కమల్ హాసన్ సీన్ ని 100 సార్లు చూసానన్న నాని..?
కమల్ హాస నటించిన విరుమాండి సినిమాలో ఆయన చివరి సీన్ లో కోర్ట్ లో నిద్రపోతే ఒకరు వచ్చి నిద్రలేపితే ఆయన చేసిన యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది.;
హీరో అవ్వాలనుకున్న ప్రతి యాక్టర్ కి ఎవరో ఒకరిని రిఫరెన్స్ గా తీసుకుంటారు. మెగాస్టార్ చిరంజీవి లా డ్యాన్స్, ఫైట్స్ చేయాలని ఎలా అనుకున్నారో కమల్ హాసన్ లా నటించాలని కూడా అందరు అనుకుంటారు. చాలామందికి స్పూర్తిగా నిలుస్తూ వచ్చారు కమల్ హాసన్. ఆయన ఏదైనా ఒక పాత్ర చేస్తున్నారు అంటే ఆ పాత్ర ప్రాణం పోసుకుంటే ఎలా ఉంటుందో అలా చేస్తారు. అందుకే ఆయన్ని యూనివర్సల్ స్టార్ అని అంటారు.
యాక్టింగ్ లో కమల్ హాసన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. కమల్ అంటే ఇష్టం ఉండని హీరో ఎవరు ఉండరు. అలాంటి వారిలో ఆయన్ను ఒక డిక్షనరీ లా ఫీల్ అయ్యే వాళ్లే ఎక్కువ. ఈ క్రమంలో న్యాచురల్ స్టార్ నాని ఎక్కువగా కమల్ హాసన్ యాక్టింగ్ స్కిల్స్ గురించి ఆయన యాక్టింగ్ ఎబిలిటీ గురించి చెబుతుంటాడు. లేటెస్ట్ గా హిట్ 3 సినిమా టైం లో కూడా హాయ్ నాన్న సినిమాలో తాను హాస్పిటల్ బయట సీన్ లో నటించే టైం లో కమల్ సార్ సీన్ గుర్తు తెచ్చుకుని చేశా అన్నాడు నాని.
కమల్ హాస నటించిన విరుమాండి సినిమాలో ఆయన చివరి సీన్ లో కోర్ట్ లో నిద్రపోతే ఒకరు వచ్చి నిద్రలేపితే ఆయన చేసిన యాక్టింగ్ వేరే లెవెల్ లో ఉంటుంది. అంత సహజంగా ఎలా చేస్తారా అనిపిస్తుంది. ఆ సీన్ తనకు చాలా ఇష్టమని అందుకే 100 సార్లు చూశానని అన్నాడు నాని. ఆ సీన్ రిఫరెన్స్ తీసుకునే తను హాయ్ నాన్నాలో చేశానని అన్నారు నాని.
అలా కమల్ హాసన్ యాక్టింగ్ చూసి స్పూర్తి పొంది తాను చేస్తున్నట్టుగా నాని చెప్పుకొచ్చాడు. నాని కూడా తన న్యాచురల్ యాక్టింగ్ తో అదరగొట్టేస్తున్నారు. ఫ్యాన్స్ కి ఏం కావాలో అది అందిస్తూ కొత్త కథలు కొత్త టాలెంట్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు నాని. ప్రస్తుతం హిట్3 తో మరో ఐదు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నాని ఈ సినిమాతో కూడా తన మార్క్ హిట్ కొట్టాలని చూస్తున్నారు. వరుస సక్సెస్ లతో దూసుకెళ్తున్న నాని హిట్ 3 తో మరో సూపర్ హిట్ ని టార్గెట్ పెట్టాడు. ఐతే ఈ సినిమా నిర్మాతగా కూడా నాని ప్రేక్షకులకు ఒక ఇంటెన్స్ మాస్ క్రైం థ్రిల్లర్ ని అందించనున్నారు.