లాటరీ "కింగ్".. ఇదేం ట్విస్ట్ సామి..?
కింగ్ నాగార్జున 100వ సినిమా అనౌన్స్ మెంట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు.;
కింగ్ నాగార్జున 100వ సినిమా అనౌన్స్ మెంట్ కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. నా సామిరంగ తో హిట్ అందుకున్న నాగార్జున కుబేర, కూలీ సినిమాల్లో డిఫరెంట్ రోల్స్ చేసి మెప్పించారు. అఫ్కోర్స్ అవి అక్కినేని ఫ్యాన్స్ కి అసంతృప్తి ఇచ్చాయి. మా హీరో ఎందుకు సపోర్టింగ్ రోల్, నెగిటివ్ రోల్ చేస్తున్నాడని అనుకున్నారు. కానీ నాగార్జున ఎప్పుడు ప్రయోగాలు చేస్తూనే ఉంటారు. అందుకే నాగార్జున మిగతా హీరోలకన్నా సెపరేట్ అంటుంటారు. ఐతే నాగార్జున 100వ సినిమా గురించి మాత్రం ఏ ఒక్క అప్డేట్ బయటకు రాలేదు.
నాగార్జునని ముద్దుగా కింగ్ అని..
ఐతే తెలుస్తున్న సమాచారం ప్రకారం R కార్తీక్ తో నాగ్ సినిమా కన్ ఫర్మ్ అయింది. ఆయనే రీసెంట్ ఇంటర్వ్యూలో చెప్పారు. ఐతే ఈ సినిమాకు టైటిల్ గా ఒక క్రేజీ టైటిల్ అనుకుంటున్నారట. అదే లాటరీ కింగ్. మన కింగ్ నాగార్జునని ముద్దుగా కింగ్ అని పిలుస్తారు. అలాంటిది ఆయన లాటరీ కింగ్ అనే టైటిల్ తో సినిమా చేయడం కాస్త షాకింగ్ గానే అనిపిస్తుంది. ఐతే డైరెక్టర్ కథకు ఇదే పర్ఫెక్ట్ టైటిల్ అని అనుకుంటున్నారట.
ఈ సినిమాలో నాగార్జున సరసన ముగ్గురు హీరోయిన్స్ నటిస్తారట. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో ఈ సినిమా నిర్మిస్తారని తెలుస్తుంది. ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తారు. ఈ సినిమా ఒక హిలేరియస్ ఎంటర్టైనింగ్ అందిస్తూనే మాస్ స్టఫ్ విత్ ఫుల్ ఎమోషన్స్ అని అంటున్నారు. లాటరీ కింగ్ నాగార్జున 100వ సినిమాగా చేయడం సంథింగ్ స్పెషల్ గా ఉంటుంది.
సినిమా కోసం లుక్ కూడా కొత్తగా..
నాగార్జున ఈ సినిమా కోసం లుక్ కూడా కొత్తగా ట్రై చేస్తున్నారట. స్టైల్ కి ఐకాన్ గా నాగార్జున గత 3 దశాబ్దాలుగా అదరగొట్టేస్తున్నారు. ఇక కెరీర్ లో మైల్ స్టోన్ మూవీ 100వ సినిమాకు కూడా తన ప్రత్యేకత చాటాలని చూస్తున్నారు నాగార్జున. మరి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమా షూటింగ్ ని సైలెంట్ గా ఈరోజు మొదలు పెడుతున్నారట. త్వరలోనే సినిమాకు సంబందించిన అఫీషియల్ అనౌన్స్ మెంట్ వస్తుందని తెలుస్తుంది. నాగార్జున R కార్తీక్ కాంబోలో వస్తున్న లాటరీ కింగ్ (వర్కింగ్ టైటిల్) అక్కినేని ఫ్యాన్స్ కి ఎలాంటి ట్రీట్ అందిస్తుందో చూడాలి.
నాగార్జున 100వ సినిమా కోసం చాలా టైం తీసుకున్నారు. అన్ని వర్గాల ఆడియన్స్ ని మెప్పించేలా కెరీర్ లో ఈ సినిమా ఒక స్పెషల్ అనిపించేలా ఉండాలని చాలా కథలు విన్నారు నాగార్జున. ఫైనల్ గా లాటరీ కింగ్ కి ఓటేశారు.