అఖిల్ పై నాగార్జున ఫైర్.. ఆ మాత్రం తెలీదా అంటూ!

అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది.

Update: 2026-07-11 15:06 GMT

అక్కినేని అఖిల్ నటించిన లేటెస్ట్ యాక్షన్ డ్రామా 'లెనిన్' బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో చిత్ర యూనిట్ గ్రాండ్‌గా నిర్వహించిన సక్సెస్ మీట్‌కు కింగ్ నాగార్జున చీఫ్ గెస్ట్‌గా వచ్చారు. మూడేళ్ల విరామం తర్వాత అఖిల్ కెరీర్‌లో ఒక పక్కా కమర్షియల్ సక్సెస్ పడటంతో నాగ్ ఫుల్ జోష్‌లో కనిపించారు. అక్కినేని అభిమానుల అండను గుర్తుచేసుకుంటూ ఆయన చేసిన ఎమోషనల్ కామెంట్స్, సినిమా వెనుక జరిగిన ఆసక్తికర విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

మా ఫ్యాన్స్ దేవుళ్లు.. ఎప్పటికీ రుణపడి ఉంటాం:

సక్సెస్ మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ అక్కినేని అభిమానులపై ప్రశంసల జల్లు కురిపించారు. "మా ఫ్యాన్స్ దేవుళ్లండి.. మీ అందరికీ మేము ఎప్పుడూ రుణపడి ఉంటాము. చైతన్య ఎప్పుడు హిట్ కొడతాడా, అఖిల్ ఎప్పుడు సక్సెస్ అందుకుంటాడా అని మీరంతా ఎంతో కాలంగా ఎదురుచూశారు. గతంలో నాగచైతన్యకు 'తండేల్' రూపంలో మంచి హిట్ వచ్చింది. ఇప్పుడు అఖిల్‌ను కూడా మీరంతా భుజాన వేసుకుని మోశారు. అక్కినేని అభిమానులు కాలర్ ఎగరేసుకునే రేంజ్ హిట్ అందించినందుకు మీకు థాంక్స్" అని నాగ్ భావోద్వేగానికి లోనయ్యారు.

ప్రమోద్ యాక్టింగ్ చూసి అఖిల్‌ను హెచ్చరించా:

ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్‌లో ప్రమోద్ అద్భుతంగా నటించాడు. అతని పెర్ఫార్మెన్స్ గురించి నాగార్జున ఒక ఆసక్తికరమైన విషయం చెప్పారు. "మూవీ చూసాక అఖిల్‌కు చెప్పాను… “జాగ్రత్తగా ఉండాలి, లేదంటే ప్రమోద్ ఈ సినిమా క్రెడిట్ మొత్తం తనవైపు తీసుకుపోతాడు” అని సూచించాను. నువ్వు ఏం చేస్తావో తెలియదు, క్లైమాక్స్ మాత్రం చాలా బాగా చేయాలని అఖిల్‌కు చెప్పాను. ప్రమోద్ అంత బాగా పోటీపడి నటించాడు" అంటూ నాగ్ మెచ్చుకున్నారు.

భాగ్యశ్రీ బోర్సే టెన్షన్.. నాగ్ ఇచ్చిన ధైర్యం:

హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే ఈ సినిమాలో 'భారతి' పాత్రలో అద్భుతంగా నటించింది. అయితే రిలీజ్ కి ముందు ఆమె పడిన టెన్షన్‌ను నాగ్ గుర్తుచేసుకున్నారు. "ఇటీవల భాగ్యశ్రీ బాధపడింది… “నా యాక్టింగ్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు, కానీ తెలుగు ప్రేక్షకుల్లో నుంచి ఆశించిన గుర్తింపు రావడం లేదు. నా పాత సినిమాలు కూడా పెద్దగా హైప్ కాలేదు… అదే నాకు ఆందోళనగా ఉంది.”అప్పుడు నేను.. 'అది నీ తప్పు కాదు, సినిమా తీసేవాళ్ల తప్పు. నువ్వు లెనిన్ చూసి రిలాక్స్ అవ్వు' అని ధైర్యం చెప్పి సినిమా చూపించాను. ఇక ఇప్పుడు సినిమా సక్సెస్ అవ్వడంతో ఆమె హాయిగా నిద్రపోవచ్చు" అని నాగ్ నవ్వుతూ చెప్పారు.

డైరెక్టర్ నందు ఒక 'సరస్వతి పుత్రుడు':

'వినరో భాగ్యము విష్ణు కథ' ఫేమ్ డైరెక్టర్ మురళి కిశోర్ అబ్బూరు (నందు) మేకింగ్‌ను నాగార్జున తెగ పొగిడేశారు. "నందు ఒక సరస్వతి పుత్రుడు. కథలో మార్పులు చెప్పినా వెంటనే వినేవాడు. సినిమాలో డైలాగ్స్ చాలా అద్భుతంగా రాశాడు. 'ఋణం తీర్చుకొనే అవకాశం ఒకసారే వస్తుంది' అనే డైలాగ్, అలాగే 'పుట్టినప్పుడు పేరు ఉండదు ఊపిరి ఉంటుంది.. పోయేటప్పుడు ఊపిరి ఉండదు పేరు మాత్రమే ఉంటుంది' లాంటి మాటలు మనసుకు హత్తుకునేలా ఉన్నాయి" అని నాగ్ ప్రశంసించారు.

ఆ రోజుల గుర్తొచ్చాయి:

సినిమా టీమ్ అంతా కలిసికట్టుగా ఒకే లక్ష్యంతో పని చేయడం చూసి తనకు చాలా అసూయగా అనిపించిందని నాగ్ అన్నారు. ఇప్పుడు నాకు నా పాత రోజులు గుర్తొచ్చాయి. మేము 'శివ', 'నిన్నే పెళ్లాడతా', 'అన్నమయ్య' సినిమాలను ఎంత ప్యాషన్ తో, అందరం కలిసి ఓన్ చేసుకుని చేశామో.. ఈ టీమ్ కూడా అలాగే చేసింది. ఒక ఏడాది క్రితం చైతన్య 'తండేల్' సక్సెస్ మీట్‌కు వచ్చాను, ఇప్పుడు అఖిల్ హిట్ మీట్‌లో ఉన్నాను. చైతన్య, అఖిల్ ఇద్దరూ నాకు రెండు కళ్లు అని అన్నారు.

కింగ్ నాగార్జున స్పీచ్‌తో అక్కినేని అభిమానుల్లో సరికొత్త ఉత్సాహం వచ్చేసింది. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ 'లెనిన్' మూవీ బాక్సాఫీస్ దగ్గర అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. శివాజీ, బ్రహ్మాజీ, సునీల్ లాంటి సీనియర్లు కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రం రాబోయే రోజుల్లో ఇంకెన్ని రికార్డులను సొంతం చేసుకుంటుందో చూడాలి.








Tags:    

Similar News