ఆ రీమేక్ పై కన్నేసిన నాగార్జున!
అయితే నాగ్ తన వందో సినిమా కోసం ఎంతోమంది డైరెక్టర్లు చెప్పిన కథలు విని ఆఖరికి ఓ తమిళ డైరెక్టర్ కు తలూపినట్టు తెలుస్తోంది.;
నా సామిరంగ సినిమా తర్వాత టాలీవుడ్ కింగ్ నాగార్జున సోలో హీరోగా సినిమా వచ్చింది లేదు. నా సామిరంగ సినిమా తర్వాత నాగ్ చేయబోయే సినిమా అతని కెరీర్లోనే మైలురాయిగా నిలిచే వందో చిత్రం కావడంతో ఆ సినిమా కోసం నాగ్ ఏదీ ఓ పట్టాన తేల్చుకోలేకపోతున్నారు. అందుకే కెరీర్లో ఇంత ఎక్కువ గ్యాప్ వచ్చింది. మెయిన్ హీరోగా సినిమాలు చేయకపోయినా కీలకపాత్రల్లో నటించి మెప్పించారు. కానీ అక్కినేని ఫ్యాన్స్ మాత్రం నాగ్ నుంచి ఎప్పుడెప్పుడు సోలో సినిమా వస్తుందా అని ఎదురుచూస్తున్నారు.
అయితే నాగ్ తన వందో సినిమా కోసం ఎంతోమంది డైరెక్టర్లు చెప్పిన కథలు విని ఆఖరికి ఓ తమిళ డైరెక్టర్ కు తలూపినట్టు తెలుస్తోంది. అవును, నాగ్ త్వరలోనే 100వ సినిమాను చేయబోతున్నారు. తమిళ డైరెక్టర్ రా. కార్తీక్ చెప్పిన కథకు నాగ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయని ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు వినిపిస్తున్నాయి.
తన కెరీర్లో మైల్ స్టోన్ ఫిల్మ్ కావడంతో ఈ సినిమాను నాగ్ స్టార్ డైరెక్టర్ తో చేస్తారని అందరూ అనుకున్నారు కానీ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని కోరుకునే నాగ్ ఇప్పుడు తన 100వ సినిమా విషయంలో కూడా అదే దారిలో వెళ్తున్నట్టు తెలుస్తోంది. అందుకే స్టార్ డైరెక్టర్ తో కాకుండా టాలెంట్ ఉన్న రా. కార్తీక్ ను నమ్మి అతని చేతిలో తన 100వ సినిమాను పెట్టారు నాగార్జున.
దీంతో పాటూ మరో రీమేక్ చేయాలని కూడా నాగ్ ప్లాన్ చేస్తున్నారట. తమిళంలో మంత్రిరామూర్తి దర్శకత్వంలో శశికుమార్ చేసిన అయోతి సినిమాను రీమేక్ చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట నాగార్జున. 2023లో రిలీజైన ఈ సినిమా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇప్పుడు నాగ్ ఆ మూవీని రీమేక్ చేయాలనే ఆలోచనతో డిస్కషన్స్ చేస్తున్నారని తెలుస్తోంది. నాగార్జున కొత్తగా ఒప్పుకున్న రెండు సినిమాలూ తమిళ డైరెక్టర్లతోనే కావడం విశేషం. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఆగస్ట్ 29న నాగ్ బర్త్ డే సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్‌మెంట్ వచ్చే వీలుంది.