బాబాయ్ పేరు మీద వేరే లెవెల్ మల్టీప్లెక్స్ కడతా

టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగవంశీ వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే.;

Update: 2025-07-04 05:14 GMT
బాబాయ్ పేరు మీద వేరే లెవెల్ మల్టీప్లెక్స్ కడతా

టాలీవుడ్ ప్రొడ్యూసర్ నాగవంశీ వరుస విజయాలతో సక్సెస్ ఫుల్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ అండ్ డైనమిక్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నారు. చక్కటి స్టోరీలను ఎంచుకోవడంతో పాటు దానికి తగ్గట్టు నటీనటులు సెలెక్ట్ చేసుకోవడంలో నాగవంశీ స్టార్టింగ్ నుంచి తనదైన ప్రతిభను కనబరుస్తున్నారు.

తన బాబాయి, నిర్మాత, హారిక హాసిని క్రియేషన్స్ అధినేత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) అడుగుజాడల్లో నడుస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. హారిక హాసినికి అనుబంధ సంస్థగా ఏర్పడిన సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ బాధ్యతలు చూస్తున్న నాగవంశీ.. ఇప్పుడు తన బాబాయ్ పేరు మీద మల్టీప్లెక్స్ కట్టనున్నారట.

బాబాయ్ పేరు మీద ఒక్క మంచి మల్టీప్లెక్స్ కట్టాలని ఉందని ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ తెలిపారు. వరల్డ్ బిగ్గెస్ట్ స్క్రీన్ ను నిర్మిస్తానని చెప్పారు. అది ఎలా కుదురుతుందో చూడాలని అన్నారు. థియేటర్స్ బిజినెస్ లోకి వెళ్లిపోవాలని లేదని.. కానీ థియేటర్ మాత్రం కడతానని వెల్లడించారు. అది ఎక్కడైనా జరగవచ్చని పేర్కొన్నారు నాగవంశీ.

తనను ఇంతటి పొజిషన్ కు తీసుకొచ్చిన బాబాయ్ కు రిటర్న్ గిఫ్ట్ గా మల్లీప్లెక్స్ కడతానని తెలిపారు. అవుతుందో లేదో తెలియకపోయినా.. ట్రై చేస్తానని చెప్పారు. దానికి మరో రెండు మూడేళ్లు పట్టొచ్చని వెల్లడించారు. అప్పుడు ఆర్థికంగా సెట్ అవుతానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆయన కామెంట్స్.. సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి.

అదే సమయంలో హారిక హాసిని క్రియేషన్స్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ గురించి మాట్లాడారు నాగవంశీ. తాను హారిక హాసినిపై ఎక్కువ ఫోకస్ చేస్తానని, తన బాబాయ్ రాధాకృష్ణ సితారను ఎక్కువ పట్టించుకుంటారని తెలిపారు. కానీ పేర్లు మాత్రం రివర్స్ అన్నారు. తమకు పార్టనర్ గా త్రివిక్రమ్ ఎప్పటి నుంచో ఉన్నారని పేర్కొన్నారు.

ఆయనను బ్యానర్ ను పెట్టమని తానే అడిగానని తెలిపారు. మై హోమ్ తన ఫైనాన్షియల్ పార్టనర్ అని చెప్పారు. సినిమాలు పెరుగుతున్న కొద్దీ.. ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుందని అన్నారు. తనకు మై హోమ్ బాగా సపోర్ట్ చేస్తుందని.. అందుకే భారీ సినిమాలు చేస్తున్నట్లు తెలిపారు. తన వర్కింగ్ స్పేస్ వారికి బాగా అర్థమైందని వెల్లడించారు. ఎలాంటి ఇష్యూస్ లేవని, స్మూత్ గా వెళ్తున్నామని చెప్పారు.

Tags:    

Similar News