ముగ్గురు భామ‌ల‌తో సీనియ‌ర్ హీరో రొమాన్స్

99వ సినిమాగా వ‌చ్చిన నా సామిరంగ మంచి హిట్ అవ‌డంతో అక్కినేని ఫ్యాన్స్ కు నాగ్ 100వ సినిమాపై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ల్యాండ్ మార్క్ మూవీని చాలా భారీగా ప్లాన్ చేయాల‌ని నాగ్ కూడా చాలానే ప్ర‌య‌త్నాలు చేశారు.;

Update: 2025-11-02 16:30 GMT

టాలీవుడ్ మ‌న్మ‌థుడు అక్కినేని నాగార్జున సోలో హీరోగా సినిమా వ‌చ్చి చాలా కాల‌మ‌వుతుంది. ఆయ‌న్నుంచి ఆఖ‌రిగా వ‌చ్చిన సినిమా నా సామిరంగ‌. 99వ సినిమాగా వ‌చ్చిన నా సామిరంగ మంచి హిట్ అవ‌డంతో అక్కినేని ఫ్యాన్స్ కు నాగ్ 100వ సినిమాపై భారీ అంచ‌నాలేర్ప‌డ్డాయి. ల్యాండ్ మార్క్ మూవీని చాలా భారీగా ప్లాన్ చేయాల‌ని నాగ్ కూడా చాలానే ప్ర‌య‌త్నాలు చేశారు.

కుబేర, కూలితో మంచి స‌క్సెస్‌లు..

అందులో భాగంగానే ఎంతో మంది డైరెక్ట‌ర్లు చెప్పిన క‌థ‌ల‌ను విన్నారు. కానీ నాగ్ ను మెప్పించే క‌థ‌లు రాక‌పోవ‌డంతో ఆయ‌న వేరే దారిలోకి వెళ్లి ఇత‌ర హీరోలు న‌టించే సినిమాల్లో కీల‌క పాత్ర‌ల్లో క‌నిపించారు. అలా చేసిన సినిమాలే కుబేర‌, కూలీ. ఈ రెండు సినిమాల‌తో న‌టుడిగా మంచి స‌క్సెస్ అందుకున్న నాగ్ రీసెంట్ గానే త‌న 100వ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లారు.

త‌మిళ డైరెక్ట‌ర్ తో నాగ్100వ సినిమా

ఎంతో మంది డైరెక్ట‌ర్ల క‌థ‌ల‌ను విన్న నాగార్జున‌కు త‌మిళ డైరెక్టర్ రా కార్తీక్ చెప్పిన క‌థ న‌చ్చ‌డంతో వెంట‌నే ఆయ‌న‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చి ఆ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లగా, ఈ మూవీ ప‌వ‌ర్ ప్యాక్డ్స్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ గా ఉండ‌బోతుంద‌ని నాగ్ ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఇప్పుడీ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెలుస్తోంది.

మెయిన్ హీరోయిన్ గా ట‌బు

కింగ్100 వ‌ర్కింగ్ టైటిల్ తో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నాగ్ స‌ర‌స‌న ముగ్గురు హీరోయిన్లు న‌టించ‌నున్నార‌ని తెలుస్తోంది. అందులో సీనియ‌ర్ హీరోయిన్ ట‌బు కీల‌క పాత్ర‌లో న‌టిస్తుండ‌గా, రీసెంట్ గా సుస్మితా భ‌ట్ మ‌రో హీరోయిన్ గా ఎంపికైన‌ట్టు స‌మాచారం. మూడో హీరోయిన్ గా ఓ ప్ర‌ముఖ హీరోయిన్ ను ఫిక్స్ చేయ‌డానికి మేక‌ర్స్ డిస్క‌ష‌న్స్ చేస్తున్నార‌ని, రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన ఓ చిన్న షెడ్యూల్ కూడా పూర్తైన‌ట్టు తెలుస్తోంది. మ‌రి ముగ్గురు భామ‌లతో నాగ్ ఈసారి ఏ మేర‌కు మెప్పిస్తారో చూడాలి.

Tags:    

Similar News