నాని సైలెంట్‌గా కారు ఇచ్చాడట..!
నాని నటించిన 'హిట్ 3' రిలీజ్‌కి సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఆ సినిమా ప్రమోషన్‌లో నాని బిజీ బిజీగా ఉన్నాడు.;
నాని నటించిన 'హిట్ 3' రిలీజ్‌కి సిద్ధం అవుతోంది. ఇప్పటికే ఆ సినిమా ప్రమోషన్‌లో నాని బిజీ బిజీగా ఉన్నాడు. ఈ సమయంలో నానికి ప్రమోషన్ చాలా అవసరం. హిట్ 3 తో కాకున్నా మరేదైనా ఇష్యూతో నానికి ప్రమోషన్ దక్కినా సినిమాకు మంచి రీచ్ ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఇలాంటి సమయంలో నాని మాత్రం ప్రమోషన్‌కి దూరంగా ఉండటం విడ్డూరంగా ఉంది. హిట్ 3 సినిమాను ప్రమోట్ చేస్తున్న నాని తాను గిఫ్ట్‌గా ఇచ్చిన కారును మాత్రం సీక్రెట్‌గా ఇచ్చి పబ్లిసిటీ లేకుండా చేశాడు. ప్రస్తుతం ఈ విషయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. చిన్న బహుమానం ఇచ్చి పెద్దగా పబ్లిసిటీ చేసుకుంటున్న వారు ఇండస్ట్రీలో ఉన్నారు. ఇలాంటి సమయంలో నాని సైలెంట్‌గా కారు ఇవ్వడం చర్చనీయాంశం అయింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే... నాని సమర్పణలో వచ్చిన 'కోర్ట్' సినిమా సూపర్ హిట్ అయింది. లో బడ్జెట్‌తో రూపొందిన కోర్ట్ సినిమా ఏకంగా రూ.70 కోట్ల వసూళ్లు రాబట్టిన విషయం తెల్సిందే. అంతే కాకుండా నాన్ థియేట్రికల్ రైట్స్‌తోనూ భారీ మొత్తం దక్కింది. కోర్ట్ సినిమా కమర్షియల్‌గానే కాకుండా నానికి మంచి పేరు తెచ్చి పెట్టింది. నాని మంచి కథలను ఎంపిక చేసుకుంటూ సినిమాలు చేస్తున్నాడు అంటూ విమర్శకుల ప్రశంసలు కురిపించారు. ఇలాంటి కథలను నిర్మించేందుకు ముందుకు రావడం గొప్ప విషయం అంటూ నానిపై పలువురు ప్రముఖులు సైతం ప్రశంసలు కురిపించారు. మెగాస్టార్ చిరంజీవి సైతం కోర్ట్ టీంను అభినందించడం తెల్సిందే.
కోర్ట్ సినిమాకు రామ్ దర్శకత్వం వహించాడు. సాధారణంగా చిన్న బడ్జెట్‌తో రూపొందిన సినిమాలు సూపర్ హిట్ అయితే నిర్మాతలు దర్శకులకు బహుమానాలు ఇవ్వడం మనం చూస్తూ ఉంటాం. నాని సైతం కోర్ట్ సినిమా దర్శకుడు రామ్‌కి ఖరీదైన కారును బహుమానంగా ఇచ్చాడట. కానీ ఆ విషయాన్ని మాత్రం సీక్రెట్‌గా ఉంచాడు. ఎలాంటి హడావుడి లేకుండా కనీసం కీ కూడా నాని చేతుల మీదుగా రామ్ కి అందించలేదు. సైలెంట్‌గా నాని ఇవ్వాలని అనుకున్న కారు రామ్ ఇంటి ముందుకు వెళ్లి ఆగిందట. ఈ విషయాన్ని దర్శకుడు రామ్ తాజాగా ఒక సందర్భంలో చెప్పుకొచ్చాడు. తాను ఈ విషయాన్ని బయటకు చెప్పకుండా ఉండేందుకు చాలా ప్రయత్నించాను. కానీ రహస్యంగా ఉంచడం నా వల్ల కాలేదు అన్నాడు.
నాని మంచి మనసుపై రామ్ వ్యాఖ్యలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తనను నమ్మి కోర్ట్ సినిమాను నిర్మించేందుకు ముందుకు వచ్చినందుకు నానికి కృతజ్ఞతలు తెలియజేశాడు. ప్రస్తుతం రామ్ దర్శకత్వంలో సినిమాలను నిర్మించేందుకు పెద్ద నిర్మాతలు రెడీ అవుతున్నారు. ఇప్పటి వరకు తదుపరి సినిమా విషయంలో రామ్ నుంచి స్పష్టత రాలేదు. నాని బ్యానర్‌లోనే మరో సినిమాను అతడు చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అతి త్వరలోనే ఆ ప్రకటన ఉంటుందేమో చూడాలి. మొత్తానికి నాని తన హిట్ 3 సినిమా ప్రమోషన్ కోసం కోర్ట్ సినిమాను వాడుకోవడం లేదు, అంతే కాకుండా తాను ఇచ్చిన బహుమానంను సైతం సైలెంగ్‌గా ఇవ్వడం గొప్ప విషయం అంటూ అభిమానులు కామెంట్ చేస్తున్నారు.