హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ.. ప్రేమ, పెళ్లి బంధానికి 33 ఏళ్లు!
"స్వాతి ముత్యపు జల్లులలో" అంటూ ‘ప్రేమ యుద్ధం’ చేశారు, "హలో గురూ ప్రేమకోసమేరో ఈ జీవితం" అంటూ డ్యుయెట్లు పాడుకున్నారు.
టాలీవుడ్‌లోని ఎవర్ గ్రీన్ అండ్ మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్ అనగానే మనకు టక్కున గుర్తొచ్చే పేరు అక్కినేని నాగార్జున, అమల. 1992 జూన్ 11న వివాహ బంధంతో ఒకటైన ఈ జంట.. నేటితో విజయవంతంగా 34వ వసంతంలోకి అడుగుపెట్టింది. ఈ ప్రత్యేకమైన రోజున అన్నపూర్ణ స్టూడియోస్‌తో పాటు సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ 'కింగ్ అండ్ క్వీన్'కు హార్టికల్ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ సందర్భంగా వీరి క్యూట్ లవ్ స్టోరీ నెట్టింట వైరల్ అవుతోంది. ఆ విశేషాలు చూద్దాం.
రీళ్లపై మొదలైన రియల్ ప్రేమ కథ:
నాగార్జున, అమల కాంబినేషన్‌కు అప్పట్లో వెండితెరపై విపరీతమైన క్రేజ్ ఉండేది. "స్వాతి ముత్యపు జల్లులలో" అంటూ ‘ప్రేమ యుద్ధం’ చేశారు, "హలో గురూ ప్రేమకోసమేరో ఈ జీవితం" అంటూ డ్యుయెట్లు పాడుకున్నారు. ఇక అలా సినిమాల్లో కలిసి నటిస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య మంచి కెమిస్ట్రీ కుదిరింది. అయితే అందరికంటే ముందుగా నాగార్జునగారే అమలగారి ప్రేమలో పడ్డారట.
అమల కన్నీళ్లతో కింగ్ హృదయం గెలిచింది:
ఒకరోజు సినిమా సెట్‌లో జరిగిన చిన్న సంఘటన వీరిద్దరిని దగ్గర చేసింది. ఆ రోజు అమలగారు షూటింగ్ రాలేదట, బాధపడుతూ క్యారవాన్‌లో వున్నారట, అది చూసిన నాగార్జున లోపలికి వెళ్లి కారణం అడగ్గా.. ఆ సీన్‌లో తను వేసుకున్న బట్టలు కంఫర్ట్‌గా లేవని చెప్పారట. ఇక వెంటనే నాగ్ స్పందిస్తూ.. "నువ్వు బాధపడకు, నేనే స్వయంగా డైరెక్టర్‌తో మాట్లాడి డ్రెస్ మారుస్తాను" అని అండగా నిలిచారు. నాగార్జునగారి ఆ మంచితనమే అమలగారి మనసును గెలుచుకుంది.
అమెరికా ట్రిప్‌లో అకస్మాత్తుగా ప్రపోజల్:
ఇక ఫ్రెండ్స్ నుండి లవర్స్‌గా మారిన వీరు.. ఒకరోజు కలిసి అమెరికా ట్రిప్‌కు వెళ్లారు. అక్కడే నాగార్జునగారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా అమలగారికి పెళ్లి ప్రపోజల్ పెట్టారు. దీని గురించి అమలగారు ఒక ఇంటర్వ్యూలో చెప్తూ.. "ఆయన చాలా అకస్మాత్తుగా ప్రపోజ్ చేశారు. నేను ఎగ్జైట్‌మెంట్‌లోనే.. మనం హైదరాబాద్ షిఫ్ట్ అయిపోతామా? నేను పెళ్లి తర్వాత కూడా వర్క్ చేయవచ్చా? అని అడిగాను. దానికి ఆయన నువ్వు నీకు నచ్చింది చేయొచ్చు అని చెప్పారు" అంటూ ఆ మధుర జ్ఞాపకాలను పంచుకున్నారు.
చెన్నైలో సింపుల్‌గా పెళ్లి.. అఖిల్ ఎంట్రీ:
అమెరికాలో అంత గ్రాండ్‌గా ప్రపోజ్ చేసిన నాగార్జున, పెళ్లి మాత్రం చాలా సింపుల్‌గా ప్లాన్ చేశారు. 1992 జూన్ 11న చెన్నైలో అత్యంత ఆప్తుల మధ్య వీరి వివాహం చాలా సాదాసీదాగా జరిగింది. ఇక ఇద్దరూ కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకోవడంతో అప్పట్లో ఇదొక హాట్ టాపిక్. ఇక పెళ్లయిన రెండేళ్ల తర్వాత వీరికి అఖిల్ అక్కినేని జన్మించారు. నేటికీ ఒకరినొకరు గౌరవించుకుంటూ ఆదర్శ దంపతులుగా సాగిపోతున్నారు.
స్క్రీన్‌పై డ్యుయెట్స్ పాడుకున్న ఈ ప్రేమపక్షులు.. నిజ జీవితంలో పెళ్లి చేసుకోవాలనే ‘నిర్ణయం’ తీసుకుని నేటికి 34 ఏళ్లు పూర్తయ్యాయి. కాలం మారినా వీరిద్దరి మధ్య ప్రేమ, అనుబంధం మాత్రం మారలేదు. అందుకే అభిమానులంతా ఈ జంటను చూసి మురిసిపోతూ పండుగ చేసుకుంటున్నారు. ఎందరికో ఇన్స్పిరేషన్‌గా నిలుస్తున్న నాగార్జున, అమలగారు ఇలాగే ఎప్పటికీ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం..