• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  తండేల్ ఓ పనైపోయింది.....

తండేల్ ఓ పనైపోయింది.. లేటెస్ట్ స్టిల్స్ వైరల్

| అక్కినేని హీరో యువసామ్రాట్ నాగ చైతన్య.. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు

By - Tupaki Desk
Update: 2024-02-05 15:05 GMT

అక్కినేని హీరో యువసామ్రాట్ నాగ చైతన్య.. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు అన్ని జానర్లు టచ్ చేసిన ఆయన.. ప్రస్తుతం తండేల్ మూవీ చేస్తున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలకు చెందిన కొందరి మత్స్యకారుల నిజ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య.. ఓ మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నారు.


సక్సెస్ ఫుల్ డైరెక్టర్ చందూ మొండేటి, నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ క్రేజీ కాంబినేషన్‌ లో తండేల్ మూవీ ఈ మధ్యే సెట్స్ పైకి వెళ్లింది. అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ వాసు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఉడిపి సహా అనేక ప్రాంతాల్లో జరిగింది. ఎట్టకేలకు ఈ చిత్రానికి సంబంధించిన కీలకమైన లెంతీ షెడ్యూల్ కంప్లీట్ అయినట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.


సినిమాకు చెందిన కీలక సన్నివేశాలు పోర్టు సహా బ్యూటిఫుల్ విలేజ్ లో చిత్రీకరించినట్లు తెలిపారు. ఈ షెడ్యూల్ లో ప్రధాన తారాగణం పాల్గొన్నట్లు పేర్కొన్నారు. చిత్రానికి సంబంధించిన అప్డేట్స్ ఇకపై వరుసగా వస్తాయని చెప్పుకొచ్చారు. త్వరలో టీమ్ నుంచి వరుస అప్డేట్స్ తో ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఉంటుందన్నమాట. ఈ మేరకు వర్కింగ్ స్టిల్స్ ను మేకర్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు.


ఈ చిత్రాన్ని చాలా రియలిస్టిక్ గా తీస్తున్నారు మేకర్స్. వర్కింగ్ స్టిల్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతోంది. నాగ చైతన్య, సాయి పల్లవి చాలా నేచురల్ గా కనిపించారు. చైతూ.. ఫుల్ గా గడ్డంతో రగ్డ్ లుక్ లో కనిపిస్తుండగా.. సాయిపల్లవి అచ్చ పల్లెటూరి అమ్మాయిలా లంగా వోణీలో ఆకట్టుకుంటోంది. ప్రేక్షకులకు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ అందించడం కోసం బ్యూటిఫుల్ లొకేషన్స్ లో చిత్రాన్ని షూట్ చేస్తున్నారు మేకర్స్.

ఇక ఈ సినిమాతో అద్భుతమైన లవ్ స్టోరీ చూడబోతున్నారని టీం ముందు నుంచి చెబుతోంది. షూట్ ప్రారంభించే ముందు ఇంటెన్స్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ చేసింది. నాగ చైతన్య కూడా తన పాత్ర కోసం కంప్లీట్ మేకోవర్ అయ్యారు. అత్యున్నత సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. స్టోరీలో మ్యూజిక్ కు మంచి స్కోప్ ఉన్నందున రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ తన సౌండ్‌ ట్రాక్‌ లు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ తో ప్రేమ కథను అందంగా తీర్చిదిద్దుతున్నారు. మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి.

Tags:    
  • Akkineninagachaitanya 
  • Thandel 
  • Chandoomondeti 
  • Nagachaitanya 
  • Bunnyvas 
  • Geethaarts 
  • Saipallavi 
  • Thandelmovie 

Similar News

తరుణ్ భాస్కర్.. నెక్స్ట్ ఆ హీరో దగ్గరికేనా!

2026-11-05 07:17 GMT

రహస్యం బయటపెట్టిన భాగ్యశ్రీ.. ఆ టాలెంట్ కూడా ఉందా?

2026-11-05 07:03 GMT

టాలీవుడ్‌లో కొత్త దర్శకుల కొరత..!

2026-11-05 06:55 GMT

నా కుటుంబంలోనే మూడు మతాలు.. ఆసక్తికర విషయం చెప్పిన నగ్మా!

2026-11-05 06:51 GMT

టాలీవుడ్‌లో నాని రూటే సెపరేట్.. ఏకంగా ఆ కుర్చీకే ఎసరు..!

2026-11-05 06:43 GMT

క్లాసిక్ ఇమేజ్ నుంచి న్యూ ట్రెండ్‌ వరకు.. నజ్రియా సరికొత్త ప్లాన్!

2026-11-05 06:38 GMT

సమ్మర్ హాలిడేస్ ఇండియా & USA థియేటర్స్ లిస్ట్

2026-11-05 06:37 GMT

ఆ ఇద్దరి వల్ల కల్కి 2 సినిమాకి బ్రేకులు..!

2026-11-05 06:14 GMT

రామ్ చరణ్.. దర్శకుడు మారినా బడ్జెట్ మారట్లేదే!

2026-11-05 06:13 GMT

ఇద్ద‌రు జాతీయ ఉత్త‌మ న‌టుల ప్ర‌ద‌ర్శ‌న‌తో పూన‌కాలే!

2026-11-05 04:16 GMT

హీరోలు, దర్శకులు, హీరోయిన్లు లేకుండానే సినిమాలు..!

2026-11-05 04:15 GMT

స్టార్ట్ నటుడు తమ్ముడితో దేవిశ్రీప్రసాద్ పోరాటం..!

2026-11-05 04:14 GMT

Copyright @2026

Powered by Blink CMS