10 రూపాయలు లేని సందర్భాలు.. నాగార్జున ఏమన్నారంటే..?

ధనుష్ లీడ్ రోల్ లో నటించిన కుబేర సినిమాలో కింగ్ నాగార్జున కూడా నటించారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది;

Update: 2025-06-19 16:17 GMT
10 రూపాయలు లేని సందర్భాలు.. నాగార్జున ఏమన్నారంటే..?

ధనుష్ లీడ్ రోల్ లో నటించిన కుబేర సినిమాలో కింగ్ నాగార్జున కూడా నటించారు. శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తుంది. రష్మిక మందన్న హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించారు. సినిమాను ఇప్పటికే తెలుగు, తమిళ భాషల్లో భారీగా ప్రమోట్ చేస్తూ ఆడియన్స్ కి ఎంగేజ్ చేస్తున్నారు. ఇక ఇదే క్రమంలో సినిమా మరింత ప్రేక్షకుల్లోకి వెళ్లేలా యువ సామ్రాట్ నాగ చైతన్యతో కుబేర స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేశారు.

కింగ్ నాగార్జున, శేఖర్ కమ్ములతో నాగ చైతన్య నిర్వహించిన ఈ స్పెషల్ చిట్ చాట్ ఫ్యాన్స్ కి సూపర్ కిక్ ఇచ్చింది. కుబేర కథ అంతా ఒక బిలీనియర్ కి, ఒక పేదవాడికి మధ్య జరిగిన కథ. అందుకే ఈ సినిమా ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ లో కూడా డబ్బుకి సంబంధించిన ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ సంధించారు. నాగ చైతన్య ఈసారి నాగార్జునకు ఎప్పుడైనా 10 రూపాయలు ఉంటే బాగుండు అనిపించిన సందర్భాలు ఉన్నాయా అని అడిగాడు. దానికి నాగార్జున కూడా స్కూల్ డేస్, కాలేజ్ డేస్ లో అలాంటి సందర్భాలు ఉన్నాయని చెప్పారు.

తెచ్చుకున్న డబ్బులు ఆల్రెడీ అయిపోగా ఒక 10 రూపాయలు ఉంటే బాగుండని అనిపించేదని అలాంటివి చాలా ఉన్నాయని అన్నారు. దానికి శేఖర్ కమ్ముల కూడా వంత పాడుతూ అవును అలాంటి సందర్భాలు కూడా ఉన్నాయని అన్నారు. నాగ చైతన్యతో కుబేర ఇంటర్వ్యూ చేయించాలన్న ఆలోచన ఎవరిదో కానీ ఈ ఇంటర్వ్యూ వల్ల సినిమాపై మరింత బజ్ ఏర్పడుతుంది.

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో చైతన్య ఆల్రెడీ లవ్ స్టోరీ సినిమా చేశాడు. ఆ సినిమా సక్సెస్ అయ్యింది. ఐతే అక్కినేని హీరోల్లో ముందు నాగ చైతన్యతో తీసిన శేఖర్ కమ్ముల కుబేరతో నాగార్జునని డైరెక్ట్ చేశారు. ఈ సినిమాలో నాగార్జున రోల్ సంథింగ్ స్పెషల్ గా ఉంటుందని అంటున్నారు. ధనుష్ పాత్రకి ఏమాత్రం తీసిపోని విధంగా నాగ్ రోల్ ఉంటుందని తెలుస్తుంది. కుబేర సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా ఆడియన్స్ కి నచ్చేశాయి. సినిమాకు బుకింగ్స్ కూడా బాగానే ఉన్నాయి.

Tags:    

Similar News