నభా బర్త్ డే బాష్.. ఎంత క్యూట్ గా ఉందో!

నభా నటేష్ పోస్ట్ చేసిన బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుండడంతో అభిమానులతోపాటు అనేక మంది నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. బిలేటెడ్ బర్త్ డే విషెస్ చెబుతున్నారు.;

Update: 2025-12-12 17:02 GMT

హీరోయిన్ నభా నటేష్ గురించి అందరికీ తెలిసిందే. కన్నడ భామనే అయినా తెలుగులో మంచి గుర్తింపు సంపాదించుకున్నారనే చెప్పాలి. అందం, అభినయం సమపాళ్లలో ఉన్న అమ్మడు.. తనకంటూ టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో స్పెషల్ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్నారు. రీసెంట్ గా తన పుట్టినరోజును జరుపుకున్నారు.

 

నిన్ననే తన పుట్టినరోజు జరుపుకున్న నభా నటేష్.. రీసెంట్ గా సోషల్ మీడియాలో సెలబ్రేషన్స్ పిక్స్ ను షేర్ చేశారు. కేక్ కటింగ్ ఫోటోలను పోస్ట్ చేయగా.. అవి ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఫ్యామిలీతో పుట్టినరోజును సెలబ్రేట్ చేసుకున్న అమ్మడు.. ఏదో కేఫ్ లో కట్ చేసినట్లు కనిపిస్తున్నారు. ఆ తర్వాత అంతా కలిపి లంచ్ చేసినట్లు అర్థమవుతుంది.

 

నభా నటేష్ పోస్ట్ చేసిన బర్త్ డే సెలబ్రేషన్స్ పిక్స్ ఇప్పుడు నెట్టింట చక్కర్లు కొడుతుండడంతో అభిమానులతోపాటు అనేక మంది నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. బిలేటెడ్ బర్త్ డే విషెస్ చెబుతున్నారు. మోడ్రన్ డ్రెస్ లో అమ్మడు చాలా క్యూట్ గా ఉన్నారని చెబుతున్నారు. తన లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్నారని అంటున్నారు.

 

ఇక నభా నటేష్ సినీ కెరీర్ విషయానికొస్తే.. కన్నడలో ప్రముఖ నటుడు శివరాజ్ కుమార్ హీరోగా నటించిన వజ్రకాయ మూవీతో కథానాయికగా ఇంట్రడ్యూస్ అయింది. ఆ తర్వాత 2018లో టాలీవుడ్ యంగ్ హీరో సుధీర్ బాబు నటించిన నన్ను దోచుకుందువటే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు నభా నటేష్.

 

పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన నభా.. అప్పుడే లైమ్ లైట్ లోకి వచ్చారని చెప్పాలి. ఆ తర్వాత వరుస అవకాశాలు ఆమె సొంతమయ్యాయి. డిస్కో రాజా, అదుగో, సోలో బ్రతుకే సో బెటర్, అల్లుడు అదుర్స్, మ్యాస్ట్రో తదితర సినిమాల్లో నభా నటేష్ నటించగా.. యాక్టింగ్ కు మంచి మార్కులు పడ్డాయి.

కానీ ఆ సినిమాలేవీ హిట్ కాలేదు. దీంతో ఛాన్స్ లు తగ్గాయి. ఇంతలో ప్రమాదానికి గురవ్వడంతో సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఇప్పుడు తిరిగి కోలుకొని వరుసగా సినిమాలను లైనప్ లో పెట్టిన అమ్మడు.. చివరగా డార్లింగ్ మూవీలో మెరిశారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అయింది. ప్రస్తుతం నిఖిల్ హీరోగా రూపొందుతున్న స్వయంభులో యాక్ట్ చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఎలాంటి హిట్ అందుకుంటారో వేచి చూడాలి.

Tags:    

Similar News