంద‌రికీ భారీ అంచ‌నాలున్నాయి. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ద‌శ‌లో ఉండ‌గా, రీసెంట్ గా నాని జ‌గ‌ప‌తి బాబు హోస్ట్ చేస్తున్న జ‌య‌మ్ము నిశ్చ‌య‌మ్మురా అనే టాక్ షో కు గెస్ట్ గా వ‌చ్చారు. ఈ షో లో నేచుర‌ల్ స్టార్ త‌న గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విష‌యాల‌ను షేర్ చేసుకున్నారు.

అందుకే ఆ టీ ష‌ర్ట్ చాలా స్పెష‌ల్

షో లో భాగంగా జ‌గ‌ప‌తి బాబు నాని పాత టీ ష‌ర్ట్ ను, ఆ ష‌ర్ట్ తో ఉన్న ఫోటోను తీసి చూపించ‌గా, నాని దాన్ని అక్క‌డ చూసి షాకై దాని వెనకున్న క‌థ గురించి బ‌య‌ట‌పెట్టారు. త‌న ఫ‌స్ట్ ఫోటోషూట్ దాని మీదే అయింద‌ని, అష్టాచెమ్మా మూవీ ఆడిష‌న్స్ కోసం ఫోటోలు కావాల‌ని అడిగిన‌ప్పుడు జూబ్లీహిల్స్ లోని పార్క్ లో ఆ ష‌ర్ట్ మీద అప్ప‌టిక‌ప్పుడు ఫోటోలు దిగి పంపాన‌ని, ఆ త‌ర్వాత అంజుని ఫ‌స్ట్ టైమ్ క‌ల‌వ‌డానికి వెళ్లిన‌ప్పుడు కూడా అదే టీ ష‌ర్ట్ వేసుకున్నాన‌ని, అందుకే ఆ టీ ష‌ర్ట్ ఎంతో స్పెష‌ల్ అని, అంజు దాన్ని దాచిన‌ట్టు నాని చెప్పారు. 17 ఏళ్లైనా నాని దాన్ని అలానే జాగ్ర‌త్త చేయ‌డం చూస్తుంటే అది త‌న‌కెంత స్పెష‌లో అర్థమ‌వుతుంది.

Tags:    

Similar News